Market Cap: యుద్ధ భయాన్ని అధిగమించి.. బ్రిటన్ మార్కెట్లను దాటి చరిత్ర సృష్టించిన భారత్ మార్కెట్ క్యాప్!
రష్యా, ఉక్రెయిన్‌ల మధ్య జరుగుతున్న యుద్ధంతో భారత మార్కెట్‌కు ప్రత్యక్ష ప్రయోజనం కలుగుతోంది. కొత్త రికార్డులను బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ సృష్టిస్తోంది.
రష్యా, ఉక్రెయిన్‌ల మధ్య జరుగుతున్న యుద్ధంతో భారత మార్కెట్‌కు ప్రత్యక్ష ప్రయోజనం కలుగుతోంది. కొత్త రికార్డులను బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్(BSE) సృష్టిస్తోంది. తాజాగా గురువారం బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ మార్కెట్ క్యాప్(Market Cap) గురువారం రూ.251.88 లక్షల కోట్లకు చేరుకుంది. దీంతో బ్రిటన్ మార్కెట్ క్యాప్ కంటే ఎక్కువ మార్కెట్ క్యాప్ సాధించి చరిత్ర సృష్టించింది. కాగా యూకే కంపెనీల విలువ రూ.249 లక్షల కోట్లుగా ఉండటం గమనార్హం. ఈ నేపథ్యంలో భారత్ మార్కెట్ మార్కెట్ క్యాప్ ఆరో స్థానంలో ఉంది. యూకే స్టాక్ మార్కెట్‌ను భారత మార్కెట్ అధిగమించడం చరిత్రలో ఇదే తొలిసారి. గత నెలలో ఉక్రెయిన్ – రష్యా మధ్య పోరాటం ప్రారంభమైనప్పటి నుంచి, భారతీయ మార్కెట్ మార్కెట్ క్యాప్ సుమారు 357.05 బిలియన్ల డాలర్లకు పడిపోయింది. అయితే బ్రిటిష్ మార్కెట్ ఫిబ్రవరి 1 నుంచి 410 బిలియన్ డాలర్ల క్షీణతను చూసింది. ప్రస్తుతం, US స్టాక్ మార్కెట్ 46.01 ట్రిలియన్ డాలర్ల మార్కెట్ క్యాప్‌తో ప్రపంచంలో మొదటి స్థానంలో ఉంది. 11.31 ట్రిలియన్ డాలర్ల మార్కెట్ క్యాప్‌తో చైనా మార్కెట్ రెండవ స్థానంలో ఉంది. ఈ విషయంలో జపాన్ మూడో స్థానంలో ఉంది. ఈ మార్కెట్‌లో జాబితా చేసిన కంపెనీల విలువ 5.78 ట్రిలియన్ డాలర్లు. 5.50 ట్రిలియన్ డాలర్ల మార్కెట్ క్యాప్‌తో హాంకాంగ్ నాలుగో స్థానంలో ఉండగా, సౌదీ అరేబియా 3.25 ట్రిలియన్ డాలర్ల మార్కెట్ క్యాప్‌తో ఐదో స్థానంలో ఉంది.
సౌదీ అరేబియా ప్రపంచంలో రెండవ అతిపెద్ద ముడి చమురు ఎగుమతి దేశం. క్రూడాయిల్ ధరల్లో ప్రస్తుత భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల మధ్య సౌదీ అరేబియా భారీ లాభాలను ఆర్జించింది. దీంతో ఇక్కడి కంపెనీల మార్కెట్ క్యాప్ కూడా భారీగా పెరిగింది. గత నెలలో సౌదీ అరేబియా మార్కెట్ క్యాప్ దాదాపు 442 బిలియన్ డాలర్లు పెరిగింది.
మూడు రోజుల్లో మార్కెట్ పెరిగింది
కాగా, గత మూడు రోజులుగా ప్రపంచ వ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు జోరు చూపిస్తున్నాయి. బీఎస్ఈ సెన్సెక్స్ మంగళవారం 581 పాయింట్లు, బుధవారం 1,223, గురువారం 817 పాయింట్ల లాభంతో ముగిసింది. అదేవిధంగా, ప్రపంచంలోని ఇతర మార్కెట్లలో రికవరీ కనిపిస్తుంది. ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ నుంచి రష్యాతో ఒప్పందం కుదుర్చుకునే సంకేతాలు కనిపించడమే దీనికి కారణం. దీంతో పాటు ముడిచమురు ధరల తగ్గుదల నుంచి మార్కెట్‌కు ఉపశమనం లభించింది. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ పనితీరు ..క్రూడ్ మెత్తబడటం గురువారం ఉదయం మార్కెట్‌లో విపరీతమైన పెరుగుదలను చూపించింది. ఈ వారంలో ఇప్పటివరకు నిఫ్టీ, సెన్సెక్స్ దాదాపు 4% లాభపడ్డాయి.
ఇవి కూడా చదవండి: Multibagger Penny Stocks: రూ. లక్షను.. రూ. 2 కోట్లు చేసిన స్టాక్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట..
Insurance: ఏజెంట్ల ఒత్తిడితో ఇన్సూరెన్స్ పాలసీలు తీసుకుంటున్నారా..? అయితే ఈ వీడియో చూడండి..