AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TGSRTC Jobs: ఆర్టీసీలో త్వరలో 3 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తాం.. మంత్రి పొన్నం ప్రభాకర్‌

తెలంగాణ రాష్ట్రంలోని ఆర్టీసీలో త్వరలో 3 వేల ఉద్యోగాలకు ప్రకటన వెలువరించనున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్‌ అన్నారు. తాజాగా కరీంనగర్‌లో 33 విద్యుత్‌ బస్సులను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ఈ మేరకు వెల్లడించారు..

TGSRTC Jobs: ఆర్టీసీలో త్వరలో 3 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తాం.. మంత్రి పొన్నం ప్రభాకర్‌
TGSRTC
Srilakshmi C
|

Updated on: Oct 01, 2024 | 4:03 PM

Share

హైదరాబాద్‌, అక్టోబర్‌ 1: తెలంగాణ రాష్ట్రంలోని ఆర్టీసీలో త్వరలో 3 వేల ఉద్యోగాలకు ప్రకటన వెలువరించనున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్‌ అన్నారు. తాజాగా కరీంనగర్‌లో 33 విద్యుత్‌ బస్సులను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ఈ మేరకు వెల్లడించారు. ఆయన ఇంకా ఈ విధంగా మాట్లాడారు. ఇప్పటివరకు ఎంతో మంది మహిళలు మహాలక్షి పథకం కింద ఉచిత ప్రయాణం చేశారని తెలిపారు. మహిళా శక్తి, మెప్మా ద్వారా మరిన్ఇన ఆర్టీసీ బస్సులు కొనుగోలు చేస్తామన్నారు.

అలాగే ఆర్టీసీ ఉద్యోగులకు పీఆర్సీ, కారుణ్య నియామకాలపై దృష్టి పెడతామని చెప్పారు. విద్యుత్‌ బస్సుల కొనుగోలుకు జేబీఎం సంస్థతో ఆర్టీసీ ఒప్పందం కుదుర్చుకున్నట్లు వెల్లడించారు. హైదరాబాద్ సహా ఇతర జిల్లాల్లోనూ విద్యుత్‌ బస్సు సర్వీసులను నడపాలన్నదే తమ ప్రభుత్వం ప్రధాన ఉద్దేశ్యం అని అన్నారు. కాలుష్యాన్ని తగ్గించేందుకు హైదరాబాద్ రింగ్ రోడ్డు లోపల డీజిల్‌తో నడిచే బస్సు ఒక్కటి కూడా ఉండకుండా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రజాపాలన ఏర్పడిన తర్వాత విప్లవాత్మక మార్పులు చేస్తూ ఆర్టీసీని దినదినాభివృద్ధి చేస్తున్నామని పొన్నం ప్రభాకర్‌ తెలిపారు.

ఆంధ్రప్రదేశ్‌ కేజీబీవీ పోస్టులకు దరఖాస్తు గడువు పెంపు.. ఎప్పటి వరకంటే

ఆంధ్రప్రదేశ్ సమగ్ర శిక్షా సొసైటీ ఆధ్వర్యంలోని కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయా(KGBV)ల్లో 2024-25 విద్యా సంవత్సరానికి 604 టీచర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఆయా జిల్లాల్లో కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో ఖాళీగా ఉన్న బోధనా సిబ్బంది పోస్టులను ఒప్పంద ప్రాతిపదికన, బోధనేతర పోస్టులను పొరుగుసేవల ద్వారా భర్తీ చేయడానికి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు ఎస్పీడీ శ్రీనివాసరావు తెలిపారు. ఆన్‌లైన్‌ దరఖాస్తులకు అక్టోబరు 10 చివరి గడువు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను వెబ్‌సైట్‌లో అందుబాటులో చెక్‌ చేసుకోవచ్చు. ఇంగ్లిష్, సివిక్స్, కామర్స్, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ, ఒకేషనల్ సబ్జెక్టులో టీజీటీ ఖాళీలు, తెలుగు, హిందీ, ఇంగ్లిష్, మ్యాథ్స్, ఫిజికల్ సైన్స్, బయోలాజికల్ సైన్స్, సోషల్ స్టడీస్ సబ్జెక్టుల్లో సీఆర్టీ ఖాళీలు ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us
భానుడి భగభగలు..! ఎండల్లో ఎలాంటి డ్రింక్స్ తాగాలి? వేటికి దూరంగా..
భానుడి భగభగలు..! ఎండల్లో ఎలాంటి డ్రింక్స్ తాగాలి? వేటికి దూరంగా..
సోషల్ మీడియా స్టార్ కుర్చీతాత హఠాన్మరణం.. ఏం జరిగిందంటే?
సోషల్ మీడియా స్టార్ కుర్చీతాత హఠాన్మరణం.. ఏం జరిగిందంటే?
2026లో కెరీర్ గ్రోత్ కోసం హైదరాబాద్ టాప్ 10 కంపెనీలు ఇవే..
2026లో కెరీర్ గ్రోత్ కోసం హైదరాబాద్ టాప్ 10 కంపెనీలు ఇవే..
పిడుగురాళ్లలో 47.6, నిర్మల్‌లో 46.5 డిగ్రీలు.. సూరీడుతో జాగ్రత్త
పిడుగురాళ్లలో 47.6, నిర్మల్‌లో 46.5 డిగ్రీలు.. సూరీడుతో జాగ్రత్త
ఊరు పెరిగింది.. జనాభా పెరిగింది.. ట్రాఫికర్ మాత్రం షేమ్‌టుసేమ్
ఊరు పెరిగింది.. జనాభా పెరిగింది.. ట్రాఫికర్ మాత్రం షేమ్‌టుసేమ్
ఒకే FDలో మొత్తం డబ్బు పెట్టేస్తున్నారా? తప్పు చేస్తున్నట్లే!
ఒకే FDలో మొత్తం డబ్బు పెట్టేస్తున్నారా? తప్పు చేస్తున్నట్లే!
పెరుగు బాగా పులిసిపోయిందా? పారేయకండి.. ఈ 4 వంటకాలతో పాటు మీ ఇళ్లు
పెరుగు బాగా పులిసిపోయిందా? పారేయకండి.. ఈ 4 వంటకాలతో పాటు మీ ఇళ్లు
సమ్మర్‌ స్పెషల్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌..ఈ గులాబీ రంగు ఇడ్లీలు ట్రై
సమ్మర్‌ స్పెషల్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌..ఈ గులాబీ రంగు ఇడ్లీలు ట్రై
రోజుకు 2 అరటిపండ్లు తింటే ఏం జరుగుతుంది..? పెద్ద కథే ఇది..
రోజుకు 2 అరటిపండ్లు తింటే ఏం జరుగుతుంది..? పెద్ద కథే ఇది..
గరుడ పురాణం ఇంట్లో ఉంచుకోవచ్చా? నిజం ఏంటి తెలుసుకోండి!
గరుడ పురాణం ఇంట్లో ఉంచుకోవచ్చా? నిజం ఏంటి తెలుసుకోండి!