4 Year UG Degree Courses: నాలుగేళ్ల డిగ్రీకి రేపు మార్గదర్శకాలు జరీ చేయనున్న యూజీసీ

యూనివర్సిటీ గ్రాండ్స్‌ కమిషన్‌ 2023-24 విద్యాసంవత్సరం నుంచి నాలుగేళ్ల డిగ్రీ (ఆనర్స్ విత్ రీసెర్చ్ డిగ్రీ)ని ప్రవేశపెట్టేందుకు రంగం సిద్ధం చేసింది..

4 Year UG Degree Courses: నాలుగేళ్ల డిగ్రీకి రేపు మార్గదర్శకాలు జరీ చేయనున్న యూజీసీ
UGC regulations for four-year UG courses
Follow us
Srilakshmi C

|

Updated on: Dec 11, 2022 | 6:11 PM

యూనివర్సిటీ గ్రాండ్స్‌ కమిషన్‌ 2023-24 విద్యాసంవత్సరం నుంచి నాలుగేళ్ల డిగ్రీ (ఆనర్స్ విత్ రీసెర్చ్ డిగ్రీ)ని ప్రవేశపెట్టేందుకు రంగం సిద్ధం చేసింది. దీనికి సంబంధించి విధివిధానాలను సోమవారం (డిసెంబర్‌ 12)న విడుదల చేయనున్నట్లు సమాచారం. కొత్త నిబంధనల ప్రకారం.. ఏదైనా సబ్జెక్టులో ఆనర్స్‌తో గ్రాడ్యుయేట్ చేయాలనుకునే విద్యార్థులు నాలుగేళ్ల అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్‌ (FYUP)లో అడ్మిషన్‌ పొందవల్సి ఉంటుంది. దీనిని దేశంలోని సెంట్రల్‌ యూనివర్సిటీలన్నింటిలో అమలు చేసే అవకాశం ఉంది.

దీని గురించి యూజీసీ ఛైర్మన్‌ జగదీష్‌ కుమార్‌ మాట్లాడుతూ.. నాలుగేళ్ల డిగ్రీ చదివే విద్యార్థులపై ఈ కొత్త విధానం ఎటువంటి ప్రభావం చూపదు. నాలుగేళ్ల డిగ్రీ పూర్తి చేస్తే ఆనర్స్ డిగ్రీ పట్టా ఇస్తారు. ఆరు సెమిస్టర్లు లేదా మూడేళ్ల తర్వాత కూడా ఈ కోర్సు తీసుకున్నవారు స్వేచ్ఛగా నిష్క్రమించవచ్చు. వీరు మూడేళ్లలో 75 శాతం, ఆపై మార్కులు పొంది ఉండాలి. పరిశోధన చేయాలనుకుంటే రీసెర్చ్ ప్రాజెక్టు పూర్తిచేయాలి. రెండేళ్ల తర్వాత అయితే యూజీ డిప్లొమా సర్టిఫికెట్‌ ఇస్తారు. ప్రస్తుతం మూడేళ్ల డిగ్రీ చదువుతున్న వారు కూడా నాలుగేళ్ల డిగ్రీకి అర్హత కలిగి ఉంటారు. ఇటువంటి వారికి ఆయా యూనివర్సిటీలు బ్రిడ్జి కోర్సును ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్‌లో అందిస్తాయి.

మూడేళ్ల డిగ్రీకి 120 క్రెడిట్లు, నాలుగేళ్ల డిగ్రీకి 160 క్రెడిట్లు ఉంటాయి. ఒక్కో సెమిస్టర్‌కు 20 క్రెడిట్లు కేటాయిస్తారు. విద్యార్థులు ఎంచుకునే సబ్జెక్టుల్లో మేజర్, మైనర్, లాంగ్వేజ్, స్కిల్ కోర్సులు కూడా ఉంటాయి. రెండో సెమిస్టర్‌ తర్వాత మేజర్ సబ్జెక్టులను కొనసాగించాలా? వద్దా అన్నది విద్యార్థుల అభీష్టంపై ఆధారపడి ఉంటుంది. ఈ విధానంలో విద్యార్థులు తమకు ఇష్టమైన రకరకాల సబ్జెక్టులను ఎంచుకొని చదువుకునే వెసులుబాటు ఉంటుందని ఆయన ఆన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.