Pawan Kalyan vs YCP : పవన్ – వైసీపీ నేతల మధ్య ముదరుతున్న మాటల యుద్ధం.. మళ్లీ విరుచుకుపడిన పవర్ స్టార్..
Andhra Pradesh: రిపబ్లిక్ సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్‌లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్.. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను ఓ ఊపు ఊపేస్తున్నాయి.
Andhra Pradesh: రిపబ్లిక్ సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్‌లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్.. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను ఓ ఊపు ఊపేస్తున్నాయి. ఆ రోజు మొదలు ఇప్పటి వరకు జనసేన, వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం భీకరంగా సాగుతోంది. మంత్రులందరూ మూకుమ్మడిగా పవన్ కళ్యాణ్‌పై విరుచుకుపడుతున్నారు. చిత్ర పరిశ్రమ, టికెట్ల పంపిణీ వంటి అంశాల్లో ఏపీ ప్రభుత్వంపై పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను మంత్రుల తీవ్రంగా ఖండించారు. పవన్ విధానాలను తూర్పారబట్టారు. మంత్రులంతా సన్నాసులు అంటూ పవన్ చేసిన తీవ్ర వ్యాఖ్యలకు.. మంత్రులు సైతం అంతే ఘాటుగా రిప్లై ఇస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయాలు ఆయన దోపిడీకి అడ్డంకిగా మారుతున్నాయి కాబట్టే అంతలా రియాక్ట్ అవుతున్నారంటూ ఫైర్ అయ్యారు.
అయితే, వైసీపీ నేతలు చేస్తున్న మూకుమ్మడి కామెంట్స్‌పై తాజాగా పవన్ కళ్యాణ్ స్పందించారు. ట్విట్టర్ వేదికగా వైసీపీ ప్రభుత్వంతోపై మరోసారి విరుచుకుపడ్డారు. వైసీపీ ప్రభుత్వ పాలసీ ‘ఉగ్రవాదం’ అంటూ మండిపడ్డారు. ఈ విధానలతో రాష్ట్రంలోని అన్ని రంగాుల, వర్గాలు నాశనం అయిపోయాయని ఫైర్ అయ్యారు. ఈ ఉగ్రవాద పాలసీని ఎదుర్కోవాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. ఈ మేరకు పవన్ ట్వీట్ చేశారు. ఇక దీనిపై వైసీపీ నేతలు ఎలా రియాక్ట్ అవుతారో మరి వేచి చూడాలి.
Pawan Kalyan Tweet:
వైసీపీ ప్రభుత్వం ‘పాలసీ ఉగ్రవాదం’ కి అన్నీ రంగాలు అన్ని వర్గాలు నాశనం అయిపోతున్నాయి. దీనిని ఎదుర్కోవలిసిన సమయం ఆసన్నమయింది..
— Pawan Kalyan (@PawanKalyan) September 28, 2021
Also read:
PM Modi: రైతులకు నిజంగా శుభవార్త.. 35 రకాల పంటలను జాతీయం చేయనున్న ప్రధాని నరేంద్ర మోదీ..