TS TET 2022: తెలంగాణ టెట్‌ – 2022 ప్రాథమిక ఆన్సర్‌ ‘కీ’పై వెల్లువెత్తిన అభ్యంతరాలు..త్వరలో ఫైనల్‌ ‘కీ’..

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా జూన్‌ 12న నిర్వహించిన టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్ (TS TET 2022)కు సంబంధించిన ప్రైమరీ కీ విడుదలైన సంగతి తెలిసిందే. దీనిపై అభ్యంతరాల స్వీకరణ జూన్ 18వ తేదీతో ముగిసింది. ఐతే టెట్‌ రెండు పేపర్లకు..

TS TET 2022: తెలంగాణ టెట్‌ - 2022 ప్రాథమిక ఆన్సర్‌ ‘కీ’పై వెల్లువెత్తిన అభ్యంతరాలు..త్వరలో ఫైనల్‌ 'కీ'..
Ts Tet 2022
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Jun 20, 2022 | 11:27 AM

TS TET 2022 Result date: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా జూన్‌ 12న నిర్వహించిన టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్ (TS TET 2022)కు సంబంధించిన ప్రైమరీ కీ విడుదలైన సంగతి తెలిసిందే. దీనిపై అభ్యంతరాల స్వీకరణ జూన్ 18వ తేదీతో ముగిసింది. ఐతే టెట్‌ రెండు పేపర్లకు సంబంధించి గరిష్ఠ స్థాయిలో అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఈ క్రమంలో పేపర్‌1కు 7,930, పేపర్‌ 2కు 4,663 అభ్యంతరాలు లేవనెత్తినట్టు విద్యాశాఖ వెల్లడించింది. వీటన్నింటినీ కూలంకషంగా పరిశీలించిన అనంతరం ‘ టెట్‌ ఫైనల్ ఆన్సర్ కీ (TS Final Answer key)’ని విడుదల చేయనున్నట్లు తెల్పింది. ఇక తుది ఫలితాలు జూన్‌ 27న విడుదలకానున్నాయి.

ఈసారి పేపర్ 1 పరీక్షకు 3,18,506 మంది, రెండో పేపర్‌కు 2,77,900ల మంది దరఖాస్తు చేసుకోగా 2,51,050ల మంది పరీక్ష రాశారు. అంటే దాదాపు 90 శాతం మంది అభ్యర్ధులు పరీక్షకు హాజరయ్యారు. గత పరీక్షలతో పోలిస్తే ఈసారి ప్రశ్నల సరళి సులువుగా ఉందని పలువురు అభ్యర్ధులు తెలిపారు. దీంతో ఎక్కువ శాతం మంది టెట్‌లో అర్హత సాధించే అవకాశం కనిపిస్తోంది.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

ఇవి కూడా చదవండి