Nitin Gadkari J&K Visit LIVE: జోజిలా టన్నెల్‌ను వీలైనంత త్వరగా పూర్తి చేస్తాం: కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ..

Shaik Madar Saheb

| Edited By: Anil kumar poka

Updated on: Sep 28, 2021 | 4:39 PM

Zojila tunnel - MEIL: మేఘా ఇంజినీరింగ్ (MEIL) సంస్థ ఆధ్వర్యంలో అత్యద్భుతంగా నిర్మితమవుతున్న జోజిలా టన్నెల్ (Zojila tunnel)- జెడ్-మోర్ టన్నెల్..

Nitin Gadkari J&K Visit LIVE: జోజిలా టన్నెల్‌ను వీలైనంత త్వరగా పూర్తి చేస్తాం: కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ..
Nitin Gadkari Zojila Tunnel Visit

Zojila tunnel – MEIL: మేఘా ఇంజినీరింగ్ (MEIL) సంస్థ ఆధ్వర్యంలో అత్యద్భుతంగా నిర్మితమవుతున్న జోజిలా టన్నెల్ (Zojila tunnel)- జెడ్-మోర్ టన్నెల్ ప్రాజెక్టులను కేంద్ర కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ సందర్శిస్తున్నారు. అనంతరం ఈ ప్రాజెక్టులపై అధికారులతో, మేఘా ప్రతినిధులతో సమీక్షించనున్నారు. జోజిలా టన్నెల్ జాతీయ భద్రత, సైనిక అవసరాలను తీర్చడానికి, జమ్మూ కాశ్మీర్, లఢఖ్ ప్రాంతాల అభివృద్ధికి, పర్యాటకరంగ అభివృద్దికి దోహదపడనుంది. ఈ టన్నెల్ లడఖ్ ప్రాంతం- కార్గిల్, లేహ్‌కి ఏడాది పొడవునా రహదారి కనెక్టివిటీని అందించనుంది.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 28 Sep 2021 01:42 PM (IST)

    90 శాతం పూర్తయిన పితోరగఢ్-మానస సరోవర్ రోడ్డు పనులు: నితిన్ గడ్కరీ

    త్వరలో మానస సరోవర్ పర్యటనకు వెళ్లనున్నట్లు నితిన్ గడ్కరి తెలిపారు. పితోరగఢ్ నుంచి మానససరోవర్ వరకు నిర్మిస్తున్న రహదారి 90 శాతం పూర్తయినట్లు వెల్లడించారు. వచ్చే ఏడాది ఏప్రిల్ నాటికి దీని పనులు పూర్తవుతాయని పేర్కొన్నారు.

  • 28 Sep 2021 01:32 PM (IST)

    వచ్చే ఏడాది నాటికి టన్నెల్ పూర్తి.. నితిన్ గడ్కరీ

    జోజిలా టన్నెల్ వచ్చే ఏడాది నాటికి పూర్తవుతుందని.. రవాణాకు కూడా అనుమతిస్తామని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఆశాభావం వ్యక్తంచేశారు. వచ్చే ఏడాది నాటికి దీనిని ప్రారంభిస్తామని పేర్కొన్నారు. వచ్చే ఏడాది డిసెంబర్ నాటికి పనులు పూర్తిచేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. అయితే.. ఇది వాగ్దానం కాదని.. లక్ష్యమని కచ్చితంగా నెరవేరుతుందంటూ గడ్కరీ ఆశాభావం వ్యక్తంచేశారు.

  • 28 Sep 2021 01:27 PM (IST)

    యువతకు ఉపాధి: నితిన్ గడ్కరీ

    జోజిలా సొరంగ మార్గాన్ని పగలు రాత్రి అనే తేడా లేకుండా నిర్మిస్తున్నారని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. అధికారులతోపాటు, మేఘ సంస్థ కష్టపడుతున్నాయని తెలిపారు. ఇక్కడ పని చేసేందుకు అనేక ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. అయితే.. జోజిలా టన్నెల్‌ ఆసియాలోనే పొడవైన టన్నెల్ అని పేర్కొన్నారు. జోజిలా టన్నెల్ వల్ల యువతకు ఉపాధి లభిస్తుందని పేర్కొన్నారు.

  • 28 Sep 2021 01:03 PM (IST)

    పర్యాటక రంగం అభివృద్ధి: గడ్కరీ..

    జోజిలా టన్నెల్ నిర్మాణంతో.. అన్ని వాతావరణ పరిస్థితుల్లో లఢఖ్, జమ్మూకు రవాణా మార్గం సులభం అవుతుందని.. పర్యాటక రంగం అభివృద్ధి చెందుతుందని గడ్కరీ తెలిపారు.

  • 28 Sep 2021 01:00 PM (IST)

    వీలైనంత త్వరగా పూర్తి చేస్తాం.. గడ్కరీ

    4.15 కిలోమీటర్ల పాటు నిర్మితమవుతున్న జోజిలా టన్నెల్ ను వేగవంతంగా పూర్తిచేస్తామని గడ్కరీ తెలిపారు. మేఘ ఆధ్వర్యంలో పనులు శరవేగంగా జరుగుతున్నాయని.. వీలైనంత త్వరగా ప్రాజెక్టు పూర్తవుతుందని తెలిపారు.

  • 28 Sep 2021 12:52 PM (IST)

    జోజిలా టన్నెల్‌కు చేరుకున్న నితిన్ గడ్కరీ..

    మేఘ ఇంజినీరింగ్ సంస్థ నిర్మిస్తున్న ఆసియాలోనే అతిపెద్ద జోజిలా టన్నెల్ ప్రాజెక్టు సందర్శనకు కేంద్ర రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ చేరుకున్నారు.

  • 28 Sep 2021 11:42 AM (IST)

    2013లో ప్రాజెక్టుకు రూపకల్పన..

    2013లో యూపీఏ హయాంలో దీన్ని నిర్మించాలని నిర్ణయించారు. ఆ తర్వాత మోదీ సర్కార్‌ హయాంలో 4 సార్లు టెండర్లు పిలిచినా సఫలం కాలేదు. ఆ తర్వాత మేఘా (MEIL) సంస్థ దీని నిర్మాణానికి నడుంబిగించింది. మేఘా ఆధ్వర్యంలో 2020 అక్టోబర్లో పనులు ప్రారంభమై.. సొరంగ మార్గం పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి.

  • 28 Sep 2021 11:30 AM (IST)

    హై సెక్యూరిటితో టన్నెల్ నిర్మాణం..

    అత్యాధునికంగా నిర్మిస్తున్న జోజిలా టన్నెల్ లో సీసీటీవీ కెమెరాలు, ఓవర్‌ హైట్‌ వాహనాలను గుర్తించడం, ఆటోమెటిక్‌ ఫైర్‌ డిటెక్షన్‌, ఫైర్‌ అలారం, ఇక స్పీడ్‌ లిమిట్‌ 80 కిలోమీటర్లకు పరిమితం చేస్తూ నిర్మిస్తున్నారు.

  • 28 Sep 2021 11:01 AM (IST)

    ప్రతి సీజన్‌లోనూ రవాణా సులభతరం..

    జోజిలా టన్నెల్ నిర్మాణంతో.. శ్రీనగర్, ద్రాస్, కార్గిల్, లేహ్ మధ్య రోడ్ మార్గం సులభం అవుతుంది. ప్రస్తుతం ఈ రహదారి సంవత్సరంలో 6 నెలలపాటు మూసివేయబడుతుంది. ఈ సొరంగం పూర్తయిన తర్వాత లడఖ్ నుండి కాశ్మీర్ మధ్య దూరం 3గంటల 15 నిమిషాలపాటు తగ్గుతుంది. 15 నిమిషాల్లో గమ్య స్థానానికి చేరుకోవచ్చు.

  • 28 Sep 2021 10:57 AM (IST)

    అన్నింటికి అనుసంధానంగా జోజిలా టన్నెల్..

    ఈ జోజిలా టన్నెల్ సాధారణ ప్రజలతోపాటు పర్యాటకులకు, భారత సైన్యానికి చాలా ముఖ్యమైనది. ఇది పూర్తయిన తర్వాత అన్ని వాతావరణ పరిస్థితుల్లో లడఖ్ ప్రాంతానికి కశ్మీర్ లోయతో కనెక్టెవిటీ ఉంటుంది. శ్రీనగర్, కార్గిల్, లేహ్ ప్రాంతాలు రవాణా అనుసంధానంలో ఉంటాయి.

  • 28 Sep 2021 10:13 AM (IST)

    జోజిలా టన్నెల్ పొడవు 14.15 కి.మీ..

    జోజిలా సొరంగం దాదాపు 14.15 కి.మీ. ఇది ఆసియాలో పొడవైన సొరంగం. ఈ టన్నెల్ పూర్తయిన అనంతరం మూడున్నర గంటల ప్రయాణం.. కేవలం 15 నిమిషాల్లోనే పూర్తికానుంది. దీంతో ఈ ప్రాంత ప్రజల కష్టాలు తీరనున్నాయి.

  • 28 Sep 2021 09:59 AM (IST)

    ఏడాది పొడవునా కనెక్టివిటీ..

    దీని పనులు 2020 అక్టోబర్లో ప్రారంభమయ్యాయి. ఇక్కడ వాతావరణ పరిస్థితుల వల్ల ఆర్నెల్లపాటు సరుకులు రవాణా సాధ్యం కాని పరిస్థితి నెలకొని ఉంటుంది. అందువల్ల అన్ని వాతావరణ పరిస్థితుల్లో రవాణాకు ఉపయోగపడేలా.. ఏడాది పొడవునా కనెక్టివిటినీ అందించేందుకు ఈ టన్నెల్ నిర్మిస్తున్నారు.

  • 28 Sep 2021 09:45 AM (IST)

    ఆసియాలోని అతి పొడవైన టన్నెల్.

    జోజిలా టన్నెల్.. ఆసియాలోని అతి పొడవైన సొరంగ మార్గం. ఇది శ్రీనగర్‌, కార్గిల్‌, లేహ్‌ను కలిపే లైఫ్‌లైన్‌. సముద్ర మట్టానికి 11,578 అడుగుల ఎత్తులో దీనిని నిర్మిస్తున్నారు.

  • 28 Sep 2021 09:43 AM (IST)

    రూ.2,300 కోట్లతో జోజిలా టన్నెల్‌

    జోజిలా టన్నెల్‌ను రూ.2,300 కోట్లతో నిర్మిస్తున్నారు. సోన్‌మార్గ్‌ని నుంచి శ్రీనగర్, లడఖ్ మధ్య అన్ని వాతావరణ పరిస్థితుల్లో రవాణా కనెక్టివిటీకి అనుగుణంగా 14.15 కిమీ పొడవున జోజిలా సొరంగ మార్గాన్ని నిర్మిస్తున్నారు. దీనిని 2026 నాటికి పూర్తిచేసేందుకు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ జోజిలా టన్నెల్‌ని మేఘా ఇంజనీరింగ్ & ఇన్‌ఫ్రా లిమిటెడ్ నిర్మిస్తోంది.

  • 28 Sep 2021 09:36 AM (IST)

    నితిన్ గడ్కరీ జోజిలా టన్నెల్‌ సందర్శన షెడ్యూల్ ఇలా..

    మేఘా ఇంజినీరింగ్ (MEIL) సంస్థ ఆధ్వర్యంలో అత్యద్భుతంగా నిర్మితమవుతున్న జోజిలా టన్నెల్ (Zojila tunnel)- జెడ్-మోర్ టన్నెల్ ప్రాజెక్టులను కేంద్ర కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ సందర్శించి.. పనులను పరిశీలిస్తారు.

    Nitin Gadkari, Zojila Tunne

    Nitin Gadkari, Zojila Tunne

  • 28 Sep 2021 09:30 AM (IST)

    నితిన్ గడ్కరీ షెడ్యూల్ ఇలా..

    మేఘా ఇంజినీరింగ్ (MEIL) సంస్థ ఆధ్వర్యంలో నిర్మితమవుతున్న జోజిలా టన్నెల్- జెడ్-మోర్ టన్నెల్ ప్రాజెక్టులను కేంద్ర కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ మరికాసేపట్లో సందర్శించనున్నారు.

Published On - Sep 28,2021 9:26 AM

Follow us
ఐదు వికెట్ల ప్రదర్శనతో మహారాష్ట్రను కుదిపేసిన KKR స్పీడ్‌స్టర్
ఐదు వికెట్ల ప్రదర్శనతో మహారాష్ట్రను కుదిపేసిన KKR స్పీడ్‌స్టర్
సల్లూ భాయ్ మళ్లీ అదరగొట్టాడు.. మురుగదాస్‌ 'సికందర్' టీజర్ చూశారా?
సల్లూ భాయ్ మళ్లీ అదరగొట్టాడు.. మురుగదాస్‌ 'సికందర్' టీజర్ చూశారా?
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే చూస్తూ ఊరుకోం.. పవన్ కల్యాణ్
ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే చూస్తూ ఊరుకోం.. పవన్ కల్యాణ్
సెంచరీ తర్వాత కుటుంబ సభ్యులను కలిసిన నితీశ్ రెడ్డి.. వీడియో
సెంచరీ తర్వాత కుటుంబ సభ్యులను కలిసిన నితీశ్ రెడ్డి.. వీడియో
బైక్‌ ప్రియులకు గుడ్‌న్యూస్‌.. హోండా నుంచి కొత్త బైక్‌.. ఫీచర్స్‌
బైక్‌ ప్రియులకు గుడ్‌న్యూస్‌.. హోండా నుంచి కొత్త బైక్‌.. ఫీచర్స్‌
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కీర్తి పేరును ఖునీ చేసేశారుగా.. హీరోయిన్ రియాక్షన్ ఇదే..
కీర్తి పేరును ఖునీ చేసేశారుగా.. హీరోయిన్ రియాక్షన్ ఇదే..
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!