AP Jobs: ఏపీ నిరుద్యోగులకు అలర్ట్.. శుక్రవారం భారీ జాబ్ మేళా.. ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే..
AP Jobs: ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్ (APSSDC) వరుసగా జాబ్ మేళాలు నిర్వహిస్తూ ప్రైవేటు సంస్థల్లో ఉన్న ఖాళీల భర్తీకి జాబ్ మేళా నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా పలు ప్రైవేటు కంపెనీల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేయడానికి రేపు (శుక్రవారం)...
AP Jobs: ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్ (APSSDC) వరుసగా జాబ్ మేళాలు నిర్వహిస్తూ ప్రైవేటు సంస్థల్లో ఉన్న ఖాళీల భర్తీకి జాబ్ మేళా నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా పలు ప్రైవేటు కంపెనీల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేయడానికి రేపు (శుక్రవారం) భారీ జాబ్ మేళాను నిర్వహించనుంది. ఇందులో భాగంగా ముత్తూట్ ఫైనాన్స్, హెచ్‌డీఎఫ్‌సీ, పేటీఎం, జియో మార్ట్‌లో ఖాళీల భర్తీకి జాబ్‌మేళాను నిర్వహించనున్నారు. మొత్తం ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తుచేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..
భర్తీచేయనున్న ఖాళీలు, అర్హతలు..
* ముత్తూట్ ఫైనాన్స్ సంస్థలో 115 ఖాళీలను భర్తీ చేయనున్నారు. వీటికి డిగ్రీ, పీజీ, ఎంబీఏ, ఎం.కామ్ చేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు రూ.10 వేల నుంచి రూ.18 వేల వరకు వేతనం చెల్లిస్తారు.
* హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లో మొత్తం 20 ఖాళీలు ఉన్నాయి. డిగ్రీ చేసిన అభ్యర్థులు ఈ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన వారికి బ్రాంచ్ రిలేషన్ షిప్ ఎగ్జిక్యూటివ్ విభాగంలో ఈ ఖాళీలను భర్తీ చేస్తున్నారు. ఎంపికైన వారికి నెలకు రూ.14 వేల వేతనంతో పాటు ఇన్సెంటీవ్స్ ఉంటాయి. కేవలం పురుషులు మాత్రమే అర్హులు.
* పేటీఎమ్ సంస్థలో మొత్తం 50 ఖాళీలు ఉన్నాయి. డిగ్రీ చేసిన వారు అర్హులు. ఎంపికైన వారికి నెలకు రూ.15 వేల వేతనంతో పాటు ఇన్సెంటీవ్స్ ఉంటాయి. అభ్యర్థుల వయసు 18-35 ఏళ్లు ఉండాలి.
* రిలయన్స్ జియోమోర్ట్‌లో కస్టమర్స్ సేల్స్ ఆఫీసర్స్ విభాగంలో 40 ఖాళీలు ఉన్నాయి. ఇంటర్/డిగ్రీ చేసిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన వారికి నెలకు రూ.11 వేల నుంచి రూ.15 వేల వేతనం చెల్లించనున్నారు. అభ్యర్థుల వయసు 18-30 ఏళ్ల మధ్య ఉండాలి.
ముఖ్యమైన విషయాలు..
* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు మొదట ఈ లింక్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది.
* అభ్యర్థులు శుక్రవారం (మార్చి 11) నేరుగా ఇంటర్వ్యూకు హాజరుకావాలి. ఇంటర్వ్యూలను ఏఐఎమ్ సెంటర్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్, ఎలూరు రోడ్డు, గుడివాడ, కృష్ణ జిల్లాలో నిర్వహిస్తారు.
* ఇంటర్వ్యూలకు హాజరయ్యే అభ్యర్థులు రెజ్యూమేతో పాటు విద్యార్హతల జిరాక్స్ కాపీలు, ఆధార్, పాన్‌కార్డ్ వెంట తెచ్చుకోవాలి.
* పూర్తి వివరాల కోసం 9848819682, 7981938644 నంబర్లను సంప్రదించాలి.
Punjab Elections 2022: పంజాబ్‌లో దిగ్గజ నేతలకు షాక్.. అమృత్‌సర్‌లో సిద్ధూ ఘోర పరాజయం..
బోల్డ్ సీన్స్ కారణంగా ఓటీటీ ఆఫర్లు తిరస్కరించిన హీరోయిన్లు వీరే.!