UOH Recruitment: యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్‌లో డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలు.. ఇలా దరఖాస్తు చేసుకోండి..
UOH Recruitment: హైదరాబాద్‌లోని యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ (UOH) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. కేంద్రీయ విశ్వవిద్యాలయమైన ఈ విద్యా సంస్థలో కాంట్రాక్ట్ విధానంలో ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఏ పోస్టుల్లో ఖాళీలు ఉన్నాయి.? ఎవరు అర్హులు.?
UOH Recruitment: హైదరాబాద్‌లోని యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ (UOH) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. కేంద్రీయ విశ్వవిద్యాలయమైన ఈ విద్యా సంస్థలో కాంట్రాక్ట్ విధానంలో ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఏ పోస్టుల్లో ఖాళీలు ఉన్నాయి.? ఎవరు అర్హులు.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..
భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..
* నోటిఫికేషన్‌లో భాగంగా డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులను భర్తీ చేయనున్నారు.
* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత పొంది ఉండాలి. కంప్యూటర్ నాలెడ్జ్ (ఎంఎస్ ఆఫీస్), టాలీ-అకౌంటింగ్ సాఫ్ట్‌వేర్ తెలిసి ఉండాలి.
ముఖ్యమైన విషయాలు..
* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
* దరఖాస్తులను ది ఫైనాన్స్ ఆఫీసర్, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్, గచ్చిబౌలి, హైదరాబాద్ – 500046 అడ్రస్‌కు పంపించాలి.
* అభ్యర్థులను తొలుత అకడమిక్ అర్హత ఆధారంగా షార్ట్‌లిస్ట్ చేస్తారు. అనంతరం ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక చేస్తారు.
* ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 20,000 చెల్లిస్తారు.
* దరఖాస్తుల స్వీకరణకు 23-03-2022ని చివరి తేదీగా నిర్ణయించారు.
* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Also Read: Women’s World Cup: దుమ్మురేపిన న్యూజిలాండ్ అమ్మాయిలు.. భారత జట్టుపై ఘన విజయం..
Bheemla Nayak: భీమ్లా నాయక్ సినిమాను అందుకే తొందరగా రిలీజ్ చేశారా ?.. క్లారిటీ ఇదేనా…
Punjab New CM: రాజ్‌భవన్‌లో ప్రమాణం చేయను.. ఆప్ ముఖ్యమంత్రి అభ్యర్థి మాన్ సంచలన ప్రకటన..