UPSC Topper 2021: మొదటి 5 ర్యాంకుల్లో.. 3 ర్యాంకులు అమ్మాయిలవే! యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఫలితాల్లో చరిత్ర సృష్టించిన నారీలోకం..

ఢిల్లీ యూనివర్సిటీలోని సెయింట్ స్టీఫెన్స్ కాలేజీలో హిస్టరీ గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసినప్పటినుంచే సివిల్స్‌కు ప్రిపేరవ్వడం ప్రారంభించింది. ఆ తర్వాత..

UPSC Topper 2021: మొదటి 5 ర్యాంకుల్లో.. 3 ర్యాంకులు అమ్మాయిలవే! యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఫలితాల్లో చరిత్ర సృష్టించిన నారీలోకం..
Topper Shruti Sharma
Follow us

|

Updated on: May 31, 2022 | 9:24 PM

Shruti Sharma tops UPSC Civil Services 2021 Results: యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ 2021 తుది ఫలితాలు మే 30న విడుదలైన సంగతి తెలిసిందే. ఈ ఫలితాల్లో ఉత్తరప్రదేశ్‌లో బిజ్నోర్‌కు చెందిన శృతి శర్మ ఆల్‌ ఇండియా ర్యాంక్‌ సాధించి సత్తా చాటింది. ప్రతిష్టాత్మక యూపీఎస్సీ సివిల్‌ సర్వీస్‌ పరీక్షల్లో టాపర్లుగా నిలిచిన మహిళా ఐఏఎస్ ఆఫీసర్ల సరసన చోటు సంపాదించుకుంది. సివిల్‌ సర్వీస్‌ పరీక్షల్లో వరుసగా మొదటి 5 స్థానాల్లో మూడు ర్యాంకులు సాధించి అగ్రస్థానంలో నిలిచిన అమ్మాయిలు (అంకితా అగర్వాల్ (2nd rank), గామిని సింగ్లా (3rd rank) చరిత్ర సృష్టించారు. రెండో ర్యాంక్‌ సాధించిన అంకితా అగర్వాల్ ఢిల్లీ యూనివర్సిటీ నుంచి ఆనర్స్ ఎకనామిక్స్‌లో పీజీ పూర్తి చేసింది. అదే యూనివర్సిటీలో పొలిటికల్‌ సైన్స్‌, ఇంటర్నేషనల్‌ రిలేషన్స్‌ స్పెషలైజేషన్లను కూడా అభ్యసించింది. థార్డ్‌ ర్యాంకర్‌ గామిని సింగ్లా కంప్యూటర్‌ సైన్స్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. సివిల్స్‌ తన ఆప్షనల్ సబ్జెక్ట్‌ సోషియాలజీ.

అధికారిక సమాచారం ప్రకారం.. శృతి శర్మ ఢిల్లీ యూనివర్సిటీలోని సెయింట్ స్టీఫెన్స్ కాలేజీలో హిస్టరీ (ఆనర్స్‌) స్పెషలైజేషన్‌లో గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశారు. గ్రాడ్యుయేషన్‌ తర్వాత జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్సిటీ (JNU)లో పీజీ చదివేందుకు జాయిన్‌ అయ్యింది. అనంతరం ఆ కోర్సునుంచి డిస్‌ కంటిన్యూ అయ్యింది. ఆ తర్వాత ఢిల్లీ యూనివర్సిటీలో ఎకనామిక్స్‌లో పీజీ కంప్లీట్‌ చేసింది.

గ్రాడ్యుయేషన్‌ చదివే సమయంలోనే IAS కావాలనే బలమైన సంకల్పం శ్రుతి మనసులో బలంగా నాటుకుపోయింది. ఢిల్లీ యూనివర్సిటీలోని సెయింట్ స్టీఫెన్స్ కాలేజీలో హిస్టరీ గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసినప్పటినుంచే సివిల్స్‌కు ప్రిపేరవ్వడం ప్రారంభించింది. ఆ తర్వాత జామియా మిల్లీయా ఇస్లామియా రెసిడెన్షియల్‌ కోచింగ్‌ అకాడమీలో సివిల్స్‌కు కోచింగ్‌ తీసుకుంది. నాలుగేళ్ల కఠోర శ్రమ, కృషి, అంకితా భావం శృతి శర్మను నేడ ఆల్‌ ఇండియా ర్యాంకర్‌గా నిలబెట్టింది.

ఇవి కూడా చదవండి

యూపీఎస్సీ సివిల్‌ సర్వీసెస్‌ 2021 ఫలితాల్లో మొత్తం 685 మంది కేంద్ర సర్వీసులకు అర్హత సాధించారు. వీరిటో 508 మంది పురుషులు, 177 మంది మహిళలు అర్హత సాధించారు.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సంబంధిత సమాచారం కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.