Crime News: ఆ ఇద్దరు కలిసి మాట్లాడుకోవడమే నేరమా.. చెట్టకు కట్టేసి ఆటవిక క్రీడ..

ఓ మహిళ, వ్యక్తి మాట్లాడుకుంటున్నారు. ఇదీ చూసిని కొందరు వారిద్దరిని చెట్టుకు కట్టేసి చావబాదారు. ఇదెక్కడో ఆఫ్ఘానిస్తాన్‎లో జరిగింది కాదండి....

Crime News: ఆ ఇద్దరు కలిసి మాట్లాడుకోవడమే నేరమా.. చెట్టకు కట్టేసి ఆటవిక క్రీడ..
Lady
Follow us
Srinivas Chekkilla

|

Updated on: Sep 28, 2021 | 1:55 PM

ఓ మహిళ, వ్యక్తి మాట్లాడుకుంటున్నారు. ఇదీ చూసిని కొందరు వారిద్దరిని చెట్టుకు కట్టేసి చావబాదారు. ఇదెక్కడో ఆఫ్ఘానిస్తాన్‎లో జరిగింది కాదండి. మాన ఇండియాలోనే. ఓ మహిళ ఓ వ్యక్తితో రోడ్డుపై నిలుచుని మాట్లాడుతుంటే తట్టుకోలేని కొందరు వారిని చెట్టుకు కట్టేసి నిర్దాక్షిణ్యంగా కొట్టారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‎లోని రాంపూర్‎లో జరిగింది. ఉత్తరాఖండ్‌లోని రుద్రపూర్‌లో నివసిస్తున్న వ్యక్తికి యూపీలోని రాంపూర్ జిల్లా అహ్మదాబాద్ గ్రామంలో వ్యవసాయ భూమి ఉంది. తన వ్యవసాయ భూమి చూసేందుకు అతను తరచూ ఇక్కడి వస్తుంటాడు. ఇలా వారం క్రితం, అతను తన పొలాన్ని సందర్శించడానికి వచ్చాడు.

గ్రామానికి తిరిగి వెళ్తున్నప్పుడు అతనికి ఓ మహిళ కలిసింది. అతను ఆమెతో మాట్లాడటం మొదలు పెట్టాడు. వారు మాట్లాడుకోవటం చూసిన కొంతమందికి వారి మధ్య ఎదో ఉన్నట్లు అనుమానించారు. వివాహేతర సంబంధం ఉందని నిర్ణయానికొచ్చిన వారు.. ఆ ఇద్దరిని ఊరిలోకి లాక్కెళ్లారు. వారిని చెట్టుకు కట్టేసి ఇష్టమొచ్చినట్లు కొట్టారు. ఆ మహిళ అత్తమామలు కూడా తమ కొడలికి వివాహేతరం సంబంధం ఉందని అనుమానించి వారు కూడా ఆ ఇద్దరిపై దాడి చేశారు.

దీంతో వారికి గాయాలయ్యాయి. ఈ కేసుతో సంబంధం ఉన్న 12 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. వారిలో నలుగురిని ఇప్పటికే అరెస్ట్ చేశారు. బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు అడిషనల్ ఎస్పీ సంసర్ సింగ్ తెలిపారు. నిందితులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తామన్నారు. మరోవైపు ఈ ఘటనపై మహిళా సంఘాలు స్పందించాయి. మహిళలను అనుమానించడం..వారిని కొట్టడం దారుణమన్నారు.

Read Also.. Crime News: నవవధువు హత్యకు.. భర్త ముందే ప్లాన్.. ఆన్‌లైన్‌లో చాకు కొనుగోలు.. వెలుగులోకి సంచలన విషయాలు..