AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Fake Currency: యూట్యూబ్‎లో చూసి మొదలు పెట్టేశాడు.. చికెన్‌ పకోడితో దొరికిపోయాడు..

ఈ మధ్య యూట్యూబ్‎లో చూసి కొత్త కొత్త ప్రయోగాలు చేస్తున్నారు....

Fake Currency: యూట్యూబ్‎లో చూసి మొదలు పెట్టేశాడు.. చికెన్‌ పకోడితో దొరికిపోయాడు..
Fake1
Srinivas Chekkilla
|

Updated on: Sep 28, 2021 | 10:14 AM

Share

ఈ మధ్య యూట్యూబ్‎లో చూసి కొత్త కొత్త ప్రయోగాలు చేస్తున్నారు. అప్పట్లో ఓ వ్యక్తి ఏటీఎంలో దొంగతనం చేయడం ఎలా అని యూట్యూబ్‎లో చూసి చోరీ చేశాడు. కొద్దిరోజుల క్రితం మహారాష్ట్రలో ఓ అమ్మాయి అబార్షన్ చేయడం ఎలా అని చూసి తనకు తానే అబార్షన్ చేసుకుని చివరికి ఆస్పత్రి పాలయింది. ఇలా ఏ పనైనా యూట్యూబ్ చూసి కానిచ్చేస్తున్నారు. తాజాగా ఓ వ్యక్తి యూట్యూబ్‎లో దొంగనోట్ల తయారు చేయడం చూసి ఏకంగా ఇంట్లోనే నోట్లు తయారీ చేయడం మొదలు పెట్టాడు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్‎లోని కర్నూల్ జిల్లాలో జరిగింది. గుంతకల్లు మండలం కసాపురం గ్రామానికి చెందిన నూర్‌బాషా.. పాల వ్యాపారంతో పాటు వడ్డీ వ్యాపారం చేస్తుంటాడు. ఈనెల 25న కర్నూలు జిల్లా మద్దికెర మండలం జొన్నగిరికి పనిపై వెళ్లాడు. అక్కడ చికెన్‌ పకోడి కొనుగోలు చేసి రూ.వంద నోటు ఇచ్చాడు.

ఆ నోటును పరిశీలించిన చికెన్ పకోడి అతను అది నకిలీదని అనుమానించాడు. తనకు వద్దని చెప్పాడు. అదే సమయంలో అక్కడే ఉన్న జొన్నగిరి పోలీస్‌ స్టేషన్‌ కానిస్టేబుల్ అప్రమత్తమై నూర్‌బాషాను పట్టుకుని తనిఖీ చేశాడు. అతని వద్ద ఉన్న నోట్లను పరిశీలించాడు. అందులో 30 వంద నోట్లు నకిలీవేనని తేలింది. వెంటనే నూర్‌బాషాను అదుపులోకి తీసుకుని జొన్నగిరి పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. పోలీసులు అతడిని తమదైన శైలిలో విచారించగా దొంగనోట్ల తయారీ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.

కసాపురానికి చేరుకున్న పోలీసులు… నూర్‌బాషా ఇంటిలో దొంగ నోట్ల తయారీకి సంబంధించిన స్కానర్, జిరాక్స్‌ మిషన్లు, నోట్ల తయారీలో ఉపయోగించే పేపర్‌ను స్వాధీనం చేసుకున్నారు. నోట్ల తయారీకి సహకరించిన ఖాజా, ఎన్‌.ఖాసీంను అరెస్ట్‌ చేశారు. యూట్యూబ్‌ చూసి నోట్ల తయారీ విధానాన్ని నేర్చుకుని మరో ఇద్దరితో కలిసి దొంగనోట్లను ప్రింట్ చేస్తున్నట్లు నూర్ అంగీకరించారు. గుంతకల్లు, మద్దికెర, జొన్నగిరి తదితర ప్రాంతాల్లో నోట్లు మార్పిడి చేశానని చెప్పాడు. రూ.50 వేల అసలైన నోట్లు తీసుకుని రూ.లక్ష నకిలీ నోట్లను ఇచ్చానని ఒప్పుకున్నాడు.

Read also: Self Abortion: యూట్యూబ్ చూసి.. తనకు తానే అబార్షన్ చేసుకున్న యువతి.. ఏడు నెలల శిశువును..