Maha Samudram: ఓటీటీలోకి మహా సముద్రం.. ? శర్వానంద్ సినిమా కోసం ఎన్ని కోట్లు ఆఫర్ అంటే..

టాలెంటెడ్ హీరో శర్వానంద్.. సిద్ధార్థ్ కలిసి నటిస్తున్న మల్టీస్టారర్ సినిమా మహా సముద్రం. లవ్ అండ్ యాక్షన్ డ్రామాగా

Maha Samudram: ఓటీటీలోకి మహా సముద్రం.. ? శర్వానంద్ సినిమా కోసం ఎన్ని కోట్లు ఆఫర్ అంటే..
Maha Samudram

టాలెంటెడ్ హీరో శర్వానంద్.. సిద్ధార్థ్ కలిసి నటిస్తున్న మల్టీస్టారర్ సినిమా మహా సముద్రం. లవ్ అండ్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ మూవీని ఆర్ ఎక్స్ 100 ఫేమ్ అజయ్ భూపతి తెరకెక్కిస్తున్నాడు. ఇందులో అదితి రావు హైదరి, అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తైన ఈ మూవీ అక్టోబర్ 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో సినిమా ప్రమోషన్స్ వేగవంతం చేశారు మేకర్స్. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ సాంగ్స్, ట్రైలర్ సినిమా పై మరింత హైప్ క్రియేట్ చేశారు. ఇటీవల విడుదలైన చెప్పకే చెప్పకే సాంగ్ సూపర్ హిట్ గా దూసుకుపోతుంది.

ఇటీవల విడుదలైన ట్రైలర్‏లో శర్వానంద్, సిద్ధార్థ్ , జగపతి బాబు.. అదితి రావు , అను ఇమాన్యూయేల్ పాత్రలను చూపిస్తూ.. లవ్ అండ్ యాక్షన్ డ్రామాగా వస్తున్న అంచనాలను పెంచేశారు. ముఖ్యంగా ట్రైలర్‏లో వచ్చిన డైలాగ్స్ అదిరిపోయాయి. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ సినిమా నుంచి మరో ఇంట్రెస్టింగ్ బజ్ వినిపిస్తోంది. మహా సముద్రం సినిమా డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ తీసుకున్నట్లుగా టాక్. ఈ మూవీ రైట్స్ ను సదరు సంస్థ రూ. 11 కోట్లకు కొనుగోలు చేసినట్లుగా తెలుస్తోంది. ఈ సినిమాను ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సుంకర రామబ్రహ్మం నిర్మిస్తున్నారు. అలాగే చైతన్య భరద్వాజ్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. ఇందులో జగపతి బాబు.. రావు రమేష్ కీలక పాత్రలలో నటిస్తున్నారు.

ఇదిలా ఉంటే.. తాజాగా చెప్పకే చెప్పకే సాంగ్ మేకింగ్ వీడియోను సైతం విడుదల చేసింది చిత్రయూనిట్.  సముద్రంలో ఒడ్డున తెరకెక్కించిన ఈ పాటలో విజువల్స్‌ అద్భుతంగా ఉన్నాయి. ముఖ్యంగా అదితిరావు ప్రధానంగా చిత్రీకరించిన ఈ సాంగ్‌లో అందాల తార చీర కట్టులో ఆకట్టుకుంటోంది.

Also Read: Shekar Kammula: ఇందూరు యాసకు శేఖర్ కమ్ముల ఫిదా.. నిజామాబాద్ గడీలు, కోటల గురించి ఆసక్తికర కామెంట్స్..

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Telugu