Crime News: వేశ్యతో ప్రేమ.. హత్యకు పథకం.. అడ్డొచ్చిన భార్య.. సీన్‎లోకి పోలీసులు

అతనికి పెళ్లైంది. ఇద్దరు పిల్లలు ఉన్నారు.. కానీ ఓ అలవాటు అతడిని నేరస్థుడిగా మార్చింది...

Crime News: వేశ్యతో ప్రేమ.. హత్యకు పథకం.. అడ్డొచ్చిన భార్య.. సీన్‎లోకి పోలీసులు
Prostitute
Follow us
Srinivas Chekkilla

|

Updated on: Sep 28, 2021 | 10:59 AM

అతనికి పెళ్లైంది. ఇద్దరు పిల్లలు ఉన్నారు.. కానీ ఓ అలవాటు అతడిని నేరస్థుడిగా మార్చింది. పరాయివారి మోజులో పడి కట్టుకున్నవారిని హత్య చేసేందుకు కుట్ర పన్ని చివరికి పోలీసులకు చిక్కాడు. వివరాలలోకి వెళ్తే.. ఢిల్లీకి చెందిన 36 ఏళ్ల వ్యక్తికి 2006లో ఓ మహిళతో పెళ్లైంది. వారికి భార్య, ఇద్దరు పిల్లలు.. ఎంతో సంతోషంగా ఉండే ఆ కుటుంబంలో వివాహేతర సంబంధం చిచ్చు పెట్టింది. అతను ఈ మధ్యే ఒక వేశ్య గృహానికి వెళ్లాడు. తరుచూ ఆమె వద్దకే వెళ్లేవాడు.. ఈ దశలో ఆమెతో ప్రేమలో పడ్డాడు. ఆమెను పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. అతను ఇంటిలో ఉండకుండా ఎప్పుడూ వేశ్య దగ్గరికి వెళ్లేవాడు. ఈ విషయం తెలుసుకున్న భార్య అతన్ని నిలదీసింది. ఈ విషయమై వారి మధ్య తరుచూ గొడవలు జరిగేవి. చివరికి అతడు భార్య విడాకులు ఇచ్చేసి వేశ్యను వివాహం చేసుకుంటానని చెప్పాడు.

ఇద్దరు పిల్లలు ఉన్నారు.. విడాకులు ఇస్తే పిల్లల భవిష్యత్ నాశనం అవుతుందని చెప్పిన భార్య విడిపోవడానికి ససేమిరా అనడంతో అతడిలో ఉన్న నేరస్థుడు బయటకు వచ్చాడు. అడ్డుగా ఉన్న భార్యను చంపడానికి భారీ పథకాన్నే రచించాడు. కొద్దిరోజుల క్రితం రూ. 50000 పెట్టి రెండు పిస్టల్స్, బుల్లెట్లు కొనుగోలు చేశాడు. వాటితో పాటు మరిన్ని ఆయుధాలు కొనుగోలు చేశాడు. ఆయుధాలు సరఫరా చేస్తునట్లు సమాచారం అందడంతో రైడ్‎కి వెళ్లిన పోలీసులకు నిందితుడు అడ్డంగా బుక్కయ్యాడు. అతడిని అరెస్ట్ చేసి విచారిస్తే అసలు విషయం వెలుగులోకి వచ్చింది. తుపాకీ, బుల్లెట్లు ఎందుకు కొనుగోలు చేశావని అడుగగా, తన భార్యను చంపేందుకు ఆయుధాలు కొనుగోలు చేశానని తెలుపడంతో పోలీసులు షాక్ అయ్యారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతడికి ఆయుధాలను అమ్మిన వ్యక్తి కోసం గాలిస్తున్నారు. అతడిపై ముందు నుంచే పలు నేరాలు చేశాడని పోలీసులు తెలిపారు. 2006, 2011లో ప్రాస్టిట్యూషన్ కేసులు, 2015లో అక్రమ ఆయుధాల కేసు నమోదయ్యాయని చెప్పారు.

Read Also.. Crime News: భాగ్యనగరంలో మరో దారుణం.. నవ వధువును దారుణంగా చంపిన భర్త..

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!