AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Samantha: సమంతపై బాలీవుడ్ హీరో పొగడ్తలు.. ఆకాశానికి ఎత్తేస్తూ ప్రశంసలు.. కారణమెంటంటే..

ఏమాయ చేసావే అంటూ తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యింది సమంత. వరుస ఆఫర్లతో టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్‏గా

Samantha: సమంతపై బాలీవుడ్ హీరో పొగడ్తలు.. ఆకాశానికి ఎత్తేస్తూ ప్రశంసలు.. కారణమెంటంటే..
Samantha
Rajitha Chanti
|

Updated on: Sep 28, 2021 | 8:12 AM

Share

ఏమాయ చేసావే అంటూ తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యింది సమంత. వరుస ఆఫర్లతో టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్‏గా మారింది. పెళ్లి తర్వాత సమంత జోరు ఏమాత్రం తగ్గలేదు. తన అద్భుతమైన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇటు వెండితెరపైనే కాకుండా.. డిజిటల్ ప్లాట్‏ఫాంలోనూ సత్తా చాటుకుంది. అయితే గత కొద్ది రోజులుగా సమంత పేరు సోషల్ మీడియాలో తెగ వినిపిస్తుంది. నిత్యం తనకు సంబంధించిన పలు అంశాలతో వార్తల్లో నిలుస్తుంది. సమంత, నాగచైతన్య మధ్య గొడవలు జరుగుతున్నాయని.. త్వరలోనే విడిపోనున్నారని వార్తలు నెట్టింట్లో హల్ చల్ చేస్తున్నాయి. అయితే తనపై వస్తున్న రూమర్స్ గురించి సమంత ఇప్పటివరకు స్పంధించలేదు. అవేం పట్టనట్లుగా తన పని తాను చేసుకుంటూ పోతుంది. వరుస ప్రాజెక్ట్స్ పట్టాలెక్కిస్తూ.. హాలీడే ట్రిప్ ఎంజాయ్ చేస్తూ తెగ బిజీగా గడిపేస్తుంది.

ప్రస్తుతం ఈ అమ్మడు ..గుణశేఖర్ దర్శకత్వంలో శాకుంతలం సినిమా చేస్తుంది. ఇటీవల షూటింగ్ పూర్తిచేసుకున్న ఈమూవీ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. అలాగే తమిళంలో కూడా ఓ మూవీ చేస్తుంది. ఇక సమంత నటనకు దక్షిణాది ప్రేక్షకులు ఎంతగానో ఫిదా అయ్యారు. ముఖ్యంగా ఇటీవల విడుదలైన ఫ్యామిలీ మ్యాన్ 2 సిరీస్‏లో ఆమె నటనకు ప్రశంసలు అందుకుంది. ఈ సిరీస్‏తో సమంత పాన్ ఇండియా లెవల్లో క్రేజ్ సొంతం చేసుకుంది. తాజాగా బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ సమంతను ప్రశంసలతో ఆకాశానికి ఎత్తేశాడు. సమంత నటనకు షాహిద్ కపూర్ ఫిదా అయ్యాడట రాజ్ డీకే దర్శకత్వంలో తెరకెక్కిన క్రైం థ్రిల్లర్ వెబ్ సిరీస్ ది ఫ్యామిలీ మ్యాన్ 2లో సమంత నెగిటివ్ పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. అయితే ఫ్యామిలీ మ్యాన్ 2 సిరీస్ ఏదైనా చెప్పాలని అభిమాని అడిగిన ప్రశ్నకు ఆసక్తికర సమాధానమిచ్చాడు షాహిద్. ఫ్యామిలీ మ్యాన్ 2 సిరీస్ తనకు చాలా నచ్చిందని.. సమంత నటనకు తను ఫిదా అయ్యాడని చెప్పుకొచ్చాడు. అవకాశం వస్తే తనతో నటించాలని ఉందని తెలిపారు.

Also Read: Viral Photo: ఒకే ఫేమ్‌లో కృష్ణంరాజు, ప్రభాస్‌ల ‘ఉప్పలపాటి’వారి ఫ్యామిలీ.. సోషల్ మీడియాలో ఫోటో వైరల్..

Bigg Boss 5 – Lahari: బిగ్ బాస్ హౌస్‌లోని ఆ గుంట నక్క ఎవరు? బయటపెట్టేసిన లహరి.. టైటిల్ విన్నర్ ఆ ఇద్దర్లో ఒకరు..