Covid-19 Vaccination: వ్యాక్సినేషన్‌లో భారత్ మరో రికార్డు.. నిన్న ఒక్కరోజే కోటి మందికి టీకా..
Covid-19 Vaccination in India: భారత్‌లో కరోనావైరస్ ఉధృతి కొనసాగుతూనే ఉంది. థర్డ్‌వేవ్ ప్రమాద హెచ్చరికలతో.. కరోనా కట్టడికి ప్రభుత్వం వ్యాక్సినేషన్ ప్రక్రియను
Covid-19 Vaccination in India: భారత్‌లో కరోనావైరస్ ఉధృతి కొనసాగుతూనే ఉంది. థర్డ్‌వేవ్ ప్రమాద హెచ్చరికలతో.. కరోనా కట్టడికి ప్రభుత్వం వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేసింది. ఈ క్రమంలో అందరికీ వ్యాక్సిన్ అందలా ప్రభుత్వం ప్రణాళికలు రచించి వ్యాక్సినేషన్‌ను విజయవంతంగా నిర్వహిస్తోంది. ఈ క్రమంలో సోమవారం ఒక్క రోజే కోటి మందికి పైగా కరోనా వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ తెలిపారు. సోమవారం రోజు 1,00,96,142 మంది టీకా వేయించుకున్నట్లు ఆయన ట్వీట్టర్ వేదికగా వెల్లడించారు. ఒకే రోజు కోటి మందికి పైగా టీకా వేయించుకోవడం ఇది ఐదోసారి. ఈ సందర్భంగా దేశ ప్రజలకు కేంద్ర ఆరోగ్య మంత్రి మాండవీయ శుభాకాంక్షలు తెలుపుతూ ట్విట్ చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో కరోనా కట్టడికి చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. ఉత్తరప్రదేశ్‌లో నిన్న ఒక్కరోజే 35 లక్షల మంది కోవిడ్ టీకా తీసుకున్నారు.
ఇదిలాఉంటే.. కరోనా వ్యాక్సినేషన్ ప్రారంభం నాటినుంచి ఇప్పటివరకు టీకా తీసుకున్న వారి సంఖ్య 86 కోట్లు దాటినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. కాగా.. సెప్టెంబర్ 17న ప్రధాని నరేంద్రమోదీ జన్మదినం సందర్భంగా నిర్వహించిన స్పెషల్ డ్రైవ్‌లో తేదీన రెండు కోట్ల మంది టీకా తీసుకుని రికార్డు సృష్టించారు. తొలిసారిగా ఆగస్టు 27వ తేదీన కోటి మంది టీకాలు తీసుకున్న విషయం తెలిసిందే.
కాగా.. అక్టోబర్ రెండో వారం వరకు 100 కోట్ల వ్యాక్సిన్ డోసులు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ లక్ష్యాన్ని అక్టోబర్ 5 నుంచి 10వ తేదీ మధ్యలో చేరుకునే అవకాశం ఉంది. 100 కోట్ల వ్యాక్సిన్ డోసుల పంపిణీ అధిగమించిన అనంతరం.. వ్యాక్సినేషన్ విజయోత్సవాలను నిర్వహించేందుకు కేంద్రం సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
Also Read: