Bamboo Farming: చదివింది ఎల్‌ఎల్‌బీ.. చేసేది వ్యవసాయం.. అంతరపంటగా వెదురు.. 7 ఏళ్లలో 4 రెట్లు లాభాలు ఆర్జించిన రైతు

UP Farmer Bamboo Farming: ఉద్యోగ, వ్యాపారంతోనే కాదు వ్యవసాయంచేసి కూడా డబ్బులు సంపాదించవచ్చు అని పలువురు రైతులు నిరూపిస్తున్నారు. అయితే వ్యవసాయాన్ని..

Bamboo Farming: చదివింది ఎల్‌ఎల్‌బీ.. చేసేది వ్యవసాయం.. అంతరపంటగా వెదురు.. 7 ఏళ్లలో 4 రెట్లు లాభాలు ఆర్జించిన రైతు
Bamboo Plants
Follow us

|

Updated on: Sep 28, 2021 | 9:44 AM

UP Farmer Bamboo Farming: ఉద్యోగ, వ్యాపారంతోనే కాదు వ్యవసాయంచేసి కూడా డబ్బులు సంపాదించవచ్చు అని పలువురు రైతులు నిరూపిస్తున్నారు. అయితే వ్యవసాయాన్ని దండగ కాదు పండగ చేసుకోవాలి అంటే దానికి కావాల్సింది.. మార్కెట్ పై అవగాహన .. ఏ పంట పండిస్తే ఆర్ధికంగా ఉపయోగమో తెలుసుకుని వ్యవసాయం చేస్తే.. పెట్టుబడి పెట్టిన దానికి రెట్టింపు లాభాలను సంపాదించవచ్చు అని కొంటామని రైతులు నిరూపిస్తున్నారు. ఇప్పుడు భారీ జీతాలు పెద్ద పెద్ద కంపెనీల్లో ఉద్యోగాలు చేసేవారు సైతం తమ ఉద్యోగానికి గుడ్ బై చెప్పేసి.. వ్యవసాయం బాట పడుతున్నారు. తమ చదువుకు ఆధునిక విజ్ఞానాన్ని జోడించి పంటలు పండించి లాభాలు ఆర్జిస్తున్నారు. ఈరోజు ఉత్తర్ ప్రదేశ్ కు చెందిన ఓ వ్యక్తి.. తాను చదివిన చదువును పక్కకు పెట్టి.. వ్యవసాయం చేసి.. 7 ఏళ్లలో 4 రెట్లు లాభాలను ఆర్జించాడు.. మరి ఆ పంట ఏమిటి.. ఎలా సాధ్యమైందో తెలుసుకుందాం..

ఉత్తరప్రదేశ్‌ లఖింపూర్‌ ఖేరి లోని సాకేతు  గ్రామానికి చెందిన సురేశ్‌ చంద్ర వర్మ (65)  బీఏ, ఎల్‌ఎల్‌బీ చదువుకున్నాడు. అయితే సురేష్ కు వ్యవసాయం చేయడం అంటే ఇష్టం. దీంతో తనకు వారసత్వంగా వచ్చిన భూమిలో రకరకాల పంటలను పండించడం మొదలు పెట్టారు. ఓ వైపు వరి, చెరకు వంటి ఆహార పంటలతో పాటు చెరకు వంటి వాణిజ్య పంటలను, ఇక మామిడి, ఉసిరి, లీచీ, నిమ్మ వంటి ఉద్యాన పంటలను సాగు చేస్తున్నాడు. అయితే పంటల మధ్యలో ఉన్న ఖాళీ భూమిలో ఏదైనా లాభాలను ఇచ్చే విధంగా మొక్కలను పెంచాలనుకున్నాడు.. దీంతో నాలుగేళ్ళ క్రితం అంతర పంటలపై దృష్టి పెట్టాడు. ఏ మొక్కలను అంతర పంటలుగా వేస్తె.. తక్కువ ఖర్చు అధిక లాభం వస్తుందో కొన్ని రోజులు పరిశోధించాడు.

సురేష్ చంద్రను వెదురు మొక్కలు ఆకర్షించాయి. వీటిని అంటారా పంటగా వేస్తె బాగుటుందని భావించాడు.. వెంటనే పంత్‌నగర్‌ వ్యవసాయ యూనివర్సిటీ నుంచి ఒకొక్క మొక్క రూ. 25ల చొప్పున మొత్తం 234 వెదురు మొక్కలను ఖరీదు చేశారు. వాటిని చెరకు తోటలో మధ్యలో నాటాడు. మూడేళ్లపాటు చెరకును పండించిన సురేష్.. వెదురు ఏపుగా పెరగడంతో నాలుగో ఏడూ మాత్రం చెరకు పంటని మానేసి.. కేవలం వెదురుని మాత్రమే కొనసాగిస్తున్నాడు. ఇక  ఈ నాలుగేళ్లలో ఒకొక్క వెదురు మొక్క 20 నుంచి 25 వెదురు బొంగులను ఉత్పత్తి చేసింది. దీంతో ఇప్పుడు ఒకొక్క వెదురు మొక్క 40 నుంచి 50 వరకు వెదురు వచ్చే అవకాశం ఉంది.

వెదురు బొంగు ధర రూ.150లుగా ఉంది. దీంతో ప్రతి మొక్క 50 వెదుర్లు ఉత్పత్తి చేస్తే.. సురేష్ నాటిన మొత్తం 234 మొక్కలకు 11 వేల 7 వందల వెదుర్లు వస్తాయి. అంటే తక్కువ ధరతో ప్రారంభించిన వెదురు మొక్కలు ఇప్పుడు సురేష్ కు రూ. 17 , 55,000 లను ఇచ్చాయి. అదే వెదురు ఇంకొంచెం పెరిగే ధర మరికొంచెం పెరిగే ఛాన్స్ ఉంది.  వినూత్నంగా ఆలోచించి.. తన వ్యవసాయంతో లక్షలు ఆర్జిస్తున్న సురేష్ పై ఇప్పుడు గ్రామస్థులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నాయి

Also Read: Mini Israel of India: మన దేశంలోని ఓ గ్రామం ఇజ్రాయెల్ వారికి ప‌ర్మినెంట్ టూరిస్ట్ స్పాట్.. అందుకే మినీ ఇజ్రాయిల్‌గా ఫేమస్..