Shekar Kammula: ఇందూరు యాసకు శేఖర్ కమ్ముల ఫిదా.. నిజామాబాద్ గడీలు, కోటల గురించి ఆసక్తికర కామెంట్స్..

ఆయన సినిమాలు రియాల్టిక్‏గా ఉంటాయి. అటు ఫ్యామిలీ ప్రేక్షకులను.. ఇటు యువతను అట్రాక్ట్ చేయడంలో తనకు

Shekar Kammula: ఇందూరు యాసకు శేఖర్ కమ్ముల ఫిదా.. నిజామాబాద్ గడీలు, కోటల గురించి ఆసక్తికర కామెంట్స్..
Shekar Kammula

ఆయన సినిమాలు రియాల్టిక్‏గా ఉంటాయి. అటు ఫ్యామిలీ ప్రేక్షకులను.. ఇటు యువతను అట్రాక్ట్ చేయడంలో తనకు తనే సాటి. తెలుగు సంప్రదాయలకు అద్దం పట్టినట్లుగా సినిమాలను తెరకెక్కిస్తూ.. వరుస విజయాలను అందుకుంటూ సక్సెస్ ఫుల్‏గా దూసుకుపోతున్నాడు. ఇటీవల ఆయన తెరకెక్కించిన అందమైన ప్రేమకథ చిత్రానికి తెలుగు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఈపాటికి మీకు అర్థమయ్యే ఉంటుంది. ఆయనెవరో… అతనే క్లాసికల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల. నాగచైతన్య.. సాయి పల్లవి జంటగా శేఖర్ కమ్ముల రూపొందించిన లవ్ స్టోరీ సినిమా సెప్టెంబర్ 24న విడుదలై సూపర్ హిట్ అందుకుంది. బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్ సొంతం చేసుకుని.. నిర్మాతలకు కాసుల వర్షం కురిపిస్తుంది. ఈ సందర్భంగా.. తన సినీ ప్రయాణం.. లవ్ స్టోరీ సినిమా గురించి ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చారు శేఖర్ కమ్ముల.

నిజామాబాద్ భాష.. అక్కడి గడీలు, కోటలు, గుడులు పచ్చటి పొలాలు తెలంగాణ సంస్కృతికి అద్దం పడతాయని శేఖర్ కమ్ముల అన్నారు. ఆధునికత ఉట్టిపడే భవనాలతో పాటు.. పాత కాలం నాటి ఇళ్లు ఇక్కడ కనిపిస్తాయి. సినిమా కథాంశానికి అనుకూలమైన నిర్మాణాలుంటే తెరపై సహజత్వం ప్రతిబింబిస్తుందని.. అందుకే ఫిదా కోసం బాన్సువాడలో.. లవ్ స్టోరీ కోసం ఆర్మూర్ మండలం పిప్రి, మంథిని గ్రామల ఇళ్లు చక్కగా సరిపోయాయని చెప్పుకొచ్చారు శేఖర్ కమ్ముల. అందుకే తన సినిమాల్లో నిజామాబాద్ ప్రాంతాలకు ప్రాధాన్యత ఇచ్చినట్లుగా తెలిపారు.

నిజామాబాద్ జిల్లాలో ఎర్రజొన్న పంట ప్రత్యేకమని విన్నాను.. కంకులతో పంట ఎర్రగా ఉన్న సందర్భంలో చిత్రీకరణకు అనుకూలంగా ఉంటుంది. శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ వెనుక జలాల పరిసరాలు రానున్న రోజుల్లో పర్యాటకంగా అభివద్ధి చెందనున్నానాయి. భవిష్యత్తులో ఇక్కడ సన్నివేశాలు తీయడానికి పరిశీలిస్తాను. సినిమాలో భౌతిక పరిస్థితులే కాకుండా.. భాష పరంగా స్థానిక మాండలికాలకు ప్రాధాన్యం ఇస్తాను. ఫిదాతోపాటు.. లవ్ స్టోరీలోనూ ఇలాంటి ప్రయోగాలే చేశాను. హీరోయిన్.. కోపంలో అనే మాటలు.. కంజూస్.. పిసినారి, బర్బాద్.. చెడకొట్టడం.. వంటివి చేర్చాం. ఇలాంటి మాటలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. మనం రోజు మాట్లాడుకునే మాటలే సినిమాలో ఉన్నాయి. అందుకే తొందరగా ప్రేక్షకులు అంగీకరించారు. స్థానికుల మంచితనం వలన చిత్రీకరణ సులువుగా పూర్తయింది. ఏది అడిగినా వెంటనే చేస్తారు. పిప్రిలో రాజారెడ్డి.. భోజారెడ్డి బాగా సహకరించారు. వారి ఇళ్లు ఇవ్వడమే కాకుండా.. మేము లోపల ఉంటే వారు బయట ఉన్నారు.. తిరిగి వెళ్లే సమయంలో చాలా భావోద్వేగానికి గురయ్యారని చెప్పారు. అలాగే మా బృందంలోని సభ్యులు ఎంచుకున్న ఆధారంగానే బాన్సువాడ, ఆర్మూర్ గ్రామాలను ఎంపిక చేసుకున్నామని తెలిపారు శేఖర్ కమ్ముల..

Also Read: Maha Samudram: సముద్ర తీరాన అందాల అదితి.. మెస్మరైజ్ చేస్తోన్న ‘చెప్పకే.. చెప్పకే’ మేకింగ్ వీడియో. మీరూ చూసేయండి..

Samantha: సమంతపై బాలీవుడ్ హీరో పొగడ్తలు.. ఆకాశానికి ఎత్తేస్తూ ప్రశంసలు.. కారణమెంటంటే..

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Telugu