Punjab Elections 2022: పంజాబ్‌లో దిగ్గజ నేతలకు షాక్.. అమృత్‌సర్‌లో సిద్ధూ ఘోర పరాజయం..

Navjot Singh Sidhu: పంజాబ్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ భారీ ఆధిక్యతతో దూసుకెళ్తోంది. 117 స్థానాలున్న పంజాబ్‌లో ఆప్ 90 స్థానాలకు పైగా ఆధిక్యంలో కొనసాగుతోంది. ఆప్ ప్రభంజనం ముందు.. కాంగ్రెస్, బీజేపీ, ఎస్ఏడీ చతికలపడ్డాయి.

Punjab Elections 2022: పంజాబ్‌లో దిగ్గజ నేతలకు షాక్.. అమృత్‌సర్‌లో సిద్ధూ ఘోర పరాజయం..
Punjab
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Mar 10, 2022 | 4:45 PM

Navjot Singh Sidhu: పంజాబ్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ భారీ ఆధిక్యతతో దూసుకెళ్తోంది. 117 స్థానాలున్న పంజాబ్‌లో ఆప్ 90 స్థానాలకు పైగా ఆధిక్యంలో కొనసాగుతోంది. ఆప్ ప్రభంజనం ముందు.. కాంగ్రెస్, బీజేపీ, ఎస్ఏడీ చతికలపడ్డాయి. ఇప్పటివరకు 66 చోట్ల విజయం సాధించగా.. 28 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. అంచనాలకు మించి ఆప్ భారీ విజయం సాధించింది. ఆప్ జోరుకు కీలక నేతలు కూడా ఓటమి పాలయ్యారు. ముఖ్యమంత్రి చరణ్‌జీత్ సింగ్‌ చన్నీ సహా కాంగ్రెస్ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ కూడా ఓటమి పాలయ్యారు. వారితో పాటు మాజీ సీఎంలు కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌, ప్రకాశ్‌ సింగ్‌ బాదల్‌ వంటి దిగ్గజ నేతలు కూడా ఓటమిని చవిచూశారు. సీఎం చరణ్‌జీత్‌ సింగ్‌ చన్నీ ఈ ఎన్నికల్లో చామ్‌కౌర్ సాహిబ్‌, భదౌర్‌ నుంచి పోటీ చేసి రెండు చోట్లా ఓటమి పాలయ్యారు. ఈ స్థానాల్లో ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన లబ్ సింగ్ ఉగోకే, చరణ్‌జీత్ సింగ్ గెలుపొందారు.

పంజాబ్ కాంగ్రెస్‌ చీఫ్‌ నవజ్యోత్‌ సింగ్‌ సిద్ధూ అమృత్‌సర్‌ తూర్పు నుంచి పోటీ చేసి పరాజయం పాలయ్యారు. సిద్ధూపై ఆప్ అభ్యర్థి జీవన్‌ జ్యోత్‌ కౌర్‌ దాదాపు 7వేల ఓట్ల తేడాతో గెలిచారు.

పంజాబ్‌ మాజీ ముఖ్యమంత్రి, పంజాబ్‌ లోక్‌ కాంగ్రెస్‌ వ్యవస్థాపకుడు కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌ తన కంచుకోట అయిన పాటియాలాలో ఓడిపోయారు. ఆమ్‌ ఆద్మీ పార్టీ అభ్యర్థి అజిత్‌ పాల్‌ సింగ్ కోహ్లీ చేతిలో 20వేల తేడాతో ఓటమిపాలయ్యారు.

శిరోమణి అకాలీదళ్‌ అధ్యక్షుడు సుఖ్‌బీర్‌ సింగ్‌ బాదల్‌ జలాలాబాద్‌ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. శిరోమణి అకాలీదళ్ మాజీ అధ్యక్షుడు, మాజీ సీఎం ప్రకాశ్‌ సింగ్‌ బాదల్‌ లంబీ నుంచి ఓటమిపాలయ్యారు. 94 ఏళ్ల బాదల్.. ఈ నియోజకవర్గానికి 1997 నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ స్థానంలో ఆప్‌ అభ్యర్థి జగపాల్‌ సింగ్‌ బాదల్‌ విజయం సాధించారు.

కాంగ్రెస్.. తరఫున పోటీ చేసిన బాలీవుడ్‌ నటుడు సోనూసూద్‌ చెల్లెలు మాళవిక సూద్‌.. మోగ నియోజకవర్గంలో ఓటమిపాలయ్యారు. ఈ స్థానంలో ఆప్ అభ్యర్థి గెలుపొందారు.

Also Read:

Punjab New CM: రాజ్‌భవన్‌లో ప్రమాణం చేయను.. ఆప్ ముఖ్యమంత్రి అభ్యర్థి మాన్ సంచలన ప్రకటన..

Charanjit Singh Channi: పంజాబ్ ముఖ్యమంత్రి చన్నీ ఘోర పరాజయం.. రెండో స్థానాల్లోనూ ఓటమి..