UOH: యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్‌లో టీచింగ్ పోస్టులు.. నెలకు రూ. 2 లక్షలకుపైగా జీతం పొందే అవకాశం.

యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్‌ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. నోటిఫికేషన్‌లో భాగంగా పలు విభాగాల్లో ఉన్న టీచింగ్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.?

UOH: యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్‌లో టీచింగ్ పోస్టులు.. నెలకు రూ. 2 లక్షలకుపైగా జీతం పొందే అవకాశం.
University Of Hyderabad
Follow us
Narender Vaitla

|

Updated on: Apr 09, 2023 | 5:15 PM

యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్‌ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. నోటిఫికేషన్‌లో భాగంగా పలు విభాగాల్లో ఉన్న టీచింగ్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 30 పోస్టులను భర్తీ చేయనున్నారు.

* వీటిలో ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు ఉన్నాయి. హ్యుమానిటీస్, ఎకనామిక్స్, సోషల్ సైన్స్, పెర్ఫార్మింగ్ ఆర్ట్స్, మేనేజ్‌మెంట్ స్టడీస్ విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టుల‌ ఆధారంగా సంబంధిత విభాగంలో పీజీ, ఎంఫిల్‌, పీహెచ్‌డీ, స్లెట్‌, నెట్‌, సెట్‌ ఉత్తీర్ణతతోపాటు టీచింగ్, రిసెర్చ్ అనుభవం ఉండాలి.

* అభ్యర్థుల వయసు 60 ఏళ్లు మించకూడదు.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అనంతరం హార్డ్‌ కాపీలను ఆఫ్‌లైన్‌ విధానంలో సబ్‌మిట్ చేయాలి.

* అభ్యర్థులను ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

* ఎంపికైన వారికి నెలకు రూ. 57,700 నుంచి రూ. 2,18,200 వరకు చెల్లిస్తారు.

* ఆన్‌లైన్‌ దరఖాస్తులకు ఏప్రిల్‌ 21వ తేదీ, హార్డ్‌కాపీల స్వీకరణకు ఏప్రిల్ 28వ తేదీగా నిర్ణయించారు.

* పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి..