TS Inter: తెలంగాణ ఇంటర్ విద్యార్థులకు అలర్ట్.. పరీక్షా ఫలితాలపై అప్డేట్. రిజల్ట్స్ ఎప్పుడంటే..
తెలంగాణలో ఇంటర్ పరీక్షలు పూర్తయ్యాయి. ప్రస్తుతం విద్యార్థులకు ఎమ్‌సెట్, జేఈఈ వంటి పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నారు. ఈ తరుణంలో ఇంటర్ పరీక్షా ఫలితాలు ఎప్పుడన్న దానిపై విద్యార్థులతో పాటు పేరెంట్స్‌లోనూ ఆసక్తినెలకొని ఉంది. మార్చి 29న ఇంటర్ పరీక్షలు పూర్తికాగా...
తెలంగాణలో ఇంటర్ పరీక్షలు పూర్తయ్యాయి. ప్రస్తుతం విద్యార్థులకు ఎమ్‌సెట్, జేఈఈ వంటి పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నారు. ఈ తరుణంలో ఇంటర్ పరీక్షా ఫలితాలు ఎప్పుడన్న దానిపై విద్యార్థులతో పాటు పేరెంట్స్‌లోనూ ఆసక్తినెలకొని ఉంది. మార్చి 29న ఇంటర్ పరీక్షలు పూర్తికాగా. ఒకేషనల్, బ్రిడ్జి కోర్సులకు సంబంధించి పరీక్షలు ఏప్రిల్ 4వ తేదీన ముగిశాయి. ఇక ఇంటర్ ఫస్ట్, సెకండియర్ కు సంబంధించి మొత్తం 9.47 లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరయ్యారు.
పరీక్షలు పూర్తయిన తర్వాత మార్చి 24న తేదీ నుంచి వాల్యుయేషన్ ప్రక్రియ సైతం ప్రారంభమైంది. ప్రస్తుతం వాల్యుయేషన్ ప్రక్రియ శరవేగంగా సాగుతోంది. ఫలితాలను వీలైంతనం త్వరగా విడుదల చేయాలనే ఉద్దేశంతో అధికారులు ఉన్నారు. ఇందులో భాగంగానే పటిష్ట నిబంధనలు పాటిస్తూనే వాల్యుయేషన్ ప్రక్రియను వేగవంతం చేశారు. ఈ నెల 25తో పూర్తి స్థాయి స్పాట్ ముగియనున్నది. ఓఎంఆర్ స్కానింగ్, రిజల్ట్ ప్రాసెస్‌కు వారం నుంచి పది రోజులు పట్టే అవకాశముందని అధికారులు చెబుతున్నారు.
ఈ లెక్కన ఇంటర్ ఫలితాలను మే రెండో వారంలో ఫలితాలు విడుదలయ్యే అవకాశం ఉందని ఇంటర్ బోర్డు వర్గాల నుంచి సమాచారం అందుతోంది. ఇప్పటికే తెలుగు, హిందీతో పాటు మరికొన్ని చిన్న సబ్జెక్టుల వాల్యూవేషన్ పూర్తయినట్లు సమాచారం. బోటనీ, హిస్టరీ, జువాలజీ తదితర సబ్జెక్టులకు సంబంధించి వాల్యూవేషన్ పూర్తి కావాల్సి ఉందని తెలుస్తోంది.
మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..