Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: అందరినీ హడలెత్తించిన లేడీ దెయ్యం.. అతను ఇచ్చిన ట్విస్ట్‌కు బిత్తరపోయింది.. వీడియో చూస్తే పగలబడి నవ్వుతారు..

Viral Video: సోషల్ మీడియాలో వేలాది ప్రాంక్ వీడియోలు వైరల్ అవుతుంటాయి. ఈ ప్రాంక్ వీడియోలు చాలా ఫన్నీగా ఉంటాయి. ప్రాంక్‌ స్టార్స్ తమ చర్యతో జనాలను ఆటపట్టిస్తూ..

Viral Video: అందరినీ హడలెత్తించిన లేడీ దెయ్యం.. అతను ఇచ్చిన ట్విస్ట్‌కు బిత్తరపోయింది.. వీడియో చూస్తే పగలబడి నవ్వుతారు..
Viral Video
Follow us
Shiva Prajapati

|

Updated on: Sep 28, 2021 | 11:28 AM

Viral Video: సోషల్ మీడియాలో వేలాది ప్రాంక్ వీడియోలు వైరల్ అవుతుంటాయి. ఈ ప్రాంక్ వీడియోలు చాలా ఫన్నీగా ఉంటాయి. ప్రాంక్‌ స్టార్స్ తమ చర్యతో జనాలను ఆటపట్టిస్తూ.. వీడియోలు తీసి వాటిని సోషల్ మీడియాలో వదులుతుంటారు. వాటిని చూసి నెటిజన్లు ఫుల్‌గా ఎంజాయ్ చేస్తుంటారు. అయితే, కొందరు చేసే ప్రాంక్ వీడియోలు జనాలను చిరాకు పెట్టిస్తాయి. ఇక ప్రాంక్‌కు గురైన వారైతే కొట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఎందకంటే.. ముక్కూమొహం తెలియని వ్యక్తులు వచ్చి భయపెట్టడం, నీళ్లు చల్లడం, అల్లరి చేయడం వంటికి చేస్తే సహజంగానే ఎవరికైనా చిరాకు వస్తుంది. అయితే కొందరు భయంతో పరుగులు తీస్తే.. మరికొందరు ధైర్యంగా ఆ ప్రాంక్‌స్టర్‌ లకు రివర్స్‌ చుక్కలు చూపిస్తారు. తాజాగా దెయ్యం పేరుతో జనాలను ప్రయత్నం చేసిన లేడీకి ఓ వ్యక్తి మైండ్ బ్లాంక్ అయ్యే పని చేశాడు. అతను ఇచ్చిన ట్వి్స్ట్‌కు బిత్తరపోయింది. అప్పటి జనాలంతా తనను చూసి భయపడుతుండటంతో ముసిముసి నవ్వులు నవ్వుకున్న ఆ లేడీ.. చివరికి ఓ వ్యక్తి ఇచ్చిన బిగ్‌ షాక్‌కు ఖంగుతిన్నది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అది చూసి నెటిజన్లు పగలబడి నవ్వుకుంటున్నారు. ఇంతకీ ఆ వీడియోలో ఏముందో ఇప్పుడు తెలుసుకుందాం..

ఈ వైరల్ వీడియో ఓ లేడీ.. దెయ్యం వేషం వేసింది. లిఫ్ట్‌కు ఎదురుగా.. సరిగ్గా కార్నర్‌లో జుట్టు వీరబోసుకుని లిఫ్ట్ ముందు నిల్చుంది. అయితే, లిఫ్ట్ ఉన్న ఏరియాలో కాస్త చీకటిగా ఉంది. లిఫ్ట్ ఎక్కేందుకు ముందుగా ఓ యువతి వచ్చింది. ఒక్కసారిగా దెయ్యం వేషంలో లేడీ కనిపించడంతో ఆ యువతి భయంతో పరుగులు తీసింది. కాసేపటికే మరో యువతి వచ్చింది. సేమ్ సీన్ రిపీట్. లేడీ దెయ్యాన్ని చూసి.. పరుగు లంకించుకుంది. ఈ ఇద్దరూ భయపడిన విధానం చూసి.. ప్రాంక్ చేసిన యువతి ముసి ముసి నవ్వులు నవ్వుకుంది. అయితే, కొద్దిసేపటి తరువాత ఓ వ్యక్తి వచ్చాడు. భయం భయంగా చూస్తూ ముందుకు కదిలాడు. మొత్తానికి అలా వెళ్లిపోయాడు. అయితే, ఇంతలో ఊహించని ట్విస్ట్ ఇచ్చాడు. భయంతో వెళ్లిపోయిన వ్యక్తి.. మళ్లీ వెనక్కి వచ్చాడు. లిఫ్ట్ ముందు దెయ్యం మాదిరిగా నిల్చున్న యువతిని ఎగిరి తన్నాడు. ఆపై అక్కడి నుంచి పారిపోయాడు. అయితే, ఆ వ్యక్తి ఇచ్చిన ట్విస్ట్‌కు ప్రాంక్ గర్ల్.. షాక్ అయ్యింది. అతని దెబ్బకు ముక్కుతూ మూలుగుతూ లేచి సైలెంట్‌గా వెళ్లిపోయింది. అయితే, ఈ సీన్ అంతా అక్కడే ఏర్పాటు చేసిన వీడియోలో రికార్డ్ అయ్యింది. ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. అది కాస్తా వైరల్‌గా మారింది. ఆ వీడియోను చూసి నెటిజన్లు ఓ రేంజ్‌లో నవ్వుకుంటున్నారు. ఫన్నీ కామెంట్స్ పెడుతున్నారు. ఈ వీడియోను ఇప్పటి వరకు 6 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. మరెందుకు ఆలస్యం.. ఈ ఫన్నీ వీడియోను మీరూ చూసేయండి.

Viral Video:

Also read:

Pawan Kalyan vs YCP : పవన్ – వైసీపీ నేతల మధ్య ముదరుతున్న మాటల యుద్ధం.. మళ్లీ విరుచుకుపడిన పవర్ స్టార్..

IPL Points Table 2021: టాప్ ప్లేస్‌ కోసం చెన్నై, ఢిల్లీ పోటీ.. ప్లే-ఆఫ్స్‌లో స్థానానికి ముంబై ఆరాటం..

PM Modi: రైతులకు నిజంగా శుభవార్త.. 35 రకాల పంటలను జాతీయం చేయనున్న ప్రధాని నరేంద్ర మోదీ..