AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Crime News: భార్య ఫోన్ మాట్లాడుతుందని.. భర్త దారుణం.. ఇద్దరు పిల్లలను కిరాతకంగా చంపి.. ఆపై వీడియో తీసి..

అనుమానం ఎంత పెద్ద రోగమో మరోసారి నిరూపితమైంది. ఈ అనుమానం అనే పెనుభూతంతో చాలా కుటుంబాలు నాశనమయ్యాయి. నిన్న హైదరాబాద్‎లోని ప్రగతినగర్‎లో పెళ్లైన నెలకే ...

Crime News: భార్య ఫోన్ మాట్లాడుతుందని.. భర్త దారుణం.. ఇద్దరు పిల్లలను కిరాతకంగా చంపి.. ఆపై వీడియో తీసి..
Crime News
Srinivas Chekkilla
|

Updated on: Sep 27, 2021 | 12:12 PM

Share

అనుమానం ఎంత పెద్ద రోగమో మరోసారి నిరూపితమైంది. ఈ అనుమానం అనే పెనుభూతంతో చాలా కుటుంబాలు నాశనమయ్యాయి. నిన్న హైదరాబాద్‎లోని ప్రగతినగర్‎లో పెళ్లైన నెలకే అనుమానంతో భార్య గొంతు కోసి హత్య చేశాడో భర్త. ఆ తర్వాత తాను ఆత్మహత్యకు యత్నించాడు. తాజాగా తమిళనాడులో కూడా ఇదే తరహా ఘటన జరిగింది. తమిళనాడులోని సేలం జిల్లాలో తన భార్యకు వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతో ఓ వ్యక్తి తన ఇద్దరు పిల్లలను చంపి ఆత్మహత్య చేసుకున్నాడు. అతను చనిపోయే ముందు, పిల్లలు చెట్టుకు వేలాడుతున్న వీడియోను రికార్డ్ చేసి బంధువులకు పంపించాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

జిల్లాలోని మంగళపట్టికి చెందిన 33 ఏళ్ల వ్యక్తి పదమూడేళ్లుగా ఓ రెస్టారెంట్‌లో పనిచేస్తున్నాడు. అతను కార్యాలయంలో జరిగిన ప్రమాదంలో గాయపడ్డాడు. ఆస్పత్రిలో చికిత్స తీసుకుని.. ఇంటికి వెళ్లాడు. పది రోజుల పాటు ఇంట్లోనే విశ్రాంతి తీసుకున్నాడు. ఈ సమయంలో అతని భార్య మరొక వ్యక్తితో ఫోన్‌లో మాట్లాడుతున్నట్లు అనుమానించడం ప్రారంభించాడు. ఇదే విషయం దంపతుల మధ్య వివాదంగా మారింది. దీని వారు తరుచూ గొడవ పడేవారు. ఇతర వ్యక్తులతో మాట్లాడవద్దని ఆ వ్యక్తి తన భార్యకు చెప్పాడు. ఆదివారం సాయంత్రం అతను దుకాణానికి వెళ్తున్నట్లు తన భార్యకు చెప్పాడు. తనతోపాటు తొమ్మిదేళ్ల కుమారుడు, ఐదేళ్ల కుమార్తెను తీసుకెళ్లాడు. భార్య సెల్‌ఫోన్‌ను కూడా తీసుకెళ్లాడు.

అతను పిల్లలను తీసుకుని ఒక మామిడి తోటలోకి వెళ్లాడు. వారిని తాడుతో చెట్టుకు ఉరేసి హత్య చేశాడు. పిల్లలు చెట్టుకు వేలాడుతున్న దృశ్యాలను మొబైల్ ఫోన్‎లో చిత్రీకరించాడు. “మీరు కోరుకున్నది ఇదే. మీరు మమ్మల్ని చంపాలనుకున్నారు. చూడండి, మేము ఇప్పుడు చనిపోయాం. అంటూ సందేశం ఇస్తూ వీడియోను బంధువులకు పంపించాడు. అనతరం తాను ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయమై సంకగిరి పోలీస్ స్టేషన్‌లో ఆ మహిళ, ఆమె కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

ఇదీ కూడా చదవండి: Anantapur District: రాత్రిపూట పొలాలవైపు నుంచి వింత శబ్ధాలు.. భయంతో వెళ్లి చూసిన స్థానికులు.. షాక్

Self Abortion: యూట్యూబ్ చూసి.. తనకు తానే అబార్షన్ చేసుకున్న యువతి.. ఏడు నెలల శిశువును.