PM Modi: రైతులకు నిజంగా శుభవార్త.. 35 రకాల పంటలను జాతీయం చేయనున్న ప్రధాని నరేంద్ర మోదీ..

PM Modi: భారత ప్రధాని నరేంద్ర మోదీ నేడు వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పునకు శ్రీకారం చుట్టనున్నారు. ఇవాళ ఉదయం 11 గంటలకు వీడియో కాన్ఫరెన్స్‌..

PM Modi: రైతులకు నిజంగా శుభవార్త.. 35 రకాల పంటలను జాతీయం చేయనున్న ప్రధాని నరేంద్ర మోదీ..
Modi
Follow us

|

Updated on: Sep 28, 2021 | 9:48 AM

PM Modi: భారత ప్రధాని నరేంద్ర మోదీ నేడు వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పునకు శ్రీకారం చుట్టనున్నారు. ఇవాళ ఉదయం 11 గంటలకు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా 35 రకాల ప్రత్యేక పంటలను రైతులను అంకితం చేయనున్నారు. ఈ పంటలు ప్రత్యేక వాతావరణ పరిస్థితులను సైతం తట్టుకుని నిలవడమే కాకుండా.. పోషకాహార లోపాన్ని నివారించడంలో అద్భుత ఫలితాలను చూపనున్నాయి. ఢిల్లీ నుంచి వర్చువల్‌గా ఈ కార్యక్రమంలో పాల్గొననున్న ప్రధాని నరేంద్ర మోదీ.. వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా, సాంకేతిక పరిజ్ఞాన్ని ఉపయోగించి వ్యవసాయ సాగు చేయడంపై ప్రజల్లో అవగాహన కల్పించనున్నారు. అలాగే, రాయపూర్‌లోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ బయోటిక్ స్ట్రెస్ టాలరెన్స్‌లో నూతనంగా నిర్మించిన క్యాంపస్‌ను కూడా ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. ఇక వ్యవసాయ విశ్వవిద్యాలయాలకు గ్రీన్ క్యాంపస్ అవార్డును పంపిణీ చేయనున్నారు. ఇక ఈ సమావేశంలో భాగంగా దేశ వ్యాప్తంగా వినూత్న పద్ధతులను ఉపయోగించి వ్యవసాయసాగు చేసే రైతులతో ప్రధాని నరేంద్ర మోదీ సంభాషించనున్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్, ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బాఘెల్ కూడా హాజరుకానున్నారు.

ఇదిలాఉంటే.. వాతావరణ మార్పు, పోషకాహార లోపం వంటి జంట సవాళ్లను ఎదుర్కునే నిర్దిష్ట లక్షణాలు కలిగిన పంట రకాలను ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ (ICMR) అభివృద్ధి చేసింది. 2021 సంవత్సరంలో వాతావరణ స్థితిస్థాపకత, అధిక పోషక పదార్ధాలు కలిగిన ప్రత్యేక లక్షణాలతో ముప్పై ఐదు రకాల రకాలు అభివృద్ధి చేశారు. వీటిని ఇవాళ ప్రధాని నరేంద్ర మోదీ జాతీయం చేయనున్నారు. కాగా, వాతావరణ మార్పు, పోషకాహర లోపం వంటి సవాళ్లను ఎదుర్కొనే ప్రత్యేక లక్షణాలనూ అభివృద్ధి చేసిన పంటలలో.. చిక్‌పీ, విల్ట్, స్టెరెలిటీ మొజాయిక్ రెసిస్టెంట్ పీజియాన్‌పీ, కొత్తరకం సోయాబీన్, బయో-ఫోర్టిఫైడ్ గోధుమలు, వ్యాధి నిరోధకాలు కలిగిన వరి, పెర్ల్‌మిల్లెట్, మొక్కజొన్న, క్వినోవా, బుక్వీట్, ఫాబా బీన్, వింగ్స్ బీన్ వంటి పంట రకాలు ఉన్నాయి.

ఇక రాయపూర్‌లోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ బయోటిక్ స్ట్రెస్ క్యాంపస్‌ ద్వారా మానవ జీవితంలో ఒత్తిడిపై వ్యూహాత్మక పరిశోధనలు చేపట్టడానికి, మానవ వనరులను అభివృద్ధి చేయడానికి స్థాపించడం జరిగింది. దీనికి సంబంధించి 2020-21 అకడమిక్ సెషన్ నుంచి పీజీ కోర్సులను ప్రారంభించారు.

Also read:

Roja vs Chakrapanireddy Video: భగ్గుమన్న వర్గపోరు.. పీక్‌ స్టేజికి చేరిన రోజా వర్సెస్‌ చక్రపాణిరెడ్డి.. (వీడియో)

Bamboo Farming: చదివింది ఎల్‌ఎల్‌బీ.. చేసేది వ్యవసాయం.. అంతరపంటగా వెదురు.. 7 ఏళ్లలో 4 రెట్లు లాభాలు ఆర్జించిన రైతు

Gulab Cyclone Live Video: గులాబ్‌తో ఉక్కిరి బిక్కిరి.. స్మార్ట్‌సిటీస్‌లో ఫ్లడ్‌ బెల్స్‌.. తుఫాన్ లైవ్ వీడియో..