TTWR Sainik School Admissions: తెలంగాణ అశోక్‌నగర్ సైనిక పాఠశాలలో 6వ తరగతి, ఇంటర్ ప్రవేశాలు 2023-24.. ఎవరు అర్హులంటే..
హైదరాబాద్‌లోని తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ (టీటీడబ్ల్యూఆర్‌ఈఐఎస్)... 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించి వరంగల్ జిల్లా అశోక్‌నగర్‌లో బాలుర సైనిక స్కూల్ ఆరో తరగతి , ఇంటర్మీడియట్ (ఎంపీసీ)లో ప్రవేశాలకు అర్హులైన విద్యార్థుల నుంచి..
హైదరాబాద్‌లోని తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ (టీటీడబ్ల్యూఆర్‌ఈఐఎస్)… 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించి వరంగల్ జిల్లా అశోక్‌నగర్‌లో బాలుర సైనిక స్కూల్ ఆరో తరగతి , ఇంటర్మీడియట్ (ఎంపీసీ)లో ప్రవేశాలకు అర్హులైన విద్యార్థుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. సైనిక శిక్షణే ప్రధానాంశంగా ఉండే ఈ స్కూల్‌లో సీబీఎస్‌ఈ సిలబస్‌ను బోధిస్తారు. ఆరో తరగతిలో ప్రవేశాలు పొందగోరే విద్యార్ధులు 2022-23 విద్యా సంవత్సరంలో ఏదైనా గుర్తింపు పొందిన పాఠశాల నుంచి ఐదో తరగతిలో ఉత్తీర్ణులై ఉండాలి. ఇంటర్‌లో ప్రవేశాలకు 2022-23 విద్యా సంవత్సరంలో పదో తరగతి పరీక్షకు హాజరైన లేదా ఉత్తీర్ణత పొందిన విద్యార్ధులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ స్కూల్లో ప్రవేశాలకు కేవలం బాలురు మాత్రమే అర్హులు. తెలుగు/ఇంగ్లిష్ మీడియం చదివినవారు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే విద్యార్థి తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ.2,00,000 (పట్టణ ప్రాంతం), రూ.1,50,000 (గ్రామీణ ప్రాంతం) మించకుండా ఉండాలి. తెలుగు/ఇంగ్లిష్ మీడియం విద్యార్థులు అర్హులు. ఆరో తరగతి 80 సీట్లు, ఇంటర్ 80 సీట్లు ఉంటాయి.
ఆసక్తి కలిగిన వారు ఆన్‌లైన్ విధానంలో ఏప్రిల్ 8, 2023వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు సమయంలో రిజిస్ట్రేషన్ ఫీజు కింద ప్రతిఒక్కరూ రూ.200లు చెల్లించాలి. రాత పరీక్ష, శారీరక సామర్థ్య, వైద్య పరీక్షల ఆధారంగా విద్యార్థులను ఎంపిక చేస్తారు. ప్రవేశ పరీక్ష ఏప్రిల్ 30న నిర్వహిస్తారు. హాల్ టిక్కెట్లు ఏప్రిల్ 23 నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.1:3 నిష్పత్తిలో ప్రవేశ పరీక్ష ఫలితాలు మే 5న విడుదల చేస్తారు. ఫిజికల్ ఫిట్‌నెస్ పరీక్ష మే 8 నుంచి మే వరకు నిర్వహిస్తారు. మెరిట్ సాధించిన విద్యార్ధులకు జూన్ 12న సైనిక పాఠశాలలో ప్రవేశాలలు కల్పిస్తారు.
ఆరో తరగతి రాత పరీక్ష విధానం..
ఆరోతరగతి రాత పరీక్ష మొత్తం 100 మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలకు నిర్వహిస్తారు. తెలుగు 20 మార్కులు, ఇంగ్లిష్ 30 మార్కులు, మ్యాథ్స్ 30 మార్కులు, సైన్స్ 10 మార్కులు, సోషల్ స్టడీస్ 10 మార్కులకు ప్రశ్నలు అడుగుతారు.
ఇంటర్ రాత పరీక్ష విధానం..
8-10వ తరగతి స్థాయిలో 100 మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలకు పరీక్ష ఉంటుంది. ఇంగ్లిష్ 20 మార్కులు, మ్యాథ్స్ 40 మార్కులు, ఫిజిక్స్ 20 మార్కులు, కెమిస్ట్రీ 15 మార్కులు, బయాలజీ 5 మార్కులకు ప్రశ్నలు అడుగుతారు.
నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి.
అధికారిక వెబ్‌సైట్ కోసం క్లిక్ చేయండి.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.