VPCI Recruitment: వల్లభభాయ్‌ పటేల్‌ చస్ట్ ఇన్‌స్టిట్యూట్‌లో నాన్‌ టీచింగ్ పోస్టులు.. ఇలా దరఖాస్తు చేసుకోవాలి..

VPCI Recruitment 2021: వల్లభభాయ్‌ పటేల్‌ చస్ట్‌ ఇన్‌స్టిట్యూట్‌ (వీవీసీఐ) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఢిల్లీలోని యూనివర్సిటీ ఆఫ్‌ ఢిల్లీకి చెందిన ఈ సంస్థలో..

VPCI Recruitment: వల్లభభాయ్‌ పటేల్‌ చస్ట్ ఇన్‌స్టిట్యూట్‌లో నాన్‌ టీచింగ్ పోస్టులు.. ఇలా దరఖాస్తు చేసుకోవాలి..
Vpci Recruitment
Follow us
Narender Vaitla

| Edited By: Phani CH

Updated on: Oct 26, 2021 | 6:57 AM

VPCI Recruitment 2021: వల్లభభాయ్‌ పటేల్‌ చస్ట్‌ ఇన్‌స్టిట్యూట్‌ (వీవీసీఐ) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఢిల్లీలోని యూనివర్సిటీ ఆఫ్‌ ఢిల్లీకి చెందిన ఈ సంస్థలో నాన్‌ టీచింగ్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఏయో విభాగాల్లో పోస్టులు ఖాళీలు ఉన్నాయి, ఎలా దరఖాస్తు చేసుకోవాలి లాంటి పూర్తి వివరాలు మీకోసం..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 71 ఖాళీలను భర్తీ చేయనున్నారు.

* ఇందులో అసిస్టెంట్‌ రిజిస్టార్‌, సెక్షన్‌ ఆఫీసర్‌, సీనియర్‌ అసిస్టెంట్, ఫార్మసిస్ట్‌, అసిస్టెంట్‌, స్టెనోగ్రాఫర్‌ పోస్టులు ఉన్నాయి.

* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు పదో తరగతి, ఇంటర్మీడియట్‌, గ్రాడ్యుయేషన్‌, బీఎస్సీ, బీఈ/ బీటెక్‌, ఎంటెక్‌లో ఉత్తీర్ణత పొంది ఉండాలి. వీటితో పాటు సంబంధిత పనిలో అనుభవం తప్పనిసరి.

* అభ్యర్థుల వయసు పోస్టులను అనుసరించి 27 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* అభ్యర్థులను కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష, పర్సనాలిటీ బెస్ట్‌ ద్వారా షార్ట్‌ లిస్ట్‌ చేస్తారు. చివరిగా ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

Also Read: Ind Vs Pak: మహ్మద్ షమీ నీకు మద్దతు.. సోషల్ మీడియాలో నెటిజన్ల కామెంట్లపై  ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఫైర్..

IPL New Teams Auction: కార్పోరేట్ల చేతుల్లోకి ఇండియన్ ప్రీమియర్ లీగ్.. లక్నో, అహ్మాదాబాద్ టీంల ఎంట్రీతో మారిన సీన్..!

Freshers Party: ఇదెక్కడి స్వాగతం సామీ.. ఇలా కూడా వెల్‌కమ్ చెబుతారా?.. ఆ యూనివర్సిటీలో ప్రెషర్స్ పార్టీ స్టైలే వేరు..!