AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Crime News: నవవధువు హత్యకు.. భర్త ముందే ప్లాన్.. ఆన్‌లైన్‌లో చాకు కొనుగోలు.. వెలుగులోకి సంచలన విషయాలు..

Man murderd his wife: హైదరాబాద్‌ పరిధిలోని ప్రగతినగర్‌లో పెళ్లై నెల రోజులు కాకముందే.. నవ వధువు భర్త హత్య చేసిన సంఘటన కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. 28 రోజుల క్రితం

Crime News: నవవధువు హత్యకు.. భర్త ముందే ప్లాన్.. ఆన్‌లైన్‌లో చాకు కొనుగోలు.. వెలుగులోకి సంచలన విషయాలు..
Man Murderd His Wife
Shaik Madar Saheb
|

Updated on: Sep 28, 2021 | 12:02 PM

Share

Man murderd his wife: హైదరాబాద్‌ పరిధిలోని ప్రగతినగర్‌లో పెళ్లై నెల రోజులు కాకముందే.. నవ వధువు భర్త హత్య చేసిన సంఘటన కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. 28 రోజుల క్రితం ప్రేమ వివాహం చేసుకున్న భర్త.. ప్లాట్‌లో భార్య గొంతు కోసి దారుణంగా హత్యచేశాడు. అనంతరం భర్త కిరణ్ కుమార్‌ ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. అయితే.. ఈ కేసుకు సంబంధించి సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. భార్యను హత్య చేయడానికి అతను ముందస్తు ప్లాన్‌ రూపొందించుకున్నట్లు పోలీసులు పేర్కొంటున్నారు. అత్తారింటి నుంచి హైదరాబాద్‌ వచ్చిన అనంతరం భార్యను హత్యచేసేందుకు ప్రత్యేకంగా మడత చాకును ఇంటర్నెట్‌ ద్వారా కొనుగోలు చేసుకున్నాడని సమాచారం. హత్య చేయడానికి ఐదు రోజుల ముందు ఈ బిజినెస్‌ సైట్‌ ద్వారా చాకును ఆర్డర్‌ చేశాడు.

అయితే.. హత్య జరగడానికి ముందురోజు అది డెలివరీ అయినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. అయితే.. ఈ చాకు చాలా చిన్నగా షార్ప్‌గా ఉంటుందని బాచుపల్లి పోలీసు వర్గాలు పేర్కొన్నాయి. ఆ చాకుతోనే సుధారాణి గొంతును దారుణంగా కోసి.. తనకు తాను గాయపరుచుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. భార్యను హత్య అనంతరం ఆమె బంధువులు తనను ఇబ్బంది పెట్టకుండా ఉండేందుకు నిందితుడు తనకు తాను గాయపరుచుకున్నాడనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం నిందితుడు నిజాంపేట రోడ్డులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలోని ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు. అతని పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు పేర్కొన్నారు. అయితే.. గొంతు లోతుగా గాయం కావడంతో నిందితుడు సరిగా మాట్లాడలేకపోతున్నాడని పేర్కొంటున్నారు.

కామారెడ్డి జిల్లా దేవునిపల్లి గ్రామానికి చెందిన పుట్టల గంగారాం చిన్న కూతురు సుధారాణి(22)కి ఎర్రోల కిరణ్ కుమార్‌కు గత నెల 28న వివాహమైంది. కిరణ్ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేస్తున్నాడు‌. వివాహమైన అనంతరం భార్యభర్తలిద్దరూ.. ప్రగతినగర్‌లోని శ్రీ సాయి ద్వారకా అపార్ట్మెంట్‌లో నివాసముంటున్నారు. ఈ క్రమంలోనే కిరణ్ సుధారాణిపై అనుమానంతో మానసికంగా, శారీరకంగా హింసించి చంపాడు.

Also Read:

Viral Video: వారెవ్వా.. ఈ రైతు తెలివికి ఫిదా అవ్వాల్సిందే.. అసలు ఏం చేస్తున్నాడో చూడండి…

Crime News: వేశ్యతో ప్రేమ.. హత్యకు పథకం.. అడ్డొచ్చిన భార్య.. సీన్‎లోకి పోలీసులు

ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...
నల్లటి ఇసుక ఎడారిలో పరిగెడుతున్న రంగు రంగుల గుర్రాలు..వీడియోవైరల్
నల్లటి ఇసుక ఎడారిలో పరిగెడుతున్న రంగు రంగుల గుర్రాలు..వీడియోవైరల్
ఎన్నడు లేని ఆఫర్లు..రూ. 4590కే వాషింగ్ మెషీన్, రూ.5,999కే టీవీ
ఎన్నడు లేని ఆఫర్లు..రూ. 4590కే వాషింగ్ మెషీన్, రూ.5,999కే టీవీ
ఈ రెండు చిరుతిండ్లు తింటే కాలేయం ఖతమే.. జాగ్రత్త పడకపోతే..
ఈ రెండు చిరుతిండ్లు తింటే కాలేయం ఖతమే.. జాగ్రత్త పడకపోతే..