TSPSC Results 2024: టీఎస్పీయస్సీ వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ రాత పరీక్ష ఫలితాలు విడుదల.. ఒక్క క్లిక్‌తో ఇక్కడ చెక్ చేసుకోండి
తెలంగాణ రాష్ట్ర వెటర్నరీ, పశుసంవర్ధక శాఖలో ఖాళీగా ఉన్న వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల భర్తీకి నిర్వహించిన రాత పరీక్ష ఫలితాలను టీఎస్పీయస్సీ విడుదల చేసింది. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఫలితాల జనరల్ ర్యాంకింగ్ లిస్ట్‌ను విడుదల చేసింది. పరీక్ష రాసిన అభ్యర్ధులు అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. కాగా ఈ నోటిఫికేషన్ కింద వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్..
హైదరాబాద్, మార్చి 25: తెలంగాణ రాష్ట్ర వెటర్నరీ, పశుసంవర్ధక శాఖలో ఖాళీగా ఉన్న వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల భర్తీకి నిర్వహించిన రాత పరీక్ష ఫలితాలను టీఎస్పీయస్సీ విడుదల చేసింది. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఫలితాల జనరల్ ర్యాంకింగ్ లిస్ట్‌ను విడుదల చేసింది. పరీక్ష రాసిన అభ్యర్ధులు అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. కాగా ఈ నోటిఫికేషన్ కింద వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ (క్లాస్-ఎ) పోస్టులు 170, వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ (క్లాస్-బి) పోస్టులు 15 భర్తీ కానున్నాయి. గతేడాది జులైలో రాత పరీక్ష నిర్వహించగా.. అందుకు సంబంధించిన ఫలితాలు తాజాగా విడుదలయ్యాయి. ఎంపికైన అభ్యర్థులకు త్వరలోనే ధ్రువపత్రాల పరిశీలన చేపట్టనున్నారు. ఎప్పుడనేది కమీషన్ త్వరలో వెల్లడించనుంది.
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కానిస్టేబుల్ పరీక్ష కీ విడుదల అప్పుడే..?
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) ఆధ్వర్యంలో నిర్వహించిన కేంద్ర సాయుధ బలగాల్లో కానిస్టేబుల్, రైఫిల్‌మ్యాన్ నియామక రాత పరీక్ష ప్రాథమిక ఆన్సర్ కీ విడుదలకు కమిషన్ ఏర్పాట్లు చేస్తోంది. ప్రాథమిక ఆన్సర్ కీ ని ఏప్రిల్ మొదటి వారంలో విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రాథమిక ఆన్సర్ కీ విడుదల అనంతరం కీపై అభ్యంతరాలు స్వీకరించనుంది. అభ్యంతరాలను పరిశీలించి ఏప్రిల్ చివర లేదా మే నెలలో తుది ఆన్సర్ కీతో పాటు ఫలితాలు కూడా ఒకేసారి వెల్లడి చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. కాగా ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 26,146 కానిస్టేబుల్, రైఫిల్‌మ్యాన్ పోస్టులను భర్తీ చేయనున్న సంగతి తెలిసిందే. ఈ పోస్టులకు సంబంధించిన ఆన్‌లైన్ పరీక్షలు ఈ ఏడాది ఫిబ్రవరి 29 నుంచి మార్చి 12వ తేదీ వరకు నిర్వహించారు. రాతపరీక్ష అనంతరం, ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, ధ్రువ పత్రాల పరిశీలన తదితరాల ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.