AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Crime News: భాగ్యనగరంలో మరో దారుణం.. నవ వధువును దారుణంగా చంపిన భర్త..

Man Murdered his Wife: హైదరాబాద్‌ నగరంలో మరో దారుణం చోటుచేసుకుంది. ప్రగతినగర్‌లో నవ వధువును భర్త చంపిన సంఘటన మరిచిపోక ముందే..

Crime News: భాగ్యనగరంలో మరో దారుణం.. నవ వధువును దారుణంగా చంపిన భర్త..
Crime News
Shaik Madar Saheb
|

Updated on: Sep 27, 2021 | 2:11 PM

Share

Man Murdered his Wife: హైదరాబాద్‌ నగరంలో మరో దారుణం చోటుచేసుకుంది. ప్రగతినగర్‌లో నవ వధువును భర్త చంపిన సంఘటన మరిచిపోక ముందే.. మరో దారుణం వెలుగులోకి వచ్చింది. మరో నవ వధువు హత్యకు గురైంది. ఈ సంఘటన నగరంలోని సనత్‌నగర్‌ పరిధిలో చోటు చేసుకుంది. సనత్‌నగర్‌ పరిధిలోని భరత్‌నగర్‌లో నవ వధువు హత్యకు గురైనట్లు పోలీసులు వెల్లడించారు. భర్త గంగాధర్‌ భార్య గొంతు నులిమి చంపేసినట్లు వెల్లడించారు. ఆదివారం అర్ధరాత్రి సమయంలో భార్యభర్తల మధ్య ఘర్షణ జరిగింది. దీంతో కోపంతో రగిలిపోయిన గంగాధర్‌.. భార్య మానసను గొంతు నులిమి హత్య చేసినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న సనత్ నగర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇదిలాఉంటే.. హైదరాబాద్‌ పరిధిలోని ప్రగతినగర్‌లో శనివారం రాత్రి భర్త.. నవ వధువు గొంతు కోసి దారుణంగా హత్యచేశాడు. అనంతరం అతను కూడా హత్యాయత్నానికి ప్రయత్నించాడు. ఈ సంఘటన బాచుపల్లి పరిధిలోని ప్రగతినగర్‌లో చోటు చేసుకుంది. కామారెడ్డి జిల్లా దేవునిపల్లి గ్రామానికి చెందిన పుట్టల గంగారాం చిన్న కూతురు సుధారాణి(22)కి ఎర్రోల కిరణ్ కుమార్‌కు గత నెల 28న వివాహమైంది. కిరణ్ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేస్తున్నాడు‌. వివాహమైన అనంతరం భార్యభర్తలిద్దరూ.. ప్రగతినగర్‌లోని శ్రీ సాయి ద్వారకా అపార్ట్మెంట్‌లో నివాసముంటున్నారు.పెళ్లియిన వారం రోజుల నుంచే కిరణ్ సుధారాణి పై అనుమానంతో మానసికంగా, శారీరకంగా హింసించడం మొదలుపెట్టాడు. ఈ క్రమంలో.. శనివారం రాత్రి భార్య గొంతుకోసి చంపాడు.

Also Read:

Crime News: భార్య ముక్కు కొరికిన భర్త..  భరణం ఇవ్వాలన్నందుకు అత్తారింటికి వెళ్లి..

Crime News: భార్య ఫోన్ మాట్లాడుతుందని.. భర్త దారుణం.. ఇద్దరు పిల్లలను కిరాతకంగా చంపి.. ఆపై వీడియో తీసి..