Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ghost Video: రాత్రి సమయంలో తలకిందులుగా నడుస్తున్న తల్లి దెయ్యం.. తల లేని బాలుడు.. ఆ ప్రాంతంలో భయాందోళన..చివరికి..

మా ఊళ్లో ఒక దెయ్యం ఉంది.. ఈ పాట పాడుకుంటున్నారు మహారాష్ట్రాలోని ఓ గ్రామస్థులు. ఎందుకంటే ఆ గ్రామానికి వెళ్తున్న దారిలో తల లేని..

Ghost Video: రాత్రి సమయంలో తలకిందులుగా నడుస్తున్న తల్లి దెయ్యం.. తల లేని బాలుడు.. ఆ ప్రాంతంలో భయాందోళన..చివరికి..
Ghost Video
Follow us
Sanjay Kasula

|

Updated on: Sep 28, 2021 | 9:59 AM

మా ఊళ్లో ఒక దెయ్యం ఉంది.. ఈ పాట పాడుకుంటున్నారు మహారాష్ట్రాలోని ఓ గ్రామస్థులు. ఎందుకంటే ఆ గ్రామానికి వెళ్తున్న దారిలో తల లేని మొండం.. కాళ్ళు వెనక్కి తిరిగిన దెయ్యం నిత్యం అక్కడివారిని భయందోళనకు గురిచేస్తున్నారు. ఇదంటేనే పనిలో పడిన పోలీసులు అసలు సంగతి తేల్చారు. మహారాష్ట్రలోని జల్గావ్ జిల్లాలోని జామ్నేర్ తాలూకాలో ప్రజలు భయాందోళనలో ఉన్నారు. భయాందోళనలకు కారణం రాత్రి చీకటిలో దెయ్యం కనిపిండంతో ఇదో పెద్ద చర్చగా మారింది. అతను వ్యతిరేక దిశలో ఉన్న పాదం మీద నడుస్తుండటం. ఆ దెయ్యంకు తల కూడా లేదు. కానీ  ఇప్పుడు ఆ దెయ్యం ఆ ప్రాంతంలో కనిపించకుండా మాయం అయ్యింది. గ్రామస్థుల ఫిర్యాదులతో రంగంలోకి దిగారు పోలీసులు. ఆ దెయ్యాన్ని పట్టుకోవడంలో ఫత్తేపూర్ పోలీసులు విజయం సాధించారు. అసలు ఈ దెయ్యం అక్కడి ఎలా వచ్చిందో తేల్చేశారు.

దెయ్యం వీడియోను వైరల్ చేసిన ముగ్గురు వ్యక్తులను పోలీసులు పట్టుకున్నారు. నిందితులు తమ నేరాన్ని అంగీకరించారు. అతను ప్రజలను భయపెట్టడానికి దెయ్యం వీడియోను వైరల్ చేసాడు. ఈ భయాందోళనల కారణంగా పహూర్, ఫత్తేపూర్, డౌల్‌గావ్ చుట్టూ వ్యాపించింది.

అసలు విషయం ఏమిటి?

రాత్రి చీకటిలో రోడ్డుపై ఆగి ఉన్న కారులో కూర్చొని నిందితుడు వీడియో చేశాడు. సాంకేతికత సహాయంతో, అతను తల లేని బాలుడు, ఒక మహిళ రోడ్డుపై వెనుకకు నడుస్తున్న దృశ్యాలను చిత్రీకరించారు. కారులో నుంచి లైటింగ్ ఎఫెక్ట్‌తో ద్వారా నిందితుడు ఇదంతా మొబైల్ కెమెరాతో చిత్రీకరించారు. దీని తరువాత నిందితులు తాము ఈ దెయ్యం చూసినట్లు వీడియోలో సాక్ష్యమిచ్చారు. అంతటితో ఆగకుండా ఆ ఈ వీడియోలను వైరల్ చేస్తున్నారు.

నిందితుడు షేర్ చేసిన ఈ వీడియో త్వరగా వైరల్ అయింది. ఈ వీడియో వైరల్ అయిన తర్వాత ఫత్తేపూర్, డ్యూల్‌గావ్ , జామ్నర్‌లో భయాందోళన వాతావరణం నెలకొంది. చివరికి ఫత్తేపూర్‌కు చెందిన కొంతమంది తెలివైన వ్యక్తులు ఈ వీడియో ద్వారా మూఢనమ్మకాలను వ్యాప్తి చేయడం ద్వారా ప్రజలలో భయం సృష్టించబడుతోందని గుర్తించారు పోలీసులు. వారు ఈ సమాచారాన్ని పోలీసులకు అందించారు. దీనిపై ఫత్తేపూర్ ఆటో పోస్ట్ పోలీసులు సంసిద్ధత చూపిస్తూ వీడియో చేసి వైరల్ చేసిన ముగ్గురు నిందితులను పట్టుకున్నారు. విచారణలో నిందితులు తమ నేరాన్ని అంగీకరించారు.

పోలీసుల ఇలా..

సంబంధిత సంఘటన గురించి పహూర్ పోలీస్ స్టేషన్ అసిస్టెంట్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ సంజయ్ బన్సోద్ మాట్లాడుతూ..”ఈ వీడియోను వైరల్ చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. వారిపై కేసు నమోదు చేసినట్లుగా వెల్లడించారు. వీరు ప్రాంక్ వీడియోలు చేస్తూ స్థానిక గ్రామస్థులను భయపెట్టాలని చూస్తున్నారని తెలిపారు. ఆ ప్రాంతంలో ఎక్కడా దయ్యాలు లేవన్నారు. ప్రజల మనస్సులలో భయాన్ని సృష్టించేలా చిత్రీకరించారని అన్నారు. దెయ్యాలు వంటి వాటిని నమ్మవద్దని ప్రజలకు ఒక విజ్ఞప్తి చేశారు. ఎవరైనా అలాంటి చర్యను పునరావృతం చేయడానికి ప్రయత్నిస్తే  వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.

ఇవి కూడా చదవండి:  Vitamin D Deficiency: మీలో విటమిన్ డి లోపం ఉంటే మీ నాలుక గుర్తిస్తుంది.. ఎలానో తెలుసా..

Gratuity calculation: గ్రాట్యుటీకి సంబంధించిన రూల్స్ మార్చబడ్డాయి.. మీకు ఎంత.. ఎలా పేమెంట్ పొందుతారు.. పూర్తి సమాచారాన్ని ఇక్కడ తీసుకోండి..