Active Recall: ‘యాక్టివ్ రీకాల్’ టెక్నిక్ గురించి మీకు తెలుసా.. సులువుగా టాపర్‌ అయిపోవచ్చు..!

Active Recall: ఏదైనా ఒక అంశాన్ని మళ్లీ మళ్లీ చదవడం, హైలైట్ చేయడం, షార్ట్ నోట్స్ తయారు చేసుకోకపోవడం మీ వల్ల కాకపోతే 'యాక్టివ్ రీకాల్ టెక్నిక్‌' పాటించండి. ఈ పద్దతిని పాటిస్తే సులువుగా టాపర్ కావొచ్చు.

Active Recall: 'యాక్టివ్ రీకాల్' టెక్నిక్ గురించి మీకు తెలుసా.. సులువుగా టాపర్‌ అయిపోవచ్చు..!
Active Recall
Follow us
uppula Raju

|

Updated on: May 31, 2022 | 9:29 PM

Active Recall: ఏదైనా ఒక అంశాన్ని మళ్లీ మళ్లీ చదవడం, హైలైట్ చేయడం, షార్ట్ నోట్స్ తయారు చేసుకోకపోవడం మీ వల్ల కాకపోతే ‘యాక్టివ్ రీకాల్ టెక్నిక్‌’ పాటించండి. ఈ పద్దతిని పాటిస్తే సులువుగా టాపర్ కావొచ్చు. యాక్టివ్ రీకాల్‌ను ప్రాక్టీస్ టెస్టింగ్ అని కూడా అంటారు. దీనివల్ల మీరు మీ బ్రెయిన్‌ నుంచి కొత్త సమాచారం పొందుతారు. ఇది వింతగా అనిపించినప్పటికీ ఆచరిస్తే మీకు అర్థమవుతుంది. యాక్టివ్‌ రీకాల్‌ అంటే మీరు చదివే టాపిక్‌పై ప్రశ్నలని తయారుచేసుకోవడం ఆ ప్రశ్రలపై మిమ్మల్ని మీరు మళ్లీ మళ్లీ పరీక్షించుకోవడం. ఈ టెక్నిక్‌లో బ్రెయిన్‌ మళ్లీ మళ్లీ సమాచారాన్ని పొందవలసి ఉంటుంది. దీనివల్ల ఆ టాపిక్‌ని అస్సలు మరిచిపోరు. సాధారణ పద్దతిలో కాకుండా మీ బ్రెయిన్‌ దీనిని వేరే పద్దతిలో సేవ్‌ చేసుకుంటుంది.

యాక్టివ్ రీకాల్ మీకు అర్థం కాని కాన్సెప్ట్‌లను అర్థమయ్యేలా చేస్తుంది. ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి చాలా అభ్యాసం అవసరం. కానీ ప్రాక్టీస్ చేస్తే మీరు ఏదైనా సమాచారాన్ని ఖచ్చితంగా గుర్తుంచుకోగలరు. యాక్టివ్‌ రీకాల్‌ టెక్నిక్‌లో ఇదే జరుగుతుంది. ఈ టెక్నిక్‌పై ఇప్పటికే చాలా పరిశోధనలు జరిగాయి. ఇది చాలా ఉపయోగకరమైన టెక్నిక్ అని తక్కువ సమయంలో ఎక్కువ సమాచారం గుర్తు పెట్టుకోవచ్చని చెప్పారు. 2010 సంవత్సరంలో ‘జర్నల్ ఆఫ్ ఎక్స్‌పెరిమెంటల్ సైకాలజీ’లో ప్రచురించిన కథనాలు దీనిని ధృవీకరిస్తున్నాయి.

కొన్నిసార్లు విద్యార్థులు యాక్టివ్ రీకాల్ టెక్నిక్‌ను ఇష్టపడరు. ఎందుకంటే ఒకే విషయాన్ని మళ్లీ మళ్లీ చదవడం అంటే కష్టంగా బోరింగ్‌గా ఫీలవుతారు. మీరు చదివే టాపిక్ నుంచి చిన్న ప్రశ్నల జాబితాను తయారుచేసుకోవాలి. తర్వాత మీరు ఆ సబ్జెక్ట్ లేదా టాపిక్‌ని రివైజ్ చేసినప్పుడు ఈ ప్రశ్నలకి సమాధానాలు చెప్పడానికి ప్రయత్నించండి. మీకు ఏదైనా తప్పు అనిపిస్తే అప్పుడు బుక్‌లో చూడండి. ఇలా చేయడం వల్ల జ్ఞాపకశక్తి కూడా పెరుగుతుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని కెరియర్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి