Naga Shaurya: టాలీవుడ్‏లో సినిమాల జాతర.. అప్డేట్స్ ఇస్తున్న హీరోలు.. లక్ష్య రిలీజ్ డేట్ చెప్పిన నాగశౌర్య…

Rajitha Chanti

Rajitha Chanti |

Updated on: Sep 28, 2021 | 10:02 AM

కరోనా సెకండ్ వేవ్ అనంతరం థియేటర్లు తెరుచుకున్నప్పటికీ మేకర్స్ మాత్రం ఓటీటీల వైపే ఆసక్తి చూపించారు.

Naga Shaurya: టాలీవుడ్‏లో సినిమాల జాతర.. అప్డేట్స్ ఇస్తున్న హీరోలు.. లక్ష్య రిలీజ్ డేట్ చెప్పిన నాగశౌర్య...
Lakshya

కరోనా సెకండ్ వేవ్ అనంతరం థియేటర్లు తెరుచుకున్నప్పటికీ మేకర్స్ మాత్రం ఓటీటీల వైపే ఆసక్తి చూపించారు. అయితే ఇటీవల ఎస్ఆర్ కళ్యాణమండపం, తిమ్మరుసు వంటి చిత్రాలు థియేటర్లలో విడుదలై సూపర్ హిట్ అందుకున్నాయి. తాజాగా శేఖర్ కమ్ముల తెరకెక్కించిన లవ్ స్టోరీ సినిమా సైతం బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. దీంతో తమ చిత్రాలను విలైనంత తొందరగా పూర్తిచేసి.. థియేటర్లలో విడుదల చేయాలని భావిస్తున్నారు. గత కొద్ది రోజులుగా తమ సినిమాల విడుదల తేదీలను ప్రకటిస్తున్నారు స్టార్ హీరోస్. అయితే ఇప్పుడు మేకర్స్ దృష్టి మొత్తం పండుగలపై పడినట్లుగా తెలుస్తోంది. దసరా.. సంక్రాంతి పండుగలపై చిత్రయూనిట్స్ ఆశలన్ని… చిన్న హీరోలతో పాటు.. అగ్ర హీరోలు సైతం పండగల బరిలో దిగనున్నారు. భారీ బడ్జెట్ చిత్రాలతో చిన్న సినిమాలు పోటి పడబోతున్నాయి.

ఇదిలా ఉంటే.. తాజాగా యంగ్ హీరో నాగశౌర్య కూడా ఫాంలోకి వచ్చాడు. ప్రస్తుతం ఈ యంగ్ హీరో ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా లక్ష్య. ఈ మూవీకి సంతోష్‌ జాగర్లపూడి దర్శకత్వం వహిస్తుండగా సోనాలి నారంగ్ సమర్పణలో శ్రీ వేంకటేశ్వర సినిమాస్‌ ఎల్‌ఎల్‌పి, నార్త్‌స్టార్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకాలపై నిర్మాతలు నారయణదాస్ కె. నారంగ్‌, పుస్కూర్‌ రామ్‌మోహన్‌రావు, శరత్‌ మరార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇందులో శౌర్యకు జోడీగా కేతిక శర్మ హీరోయిన్‌గా నటిస్తుంది. స్పోర్ట్స్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో జగపతి బాబు కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్స్ ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ సినిమాను నవంబర్ 12న విడుదల చేయబోతున్నట్లుగా ప్రకటించారు మేకర్స్. ఇందులో నాగశౌర్య .. విభిన్న పాత్రలతో అలరించనున్నాడు. ఇందులో సిక్స్ ప్యాక్, పోనీ టెయిల్ తో కనిపించనున్నాడు. ఈ చిత్రానికి కాలభైరవ సంగీతం అందిస్తున్నాడు. ఇదిలా ఉంటే.. మరోవైపు.. నాగశౌర్య.. రీతూవర్మ జంటగా నటించిన స వరుడు కావలెను సినిమా అక్టోబర్ 15న విడుదల కానుంది.

ట్వీట్..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu