AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Samantha: సమంతను ఏదైనా ప్రశ్నించాలనుకుంటున్నారా..? అయితే ఈ రోజు సాయంత్రం రెడీగా ఉండండి.

Samantha: సమంత.. ఇప్పుడు ఈ పేరు సెన్సేషన్‌గా మారింది. ఇటీవల తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లిన సమయంలో ఓ మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు 'బుద్ది ఉందా.?' అని బదులిచ్చిన నాటి నుంచి..

Samantha: సమంతను ఏదైనా ప్రశ్నించాలనుకుంటున్నారా..? అయితే ఈ రోజు సాయంత్రం రెడీగా ఉండండి.
Narender Vaitla
|

Updated on: Sep 28, 2021 | 8:06 AM

Share

Samantha: సమంత.. ఇప్పుడు ఈ పేరు సెన్సేషన్‌గా మారింది. ఇటీవల తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లిన సమయంలో ఓ మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు ‘బుద్ది ఉందా.?’ అని బదులిచ్చిన నాటి నుంచి సమంత టాక్‌ ఆఫ్‌ ది ఇండస్ట్రీగా మారింది. ప్రస్తుతం ఈ అందాల తార సోషల్‌ మీడియాలో ఏ చిన్న పోస్ట్‌ చేసినా అది సెన్సేషన్‌ అవుతోంది. తన వైవాహిక జీవితానికి సంబంధించి ఎలాంటి వార్తలు వస్తున్నా వాటన్నింటినీ పట్టించుకోని సమంత ప్రస్తుతం చెన్నైలో స్నేహితులతో ఎంజాయ్‌ చేస్తోంది.

View this post on Instagram

A post shared by S (@samantharuthprabhuoffl)

ఈ క్రమంలోనే తాజాగా సైక్లింగ్‌ చేస్తున్న సమయంలో తీసిన వీడియలోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే నిత్యం సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈ చిన్నది.. తరచూ ఫ్యాన్స్‌తో ముచ్చటిస్తూ ఉంటుంది. ఈ క్రమంలోనే ఫ్యాన్స్‌ అడిగే ప్రశ్నలకు సమాధానం ఇస్తుంటుంది. ఇకపోతే గతకొన్ని రోజులుగా సమంత ఈ చిట్‌చాట్స్‌కు కాస్త దూరంగా ఉంటూ వస్తోంది. అయితే తాజాగా మరోసారి ఫ్యాన్స్‌తో ముచ్చటించడానికి సిద్ధమైంది సామ్‌.

Samantha

ఇందులో భాగంగానే ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో ఓ పోస్ట్‌ చేసింది. ఇందులో భాగంగా ఈ రోజు (సెప్టెంబర్‌ 28) సాయంత్రం 5 గంటలకు సమంత ఆన్‌లైన్‌లోకి రానున్నట్లు తెలిపింది. ఇక ఉదయం 11 గంటలకు ‘వన్‌ విత్‌ సాకీ’ని సమంత ఎలా సెలబ్రేట్‌ చేసుకుంటుందో ఐజీ స్టోరీలో అడగండి అంటూ ఓ పోస్ట్‌ చేసింది. మరి సమంతను అభిమానులు ఎలాంటి ప్రశ్నలు అడగనున్నారు.? అందుకు సామ్‌ ఏ సమాధానాలు చెప్పనుందో తెలియాలంటే సాయంత్రం వరకు వేచి చూడాల్సిందే. ఇక సినిమాల విషయానికొస్తే సమంత ప్రస్తుతం శాకుంతలం సినిమా షూటింగ్‌ పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే. వీటితో పాటు తమిళంలో ఓ సినిమాలో నటిస్తోంది. విజ్ఞేశ్ శివన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో నయనతార కూడా నటిస్తుండడం విశేషం.

Also Read: Bigg Boss 5 Telugu: పశ్చాత్తాపంతో కుమిలిపోయిన రవి.. తలెత్తుకోవడానికి కూడా సిగ్గుగా ఉందంటూ ఎమోషనల్..

Viral Photo: ఒకే ఫేమ్‌లో కృష్ణంరాజు, ప్రభాస్‌ల ‘ఉప్పలపాటి’వారి ఫ్యామిలీ.. సోషల్ మీడియాలో ఫోటో వైరల్..

Sai Pallavi: మహేష్‌ బాబు ప్రశంసలపై స్పందించిన సాయి పల్లవి.. నాలో ఉన్న మీ అభిమాని అంటూ..

Follow Us
మనం చేసిన మంచి ఎప్పుడూ వృధా కాదు.. నీతి కథ
మనం చేసిన మంచి ఎప్పుడూ వృధా కాదు.. నీతి కథ
ప్రముఖ హోటళ్లకు ఇలాంటి రొయ్యలు సప్లై చేస్తారట
ప్రముఖ హోటళ్లకు ఇలాంటి రొయ్యలు సప్లై చేస్తారట
Video: 6, 4, 6, 6.. ఇంగ్లాండ్‌లో వైభవ్ రచ్చ మాములుగా లేదుగా..!
Video: 6, 4, 6, 6.. ఇంగ్లాండ్‌లో వైభవ్ రచ్చ మాములుగా లేదుగా..!
ఫ్యాటీ లివర్ సమస్యలు.. ఏం తినాలి? ఏం తినకూడదో తెలుసా?
ఫ్యాటీ లివర్ సమస్యలు.. ఏం తినాలి? ఏం తినకూడదో తెలుసా?
ఓటీటీలో భయపెడుతోన్న హారర్ థ్రిల్లర్.. ఇక్కడ ఫ్రీగా చూడొచ్చు
ఓటీటీలో భయపెడుతోన్న హారర్ థ్రిల్లర్.. ఇక్కడ ఫ్రీగా చూడొచ్చు
అక్రమవలసలు, జనాభా మార్పులపై కేంద్రం ఫోకస్.. అమిత్ షా కీలక ఆదేశాలు
అక్రమవలసలు, జనాభా మార్పులపై కేంద్రం ఫోకస్.. అమిత్ షా కీలక ఆదేశాలు
మారిన నల్గొండ రైల్వే స్టేషన్ రూపురేఖలు.. ఇదిగో కొత్త ఫోటోలు
మారిన నల్గొండ రైల్వే స్టేషన్ రూపురేఖలు.. ఇదిగో కొత్త ఫోటోలు
వెనుజులాలో భారత నావికుడు మృతి.. మృతదేహంలో మెదడు, గుండె మిస్సింగ్
వెనుజులాలో భారత నావికుడు మృతి.. మృతదేహంలో మెదడు, గుండె మిస్సింగ్
కమర్షియల్ ఎల్పీజీ ధరలపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక ప్రకటన
కమర్షియల్ ఎల్పీజీ ధరలపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక ప్రకటన
టీమిండియా మాజీ క్రికెటర్ కు భారీ ఉపశమనం.. 3 ఏళ్ల నిషేధం ఎత్తివేత
టీమిండియా మాజీ క్రికెటర్ కు భారీ ఉపశమనం.. 3 ఏళ్ల నిషేధం ఎత్తివేత