HLL Recruitment: హెచ్‌ఎల్‌ఎల్ లైఫ్‌కేర్ లిమిటెడ్‌లో ఉద్యోగాలు.. ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే..
HLL Lifecare Recruitment 2021: చెన్నైలోని హెచ్‌ఎల్‌ఎల్ లైఫ్‌కేర్ లిమిటెడ్ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. భారత ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ...
HLL Lifecare Recruitment 2021: చెన్నైలోని హెచ్‌ఎల్‌ఎల్ లైఫ్‌కేర్ లిమిటెడ్ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. భారత ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖకి చెందిన మినీరత్న కంపెనీ అయిన ఈ సంస్థలో కాంట్రాక్ట్ విధానంలో ఉద్యోగులను తీసుకోనున్నారు. నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలపై ఓ లుక్కేయండి..
భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..
* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 33 ఖాళీలను భర్తీ చేయనున్నారు.
* వీటిలో ఫ్రంట్ లైన్ సేల్స్, సేల్స్ అండ్ సర్వీస్, సివిల్ ప్రాజెక్ట్స్ వంటి విభాగాలు ఉన్నాయి.
* హిందీ ట్రాన్స్‌లేటర్, జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్, బిజినెస్ డెవలప్‌మెంట్ ఎగ్జిక్యూటివ్, ఏరియా సేల్స్ మేనేజర్, మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్, సీనియర్ టెక్నికల్ ఆఫీసర్, టెక్నికల్ ఆఫీసర్ వంటి పోస్టులు ఉన్నాయి.
* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత విభాగాల్లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి.
ముఖ్యమైన విషయాలు..
* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్/ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
* అభ్యర్థులు ముందుగా ఆన్‌లైన్‌లో అప్లై చేసుకొని దరఖాస్తులను ఆఫ్‌లైన్ విధానంలో పంపించాలి.
* దరఖాస్తులను హెచ్‌ఎల్‌ఎల్ లైఫ్ కేర్ లిమిటెడ్, 26/4 హిల్ భవన్, వేలా చెరీ, చెన్నై 600100 అడ్రస్‌కు పంపిచాలి.
* దరఖాస్తుల స్వీకరణ 30-10-2021తో ముగియనుంది.
* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Also Read: Andhra Pradesh: ఏపీలో రైతులకు ముందే వచ్చిన దీపావళి.. ఒకే రోజు 3 పథకాల ద్వారా నగదు జమ
Chandrababu: హస్తిన టీడీపీ అధినేత చంద్రబాబు బృందం ఫిర్యాదులు, విన్నపాలు, వినతుల పరంపర
Chandrababu: హస్తిన టీడీపీ అధినేత చంద్రబాబు బృందం ఫిర్యాదులు, విన్నపాలు, వినతుల పరంపర