AP Crime News: ఆంధ్రప్రదేశ్‌లో వరుస దారుణాలు.. ఫేస్‌బుక్ లైవ్ ఆన్ చేసి అతను.. భర్త వేధింపులకు ఆమె బలి..

AP Crime News: ఆంధ్రప్రదేశ్‌లో వరుస దారుణాలు చోటు చేసుకున్నాయి. వేరు వేరు ఘటనల్లో ఓ వివాహిత, ఓ వ్యక్తి తనువులు చాలించారు. భార్య పుట్టింటికి వెళ్లిపోయిందని

AP Crime News: ఆంధ్రప్రదేశ్‌లో వరుస దారుణాలు.. ఫేస్‌బుక్ లైవ్ ఆన్ చేసి అతను.. భర్త వేధింపులకు ఆమె బలి..
Crime
Follow us
Shiva Prajapati

|

Updated on: Sep 28, 2021 | 12:31 PM

AP Crime News: ఆంధ్రప్రదేశ్‌లో వరుస దారుణాలు చోటు చేసుకున్నాయి. వేరు వేరు ఘటనల్లో ఓ వివాహిత, ఓ వ్యక్తి తనువులు చాలించారు. భార్య పుట్టింటికి వెళ్లిపోయిందని భర్త ఆత్మహత్య చేసుకోగా.. భర్త మరొకరితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని భార్య ఉరివేసుకుని ప్రాణాలు తీసుకుంది. ఈ ఘటనలకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. చిత్తూరు జిల్లా మదనపల్లిలో గుంటూరు జిల్లాకి చెందిన ఉదయ బాస్కర్ అనే వ్యక్తి ఫేస్‌బుక్ లైవ్ ఆన్ చేసి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. భార్య, ఆమె కుటుంబ సభ్యులు పెడుతున్న ఇబ్బందులు తాళలేక ఆత్మహత్య చేసుకుంటున్నట్లు వెల్లించారు. 6 ఏళ్ల క్రితం మదనపల్లికి చెందిన సోని గుంటూరు జిల్లాకు చెందిన ఉదయ భాస్కర్ పెళ్లి చేసుకున్నాడు. అనంతరం ఓ ప్రైవేటు ఆస్పత్రిలో మేనేజర్‌గా పని చేస్తూ.. మదనపల్లిలోని శేషమహల్ ఏరియాలో భార్యతో కలిసి నివాసముంటున్నాడు. అయితే, ఉదయ భాస్కర్, సోని ల మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. తాజాగా 2 రోజులు క్రితం ఉదయ భాస్కర్‌తో గొడవపడి పుట్టింటికి వెళ్లిపోయింది సోని. భార్య పుట్టింటికి వెళ్లిన తరువాత ఇంటికి చేరుకున్న ఉదయ భాస్క్.. ఫేస్‌బుక్ లైవ్ పెట్టి.. బార్య, ఆమె కుటుంబ సభ్యులు పెడుతున్న ఇబ్బందులు తాళలేక ఆత్మహత్య చేసుకుంటున్నట్లు తెలిపాడు. ఫేస్‌బుక్‌లో అది గమనించిన అతని స్నేహితులు.. ఉదయ భాస్కర్ కుటుంబ సభ్యులకు, పోలీసులకు సమాచారం అందించారు. వారు అప్రమత్తమయ్యే లోపే ఉదయ భాస్కర్ ఉరి వేసుకుని ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే, ఉదయ భాస్కర్ మద్యానికి బానిసై తరచూ వేధింపులకు గురి చేసేవాడని, రెండు రోజుల క్రితం కూడా తనను కొట్టడంతోనే పుట్టింటికి వెళ్లానని సోని పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొంది. గతంలోనూ భర్త ఉదయ బాస్కర్ వేధింపులపై వన్‌టౌన్ పీఎస్‌లో ఫిర్యాదు చేశానని తెలిపింది.

భర్త అక్రమ సంబంధం.. ప్రాణాలు తీసుకున్న మహిళ.. నెల్లూరులో భర్త కళ్ల ముందే వివాహిత ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన మరువక ముందే.. విజయవాడలో అలాంటి ఘటనే వెలుగు చూసింది. భర్త వేరే మహిళతో అక్రమ సంబంధం పెట్టుకోవడాన్ని తట్టుకోలేకపోయిన మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. గత సంవత్సరం అక్టోబర్‌లో అంజన్ కృష్ణ, రేణుక కు వివాహం జరిగింది. అంజన్ కృష్ణతో రేణుక వివాహం ఘనంగా చేశారు కుటుంబ సభ్యులు. అయితే రెండు నెలలపాటు సక్రమంగా కాపురం చేసిన భర్త అంజన్ కృష్ణ.. ఆ తరువాత తన వాస్తవ రూపం చూపించడం స్టార్ట్ చేశాడు. మరో మహిళతో వివాహేతర సంబంధాన్ని కొనసాగించడం మొదలు పెట్టాడు. అది గుర్తించిన భార్య రేణుక.. భర్తను మందలించింది. అయినప్పటికీ అతనిలో మార్పు రాలేదు. దాంతో తీవ్ర మనస్తాపానికి గురైన రేణుకు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. కాగా, భర్త వేధింపుల కారణంగానే తమ కూతురు ఆత్మహత్య చేసుకుందని రేణుక కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ప్రతీ రోజు కొడుతూ, తిడుతూ చిత్రహింసలకు గురి చేసేవాడని ఆరోపించారు. తమ బిడ్డ మృతికి కారణమైన అంజన్ కృష్ణను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు బాధితురాలి కుటుంబ సభ్యులు. కాగా, అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Also read:

Telangana Weather Report: తెలంగాణలో నేడు, రేపు భారీ వర్షాలు.. అలర్ట్ అయిన అధికారయంత్రాంగం..

Viral Video: అందరినీ హడలెత్తించిన లేడీ దెయ్యం.. అతను ఇచ్చిన ట్విస్ట్‌కు బిత్తరపోయింది.. వీడియో చూస్తే పగలబడి నవ్వుతారు..

Pawan Kalyan vs YCP : పవన్ – వైసీపీ నేతల మధ్య ముదరుతున్న మాటల యుద్ధం.. మళ్లీ విరుచుకుపడిన పవర్ స్టార్..

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!