Delivery Boy Jobs in UAE: తెలంగాణ నిరుద్యోగులకు భలే ఛాన్స్.. డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే యూఏఈలో జాబ్ పక్కా! ఇలా దరఖాస్తు చేసుకోండి
తెలంగాణకు చెందిన సెమీస్కిల్డ్ కార్మికులు, బైక్ రైడర్లు ఆయా దేశాల్లో ఉద్యోగాలు కల్పించేందుకు TOMCOM వారదిగా వ్యవహరిస్తుంది. కాగా తాజాగా యూఏఈ విడుదల చేసిన ప్రకటనలో ఆ దేశంలో బైక్ రైడర్‌లకు (డెలివరీ బాయ్స్) అధిక డిమాండ్ అధికంగా ఉన్నట్లు తెలిపింది. ఆసక్తి కలిగిన వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలని టామ్‌కామ్ తెలిపింది..
హైదరాబాద్, అక్టోబర్ 1: యూఏఈలో అత్యధిక డిమాండ్ ఉన్న డెలివరీ బాయ్స్ (బైక్‌రైడర్లు) ఉద్యోగాలకు ఆసక్తి కలిగిన నిరుద్యోగుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్‌పవర్ కంపెనీ లిమిటెడ్ (టామ్‌కామ్) ద్వారా రాష్ట్రంలోని నిరుద్యోగ యువత ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. టామ్‌కామ్ అనేది తెలంగాణ ప్రభుత్వంలోని కార్మిక, ఉపాధి శిక్షణ, కర్మాగారాల శాఖ క్రింద పనిచేసే రిజిస్టర్డ్ రిక్రూట్‌మెంట్ ఏజెన్సీ ఇది. ఇది రాష్ట్రంలోని అర్హత, నైపుణ్యం కలిగిన యువతకు విదేశీ ప్లేస్‌మెంట్‌లను అందించడంలో ఆదేశంతో కలిసి పనిచేస్తుంది. TOMCOM గల్ఫ్ దేశాలతో పాటు ఆస్ట్రేలియా, కెనడా, జర్మనీ, హంగేరి, జపాన్, పోలాండ్, రొమేనియా, UAE, సౌదీ, UK వంటి వివిధ దేశాలలోని పలు ప్రభుత్వ, ప్రైవేట్ ఏజెన్సీలతో భాగస్వామ్యాన్ని కుదుర్చుకుంది.
తద్వారా తెలంగాణకు చెందిన సెమీస్కిల్డ్ కార్మికులు, బైక్ రైడర్లు ఆయా దేశాల్లో ఉద్యోగాలు కల్పించేందుకు TOMCOM వారదిగా వ్యవహరిస్తుంది. కాగా తాజాగా యూఏఈ విడుదల చేసిన ప్రకటనలో ఆ దేశంలో బైక్ రైడర్‌లకు (డెలివరీ బాయ్స్) అధిక డిమాండ్ అధికంగా ఉన్నట్లు తెలిపింది. ఆసక్తి కలిగిన వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలని టామ్‌కామ్ తెలిపింది. జాబ్ రోల్ కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు కనీసం 3 సంవత్సరాల పాటు ఇండియన్ చెల్లుబాటు అయ్యే టూ-వీలర్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి. అలాగే వయసు 21 – 40 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలని టామ్‌కామ్ సీఈవో తెలిపారు. ఆకర్షణీయమైన ప్యాకేజీతో సురక్షితమైన, చట్టబద్ధమైన వలస మార్గాల ద్వారా ఈ రిక్రూట్‌మెంట్ ప్రక్రియ జరుగుతుంది.
అసక్తి కలిగిన వారు తమ రెజ్యూమెను tomcom.resume@gmail.comకు పంపించాలని TOMCOM సూచించింది. మరిన్ని వివరాలకు www.tomcom.telangana.gov.inను సందర్శించవచ్చు. లేదంటే 9440051285, 9440048500, 9701040062, 9440051452 నంబర్లను ఫోన్ ద్వారా సంప్రదించవచ్చని సూచించారు.