AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Covid-19 3rd wave: పిల్లలపై థర్డ్ వేవ్ ముప్పు..? మరింత క్లారిటీ ఇచ్చిన కోవిడ్ టాస్క్‌ఫోర్స్ చీఫ్

Covid-19 impact kids: దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. అయితే.. ఇది ముగియక ముందే.. మూడో వేవ్ వ‌స్తోంద‌ని.. అది పిల్ల‌ల‌పై తీవ్ర ప్ర‌భావం చూప‌బోతోంద‌న్న వార్త‌లు

Covid-19 3rd wave: పిల్లలపై థర్డ్ వేవ్ ముప్పు..? మరింత క్లారిటీ ఇచ్చిన కోవిడ్ టాస్క్‌ఫోర్స్ చీఫ్
V.k.paul
Shaik Madar Saheb
|

Updated on: Jun 08, 2021 | 2:28 PM

Share

Covid-19 impact kids: దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. అయితే.. ఇది ముగియక ముందే.. మూడో వేవ్ వ‌స్తోంద‌ని.. అది పిల్ల‌ల‌పై తీవ్ర ప్ర‌భావం చూప‌బోతోంద‌న్న వార్త‌లు అందరినీ కలవరపెడుతున్నాయి. అయితే దీనిపై మరింత స్పష్టతనిచ్చారు.. కోవిడ్ టాస్క్‌ఫోర్స్ చీఫ్ వీకే పాల్‌. థ‌ర్డ్ వేవ్ పిల్ల‌ల‌పై ప్ర‌భావం చూపుతుంద‌న‌డానికి ఎలాంటి ఆధారాలు లేవ‌ని పాల్ స్ప‌ష్టం చేశారు. ఈ మేరకు ఆయన ఓ టీవీ ఛానెల్‌తో మాట్లాడారు. ప్ర‌త్యేకంగాపై పిల్ల‌ల‌పైనే ప్ర‌భావం చూపే వేవ్ ఉంటుంద‌న్న‌ దానిపై ఇప్పటివరకూ స్ప‌ష్ట‌త లేదన్నారు. ఇప్ప‌టి వ‌ర‌కూ క‌రోనా అందరిపై ఒకే ర‌క‌మైన ప్ర‌భావం చూపిందని వీకే పాల్ తెలిపారు.

కేంద్ర ఆరోగ్య శాఖ విడుద‌ల చేసిన సెరోప్రివ‌లెన్స్ డేటా ఇదే స్ప‌ష్టం చేస్తోందన్నారు. వ్య‌క్తుల బ్ల‌డ్ సీరంలో ఉండే వ్యాధి కార‌కాల స్థాయిని తెలిపేదే ఈ సెరోప్రివ‌లెన్స్‌. ఇది పెద్ద‌లు, పిల్ల‌ల్లో ఒకేలా ఉన్న‌ట్లు వీకే పాల్ వెల్లడించారు. త‌ల్లిదండ్రులు వ్యాక్సిన్లు తీసుకుంటే చాలు దాని వ‌ల్ల పిల్ల‌ల‌కు ర‌క్ష‌ణ క‌లుగుతుంద‌ని వీకే పాల్ పేర్కొన్నాు. ఇంట్లోని పెద్ద‌లు వ్యాక్సిన్లు తీసుకోవ‌డం వ‌ల్ల వైర‌స్ పిల్ల‌ల వ‌ర‌కూ వైరస్ రావ‌డం అంత సులువు కాద‌ని ఆయ‌న అభిప్రాయపడ్డారు.

కాగా.. థ‌ర్డ్ వేవ్ అనేది ప్ర‌త్యేకంగా పిల్ల‌ల‌పైనే ప్ర‌భావం చూపుతుంద‌న‌డానికి ఎలాంటి ఆధారాలు లేవ‌ని.. ఎవరూ ఆందోళన గురికావాల్సిన అవసరం లేదని ఎయిమ్స్ చీఫ్ ర‌ణ్‌దీప్ గులేరియా కూడా స్ప‌ష్టం చేశారు. ఇదిలాఉంటే.. ఇండియ‌న్ అకాడ‌మీ ఆఫ్ పీడియాట్రిక్స్ కూడా త‌ల్లిదండ్రులు భ‌య‌ప‌డాల్సిన అవ‌సరం లేద‌ని పేర్కొంది. ఈ వార్త‌ల‌కు శాస్త్రీయ ఆధారాలు అంటూ ఏవీ లేవ‌ని ఐఏపీ స్పష్టంచేసింది. అయిేత.. ఒక‌వేళ పిల్ల‌ల‌కు క‌రోనా సోకినా చాలా వ‌ర‌కు ల‌క్ష‌ణాలు ఉండ‌బోవ‌ని, ఇంట్లోనే చికిత్స చేసుకోవ‌చ్చ‌ని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. అయితే పిల్లలకు వైర‌స్ సోకకుండా ముందే అన్ని జాగ్ర‌త్త‌లూ తీసుకుంటే మంచిదని నిపుణులు స్ప‌ష్టం చేస్తున్నారు.

Also Read:

TS Cabinet Meeting Live: మరి కాసేపట్లో తెలంగాణ కేబినేట్ సమావేశం.. కీలక నిర్ణయాలు తీసుకోనున్న కేసీఆర్ సర్కార్

Covid-19 Among Children: పిల్లలు జాగ్రత్త..! థర్డ్‌ వేవ్‌పై అప్పుడే మొదలైన దడ.. మూడో దశ ముప్పు నేపథ్యంలో చిల్డ్రన్‌ కేరింగ్‌పై ఆందోళన..!