Mehreen Pirzada: మనస్ఫూర్తిగా నవ్వుతోన్న మెహరీన్.. ఇంతకీ ఆ నవ్వుకు కారణమేంటి ముద్దుగుమ్మ.
Mehreen Pirzada: 'కృష్ణ గాడి వీర ప్రేమగాథ' సినిమాతో వెండి తెరకు పరిచయమైంది అందాల తార మెహరీన్ పిర్జాదా. తొలిసినిమాతోనే తనదైన అందం, క్యూట్ నటనతో ప్రేక్షకులకు ఆకట్టుకుందీ ముద్దుగుమ్మ...
Mehreen Pirzada: ‘కృష్ణ గాడి వీర ప్రేమగాథ’ సినిమాతో వెండి తెరకు పరిచయమైంది అందాల తార మెహరీన్ పిర్జాదా. తొలిసినిమాతోనే తనదైన అందం, క్యూట్ నటనతో ప్రేక్షకులకు ఆకట్టుకుందీ ముద్దుగుమ్మ. అనంతరం రెండో చిత్రంతోనే బాలీవుడ్‌లో నటించే చాన్స్ కొట్టేసింది. ఇక తర్వాత ‘రాజా ది గ్రేట్’, ‘నోటా’ వంటి పెద్ద సినిమాల్లో నటించి మంచి గుర్తింపు సంపాదించుకుంది. అనంతరం వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా తెరకెక్కిన ‘ఎఫ్2’లో నటించి మరో సూపర్ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది.
ఇదిలా ఉంటే గతకొన్ని రోజుల క్రితం వివాహం విషయంలో ఈ అమ్మడు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారిన విషయం తెలిసిందే. హర్యానా హర్యానా మాజీ సీఎం భజన్ లాల్ మనవడు భవ్య భిష్ణోయ్‌తో నిశ్చితార్థం అవ్వడం, తర్వాత రద్దు చేసుకోవడం ఇలా చకా చకా జరిగిపోయాయి. అయితే ఈ సంఘటన నుంచి వెంటనే బయట పడ్డ మెహరీన్ మళ్లీ సినిమాల్లో వేగాన్ని పెంచేసింది.
ఇక సినిమాలతో నిత్యం బిజీగా ఉండే ఈ చిన్నది సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటుంది. తన సినిమాల వివరాలతో పాటు వ్యక్తిగత విశేషాలను ఎప్పటికప్పుడు అభిమాలనుతో షేర్ చేసుకోవడం మెహరీన్‌కు అలవాటు. ఈ క్రమంలోనే మెహరీన్ తాజాగా చేసిన ఓ ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఏదో రెస్టారెంట్‌లో ఫుడ్ ఎంజాయ్ చేస్తోన్న సమయంలో దిగిన ఫొటోను షేర్ చేసింది మెహరీన్. ఇందులో ఆమె నవ్వుతూ ఉంది. ఇక ఈ ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఈ చిన్నది.. ‘మనస్ఫూర్తిగా నవ్వుతున్నాను’ అని అర్థం వచ్చేలా క్యాప్షన్ రాసుకొచ్చింది. ఇక ఈ పోస్ట్ చూసిన ఆమె అభిమానులు ఇంతకీ ఆ నవ్వుకు కారణం ఏంటి.? అంటూ కామెంట్లు చేస్తున్నారు.
View this post on Instagram
Maha Samudram: ఓటీటీలోకి మహా సముద్రం.. ? శర్వానంద్ సినిమా కోసం ఎన్ని కోట్లు ఆఫర్ అంటే..