AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

UPSC Civil Services Exam: యూపీఎస్సీ పరీక్ష గురించి మీకు ఈ విషయాలు తెలుసా.. ఫలితాల ప్రకటన తరువాత జరిగేది అదే..

UPSC Civil Services Exam: భారతదేశంలో యూపీఎస్సీ నిర్వహించే పరీక్షల్లో సివిల్ సర్వీస్ పరిక్షే అత్యున్నతమైనది. ఈ పరీక్ష ద్వారా జిల్లా పరిపాలనాధికారిగానే కాక..

UPSC Civil Services Exam: యూపీఎస్సీ పరీక్ష గురించి మీకు ఈ విషయాలు తెలుసా.. ఫలితాల ప్రకటన తరువాత జరిగేది అదే..
Upsc
Shiva Prajapati
|

Updated on: Sep 28, 2021 | 1:55 PM

Share

UPSC Civil Services Exam: భారతదేశంలో యూపీఎస్సీ నిర్వహించే పరీక్షల్లో సివిల్ సర్వీస్ పరిక్షే అత్యున్నతమైనది. ఈ పరీక్ష ద్వారా జిల్లా పరిపాలనాధికారిగానే కాక.. రాష్ట్రానికి ప్రధాన అధికారికగా(రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి) కూడా అవ్వొచ్చు. అందుకే ప్రజా సేవ చేయాలనుకునే వారందరూ IAS అవ్వాలని భావిస్తుంటారు. అందుకు సన్నద్ధం అవుతుంటారు. అయితే, యూపీఎస్సీ పరీక్ష రాస్తే IAS ఆఫీసర్లు అయిపోవచ్చు అని చాలామంది భావిస్తుంటారు. కానీ, యూపీ ఎస్సీ పరీక్ష ఒక్క IAS కోసమే కాదు.. చాలా విభాగాలకు సంబంధించి అధికారుల నియామకానికి సంబంధించినది కూడా. అంటే.. IAS, IPS, IFS, IRS వంటి పోస్టులకు కూడా యూపీఎస్సీనే పరీక్ష నిర్వహిస్తోంది. అయితే, యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన తరువాత వచ్చిన ర్యాంకుల ఆధారంగా IAS, IPS, IFS, IRS పోస్టులను కేటాయిస్తారు.

తాజాగా యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ పరీక్ష ఫలితాలు విడుదల అయ్యాయి. ఈ నేపథ్యంలో IAS, IPS పోస్టులకు సంబంధించి అందరిలోనూ చర్చ జరుగుతోంది. ఈ పరీక్షలో పాస్ అయిన వారంతా IAS లు అవుతారని జనాలు అభిప్రాయపడుతున్నారు. కానీ, అది వాస్తవం కాదు. సివిల్ సర్వీస్‌లో వచ్చిన ర్యాంకుల ఆధారంగా పోస్టింగ్‌లను కేటాయిస్తారు. అందులో IAS, IPS, IFS, IRS వంటి పోస్టులు ఉంటాయి. మరి ఈ పోస్టుల మధ్య వ్యత్యాసం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

IAS అంటే ఏంటి? భారత ప్రభుత్వ పరిపాలనా యంత్రాంగానికి సంబంధించింది. సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్‌లో టాప్ ర్యాంక్ పొందిన అభ్యర్థులను ఐఏఎస్‌గా ఎంపిక చేస్తారు. ఇది అడ్మినిస్ట్రేటివ్ సేవలకు సంబంధించింది. IAS అధికారులు క్యాబినెట్ సెక్రటరీలు, సెక్రటరీలు కూడా నియామకం అవుతారు. ఇవి వివిధ రాష్ట్ర ప్రభుత్వాలలో వీరిని నియమిస్తారు. జిల్లాల కలెక్టర్లుగా, ఆయా శాఖల కార్యదర్శులుగా, ప్రధాన కార్యదర్శులగా నియామకం అవుతారు.

IPS అంటే ఏంటి? ఇండియన్ పోలీస్ సర్వీస్. ఈ ఉద్యోగానికి ఎంపికైన వారు రాష్ట్ర, భారత కేంద్ర సాయుధ పోలీసు దళాల్లో విధులు నిర్వర్తిస్తారు. ఐపిఎస్ అధికారుల కేడర్‌ను నియంత్రించడానికి హోం మంత్రిత్వ శాఖకు అధికారం ఉంటుంది. IPS అధికారి ప్రధానంగా శాంతిభద్రతల పరిరక్షణ, ప్రమాదాలు, నేరాలను నివారించడం, ట్రాఫిక్ నియంత్రణ తదితర వ్యవహారాలను చూస్తారు. ఒక IPS అధికారి కేంద్ర ప్రభుత్వంలో CBI, IB, RAW డైరెక్టర్‌గా కూడా నియమితులవుతారు.

IFS అంటే ఏంటి? ఇండియన్ ఫారెన్ సర్వీసెస్. ఈ అధికారులు విదేశీ వ్యవహారాలకు సంబంధించి విధులు నిర్వహిస్తారు. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖలో సేవలు అందిస్తారు. UPSC పరీక్షలో ఉత్తీర్ణులైన వీరికి.. మూడేళ్లపాటు శిక్షణ ఉంటుంది. వీరిని దౌత్యాధికారులుగా నియమించడం జరుగుతుంది. విదేశాలతో జరిగే దౌత్యపరమైన విషయాలలో వీరు కీలక పాత్ర పోషిస్తారు.

IRS అంటే ఏంటి? IRS.. IAS, IPS, IFS తరువాత సివిల్ సర్వీసెస్. ఈ పోస్టులో అధికారిగా.. ప్రత్యక్ష పన్ను (ఆదాయం, కార్పొరేట్, సంపద) మరియు పరోక్ష పన్ను (సెంట్రల్ ఎక్సైజ్, సర్వీస్ టాక్స్ మరియు కస్టమ్స్ డ్యూటీ మరియు) పన్నులు, పరిపాలన, పాలసీ మేకింగ్‌పై పూర్తి అవగాహన ఉండాలి. ఇది సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్ ఫైనాన్స్ మినిస్ట్రీ కింద పనిచేస్తుంది.

పోస్ట్ ఎంపిక ఎలా ఉంటుంది.. యూపీఎస్సీ సివిల్స్ ఫలితాల తర్వాత ఒక అప్లికేషన్ ఫామ్ నింపాల్సి ఉంటుంది. ఇందులో మీకు సంబంధించిన సమాచారం, జాబ్ ఆప్షన్స్ వంటివి ఇవ్వాలి. దీని ఆధారంగా ఇంటర్వ్యూ చేస్తారు అధికారులు. ఇంటర్వ్యూలో చూపిన ప్రతిభ ఆధారంగా ర్యాంక్ కేటాయిస్తారు. దాని ప్రకారం ఉద్యోగానికి ఎంపిక చేస్తారు.

Also read:

Mamata Banerjee: బెంగాల్ టూ గోవా.. మమతా బెనర్జీ నయా ప్లాన్.. వర్కౌట్ అవుతుందా?

Viral Video – Cat vs Rat: పిల్లిని ‘వీపీ’ చేసి ఆడేసుకున్న ఎలుక.. వీడియో చూస్తే పడి పడి నవ్వుతారు..

Attack: ఆ ఇద్దరు మాట్లాడుకుంటుండగా చూశారు.. చెట్టకు కట్టేసి..