TG DSC Certificate Verification: డీఎస్సీ అభ్యర్ధులకు అలర్ట్.. నేటి నుంచి ధ్రువపత్రాల పరిశీలన! మొబైల్‌ ఫోన్లకు SMS ద్వారా సమాచారం

తెలంగాణ డీఎస్సీ జనరల్‌ ర్యాంకింగ్‌ లిస్ట్‌ (జీఆర్‌ఎల్‌) మంగళవారం (సెప్టెంబర్‌ 30) ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి చేతుల మీదగా విడుదల చేసిన సంగతి తెలిసిందే. కేవలం 55 రోజుల్లోనే డీఎస్సీ ఫలితాలు విడుదల చేసిన సర్కార్‌ మరో 9 రోజుల్లో నియామక పత్రాలు కూడా అందజేసేందుకు సిద్ధం అవుతుంది. ఆయా జిల్లాల్లో 1:3 నిష్పత్తిలో ఎంపికైన వారికి ఈ రోజు నుంచి (అక్టోబర్‌ 1) ధ్రువపత్రాల పరిశీలన ప్రారంభమైంది..

TG DSC Certificate Verification: డీఎస్సీ అభ్యర్ధులకు అలర్ట్.. నేటి నుంచి ధ్రువపత్రాల పరిశీలన! మొబైల్‌ ఫోన్లకు SMS ద్వారా సమాచారం
DSC Certificate Verification
Follow us

|

Updated on: Oct 01, 2024 | 3:51 PM

హైదరాబాద్‌, అక్టోబర్‌ 1: తెలంగాణ డీఎస్సీ జనరల్‌ ర్యాంకింగ్‌ లిస్ట్‌ (జీఆర్‌ఎల్‌) మంగళవారం (సెప్టెంబర్‌ 30) ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి చేతుల మీదగా విడుదల చేసిన సంగతి తెలిసిందే. కేవలం 55 రోజుల్లోనే డీఎస్సీ ఫలితాలు విడుదల చేసిన సర్కార్‌ మరో 9 రోజుల్లో నియామక పత్రాలు కూడా అందజేసేందుకు సిద్ధం అవుతుంది. ఆయా జిల్లాల్లో 1:3 నిష్పత్తిలో ఎంపికైన వారికి ఈ రోజు నుంచి (అక్టోబర్‌ 1) ధ్రువపత్రాల పరిశీలన ప్రారంభమైంది. అక్టోబర్‌ 5వ తేదీ వరకు వెరిఫికేషన్‌ నిర్వహిస్తామని పాఠశాల విద్యాశాఖ సంచాలకుడు ఈవీ నరసింహారెడ్డి తెలిపారు. ఆ తేదీల్లో ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆయా కేంద్రాల్లో ధ్రువపత్రాల పరిశీలన ప్రక్రియ జరుగుతుందని తెలిపారు. జిల్లాలు.. రోస్టర్‌ పాయింట్ల ఆధారంగా 1:3 నిష్పత్తిలో అర్హులైన అభ్యర్థుల మొబైల్‌ ఫోన్లకు ఎస్‌ఎంఎస్ ద్వారా, అలాగే ఈ-మెయిల్‌ ద్వారా సమాచారం అందించినట్లు తెలిపారు. ఇప్పటికే ఈ జాబితాలు అధికారిక వెబ్‌సైట్‌తోపాటు, డీఈఓ వెబ్‌సైట్లలోనూ అందుబాటులోకి తీసుకొచ్చారు. అభ్యర్థులు డీఈఓలు గుర్తించిన కేంద్రాల్లో ఒరిజినల్ సర్టిఫికెట్లతో పాటు రెండు సెట్ల ఫొటో కాపీలతో హాజరుకావల్సి ఉంటుంది.

ధ్రువపత్రాల పరిశీలనకు హాజరయ్యేవారు విద్యార్హత సర్టిఫికెట్లతోపాటు, టెట్, డీఎస్సీ, కుల, 1 నుంచి 7 తరగతుల స్టడీ సర్టిఫికెట్‌లను ఒరిజినల్‌ పత్రాలతో పాటు రెండు సెట్ల జిరాక్స్‌ పత్రాలను వెంట తీసుకురావాలని సూచించారు. అలాగే పాఠశాల విద్యాశాఖ వెబ్‌సైట్లో ఉంచిన ఫారాన్ని డౌన్‌లోడ్‌ చేసుకుని, దాన్ని పూర్తిచేసి తమతోపాటు తీసుకురావాలని సూచించారు.

సాధారణంగా టీజీపీఎస్సీలో జీఆర్‌ఎల్‌ వెలువడిన 15 లేదా 30 రోజుల తర్వాత 1:3 నిష్పత్తిలో అభ్యర్థులను ప్రకటిస్తారు. అయితే తెలంగాణ విద్యాశాఖ మాత్రం డీఎస్సీ జీఆర్‌ఎల్‌ విడుదల చేసిన మరుసటి రోజు నుంచే ధ్రువపత్రాల పరిశీలన ప్రారంభించింది. పైగా మీసేవ నుంచి తీసుకోవల్సిన కుల తదితర సర్టిఫికెట్ల కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవల్సి ఉంటుంది. 2000 సంవత్సరంలోపు 1 నుంచి 7 తరగతులు చదివిన వారికి స్టడీ సర్టిఫికెట్‌ తెచ్చుకోవడం కూడా ఇబ్బందికరంగా మారింది. అప్పట్లో పలు స్కూళ్లు ఇప్పుడు లేనందున తహసీల్దార్ల నుంచి స్థానికత సర్టిఫికెట్‌ తెచ్చుకోవాల్సి ఉంటుంది. హడావిడిగా ధ్రువపత్రాల పరిశీలన ప్రక్రియ మొదలు పెట్టడంతో అభ్యర్ధులు ఆందోళన చెందుతున్నారు. కాగా మొత్తం 11,062 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి గానూ ఈ నియామక ప్రక్రియ కొనసాగుతున్న సంగతి తెలిసిందే.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

వీడేం డాక్టర్.? అనంతపురం ప్రభుత్వ వైద్యుడి నిర్లక్ష్యం..
వీడేం డాక్టర్.? అనంతపురం ప్రభుత్వ వైద్యుడి నిర్లక్ష్యం..
అమ్మో.. అన్ని అణు బాంబులే.! చైనా ఖండాంతర బాలిస్టిక్‌ క్షిపణి..
అమ్మో.. అన్ని అణు బాంబులే.! చైనా ఖండాంతర బాలిస్టిక్‌ క్షిపణి..
ఇది.. దేవర జాతర.! తారక రాముడి కలెక్షన్ ప్రభంజనం.
ఇది.. దేవర జాతర.! తారక రాముడి కలెక్షన్ ప్రభంజనం.
వాళ్ళిద్దరూ హిందువులే కాదు.. జ్యోతిర్‌మఠ్ శంకరాచార్య వ్యాఖ్యలు.
వాళ్ళిద్దరూ హిందువులే కాదు.. జ్యోతిర్‌మఠ్ శంకరాచార్య వ్యాఖ్యలు.
పూల మొక్కలకోసం వెళ్తే.. పులి కనిపించింది.! వైరల్ అవుతున్న వీడియో.
పూల మొక్కలకోసం వెళ్తే.. పులి కనిపించింది.! వైరల్ అవుతున్న వీడియో.
ఆరేళ్లప్పుడు కిడ్నాపయ్యాడు.. 70 ఏళ్ల తర్వాత ఊహించని క్షణాలు.!
ఆరేళ్లప్పుడు కిడ్నాపయ్యాడు.. 70 ఏళ్ల తర్వాత ఊహించని క్షణాలు.!
AIతో మీలో ఎలాంటి మార్పులు వస్తాయో తెలుసా.? వీడియో
AIతో మీలో ఎలాంటి మార్పులు వస్తాయో తెలుసా.? వీడియో
ఇది మామూలు పిల్లి కాదు.! 1000 మైళ్ల దూరంలోని ఇంటికి..
ఇది మామూలు పిల్లి కాదు.! 1000 మైళ్ల దూరంలోని ఇంటికి..
పడవలో 30 కుళ్లిన మృతదేహాలు.. అవి ఎవరివంటే.! వీడియో
పడవలో 30 కుళ్లిన మృతదేహాలు.. అవి ఎవరివంటే.! వీడియో
దేవుడి ప్రసాదంలో ఎలుక.! సిద్ధి వినాయకుని ప్రసాదంలో.. వీడియో వైరల్
దేవుడి ప్రసాదంలో ఎలుక.! సిద్ధి వినాయకుని ప్రసాదంలో.. వీడియో వైరల్