Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana Govt Jobs: అంతకు మించి ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వటం సాధ్యం కాదు.. మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు..

Telangana Govt Jobs: తెలంగాణలో ఉపాధి కల్పనపై రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. డిజిటల్ విప్లవాన్ని మనం అద్భుతంగా ఒడిసిపట్టుకునే

Telangana Govt Jobs: అంతకు మించి ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వటం సాధ్యం కాదు.. మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు..
Ktr
Follow us
Shiva Prajapati

|

Updated on: Sep 28, 2021 | 8:54 AM

Telangana Govt Jobs: తెలంగాణలో ఉపాధి కల్పనపై రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. డిజిటల్ విప్లవాన్ని మనం అద్భుతంగా ఒడిసిపట్టుకునే వీలుందన్న మంత్రి కేటీఆర్.. దాని ఆధారంగా రాష్ట్రంలో ఉపాధి కల్పనకు చర్యలు చేపడుతున్నామని చెప్పారు. రాష్ట్రంలో 4 కోట్ల జనాభా ఉందన్న ఆయన.. కేవలం 2 శాతం మందికి మించి ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వటం సాధ్యం కాదన్నారు. అందుకే ప్రైవేటు పెట్టుబడులను అధికంగా తెచ్చి ప్రైవేటు రంగంలో ఉపాధి కల్పనకు ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పారు. ముఖ్యంగా డిజిటల్‌ రంగంలో వచ్చే అవకాశాలను అందిపుచ్చుకునేందుకు గానూ 3ఐ విధానాన్ని తీసుకున్నామన్నారు. రాష్ట్రంలో 3ఐ (ఇన్నోవేషన్, ఇన్‌ఫ్ట్రాస్టక్చర్, ఇన్‌క్లూజీవ్ గ్రోత్) విజన్‌ను అమలు చేస్తున్నామని మంత్రి చెప్పారు.

ఇదిలాఉంటే.. తెలంగాణ ఏర్పాటు తరువాత గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్రానికి భారీ స్థాయిలో పెట్టుబడులు వస్తున్నాయని మంత్రి కేటీఆర్ తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఎన్నో దిగ్గజ కంపెనీలు సైతం తమ కేంద్రాలను హైదరాబాద్‌లో ఏర్పాటు చేసేందుకు ముందుకు వస్తున్నాయని వివరించారు. ఇప్పటికే టాప్ ఫైవ్ కంపెనీ తమ రెండో ప్రధాన కార్యాలయాలను హైదరాబాద్‌లో నెలకొల్పాయని గుర్తు చేశారు. దేశంలో ఉన్న పెద్ద పెద్ద కంపెనీలు సైతం తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నాయని చెప్పారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెరిగేందుకు తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు ముఖ్య కారణమని చెప్పారు. మౌళిక వసతులను మునుపెన్నడూ లేని విధంగా పెంచామని మంత్రి కేటీఆర్ వివరించారు. నిరంతర విద్యుత్ సహా, పెట్టుబడులకు పెట్టే పరిశ్రమలకు ప్రోత్సాహకాలు అందివ్వడం వంటి తదితర కారణాల వల్ల రాష్ట్రానికి పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయని చెప్పారు.

టీఎస్‌ ఐపాస్‌ ద్వారా ఇప్పటివరకు 17,302 పరిశ్రమలకు అనుమతిచ్చామని మంత్రి కేటీఆర్ వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా పెద్దవైన 300 కంపెనీలు తెలంగాణలో ఇప్పటికే పెట్టుబడులు పెట్టాయన్నారు. ఐటీ, ఎలక్ట్రానిక్స్, టెక్స్‌టైల్స్, ఫార్మా తదితర 14 ప్రాధాన్యతా రంగాలను ఎంపిక చేసుకుని వాటి తయారీ రంగాన్ని సాకారం చేస్తున్నామని చెప్పారు. ముచ్చర్లలో ప్రపంచంలోనే పెద్ద ఫార్మారంగం ఏర్పడుతోందన్నారు. అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ వాడే హెలికాప్టర్‌ క్యాబిన్‌ కూడా తెలంగాణలోనే తయారవుతుందని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. రాష్ట్రానికి ఇప్పటి వరకు రూ.2.20 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని వివరించారు. ఐటీతో కలుపుకొంటే 19 లక్షల మందికి ఉపాధి లభించిందన్నారు. ఇక ఉద్యోగాల్లో 70 శాతం స్థానికులకే ఇచ్చే కొత్త పారిశ్రామికవేత్తలకు అదనపు ప్రోత్సాహకాలను కూడా ప్రతిపాదిస్తున్నామని మంత్రి కేటీఆర్ తెలిపారు.

Also read:

Andhra Pradesh: విజయవాడలో దారుణం.. వ్యక్తిని పట్టుకుని పోలీసులకు అప్పగించిన పోలీసులు.. అసలేం జరిగిందంటే..

Pawan – YCP : పవన్‌ కళ్యాణ్‌పై మంత్రి పేర్ని నాని ఫైర్.. ట్విట్టర్ వేదికగా సంచలన కామెంట్స్..

AP Politics: పవన్ కళ్యాణ్ ఏమైనా ఋషి పుంగవుడా?.. మంత్రి బొత్స సత్యనారాయణ సంచలన కామెంట్స్..