AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: వారెవ్వా.. ఈ రైతు తెలివికి ఫిదా అవ్వాల్సిందే.. అసలు ఏం చేస్తున్నాడో చూడండి…

మట్టిలో మాణిక్యాలు అని ఊరికే అంటారా ? ఆలోచించాలే గానీ.. మన చుట్టూ ఉన్న వస్తువులతో ఎన్ని ఉపయోగాలున్నాయో

Viral Video: వారెవ్వా.. ఈ రైతు తెలివికి ఫిదా అవ్వాల్సిందే.. అసలు ఏం చేస్తున్నాడో చూడండి...
Viral Video
Rajitha Chanti
|

Updated on: Sep 28, 2021 | 11:29 AM

Share

మట్టిలో మాణిక్యాలు అని ఊరికే అంటారా ? ఆలోచించాలే గానీ.. మన చుట్టూ ఉన్న వస్తువులతో ఎన్ని ఉపయోగాలున్నాయో అర్థమవుతుంది. ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ యుగంలో టెక్నాలజీని వాడకంలో మనం ముందుంటాం. చిన్నా.. పెద్దా అనే తేడా లేకుండా.. తమ ఆలోచనతో టెక్నాలజీని ఉపయోగించుకోవడంలో కొందరు వినూత్న దారిని అవలంభిస్తుంటారు. రెగ్యూలర్‏గా చేసే పని అయినా.. ఆలోచన జోడిస్తే.. అధ్భుత ఫలితాలను కలుగుతాయి. శరీరానికి ఎక్కువగా శ్రమ కలగకుండానే.. కఠిన పనులను కూడా సులభంగా పూర్తిచేయవచ్చు. ఏంటీ ఇంతగా.. దేని గురించి చెప్తుంది అనుకుంటున్నారా ? ఇప్పుడు ఓ రైతుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. అతడు చేసిన పనికి.. అతని ఆలోచనకు కచ్చితంగా ఫిదా అవుతారు. ఇంతకీ ఆ రైతు ఏం చేసాడో తెలుసుకుందామా.

గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో ఓ రైతుకు సంబంధించిన వీడియో తెగ వైరల్ అవుతుంది. అందులో అతను తన తెలివితో వినుత్న పనికి శ్రీకారం చుట్టారు. చెట్టు నుంచి మట్టిని వేరు చేయడానికి తన బైక్‏ను ఉపయోగిస్తున్నాడు. బైక్ స్టార్ట్ చేసి.. కదులుతున్న చక్రంలో మొక్కల మొదళ్లను పెట్టగానే.. వాటికి ఉన్న మట్టి సులభంగా వదిలిపోతుంది. దీంతో అతడికి పెద్దగా శ్రమ లేకుండానే.. కొన్ని మొక్కల నుంచి సులభంగా మట్టిని వేరు చేస్తున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు అతని ఆలోచన విధానానికి ఫిదా అవుతున్నారు. ఆ వీడియోను మీరు చూసెయ్యండి..

View this post on Instagram

A post shared by JUGAAD (@jugaadu_life_hacks)

Also Read: Love Story: లవ్‌ స్టోరీ మ్యాజికల్‌ సక్సెస్‌ మీట్‌.. ముఖ్య అతిధిగా ఎవరు హాజరువుతున్నారో తెలుసా.?

Naga Shaurya: టాలీవుడ్‏లో సినిమాల జాతర.. అప్డేట్స్ ఇస్తున్న హీరోలు.. లక్ష్య రిలీజ్ డేట్ చెప్పిన నాగశౌర్య…

Maha Samudram: ఓటీటీలోకి మహా సముద్రం.. ? శర్వానంద్ సినిమా కోసం ఎన్ని కోట్లు ఆఫర్ అంటే..