AIIMS Recruitment 2022: నెలకు రూ.2 లక్షలకుపైగా జీతంతో ఎయిమ్స్‌లో 94 టీచింగ్ ఉద్యోగాలు.. అర్హతలివే..
భారత ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖకు చెందిన మధురైలోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS Madurai).. టీచింగ్ పోస్టుల (Teaching Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి..
AIIMS Madurai Faculty Recruitment 2022: భారత ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖకు చెందిన మధురైలోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS Madurai).. టీచింగ్ పోస్టుల (Teaching Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..
వివరాలు:
మొత్తం ఖాళీల సంఖ్య: 94
పోస్టుల వివరాలు:
- ప్రొఫెసర్ (అనాటమీ) పోస్టులు
- అడిషనల్ ప్రొఫెసర్ (ఈఎన్టీ) పోస్టులు
- అడిషనల్ ప్రొఫెసర్ (ఫార్మకాలజీ) పోస్టులు
- అసిస్టెంట్ ప్రొఫెసర్ (మైక్రో బయాలజీ) పోస్టులు
విభాగాలు: అనెస్థీషియాలజీ, అనాటమీ, బయోకెమిస్ట్రీ, కమ్యునిటీ అండ్ ఫ్యామిలీ మెడిసిన్, డెర్మటాలజీ, ఈఎన్‌టీ, ఫోరెన్సిక్ మెడిసిన్ అండ్ టాక్సికాలజీ, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, హాస్పిటర్ అడ్మినిస్ట్రేషన్ తదితర విభాగాల్లో ఖాళీలున్నాయి.
వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 50 నుంచి 58 ఏళ్ల మధ్య ఉండాలి.
పే స్కేల్: నెలకు రూ.1,38,300ల నుంచి రూ.2,20,400ల వరకు జీతంగా చెల్లిస్తారు.
అర్హతలు: పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో మెడికల్ పీజీ/ఎమ్‌డీ/ఎమ్ఎస్/తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి.
ఎంపిక విధానం: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. అనంతరం హార్డ్ కాపీని ఈ మెయిల్/పోస్టు ద్వారా పంపించాలి.
ఈ మెయిల్ ఐడీ: aiimsmadurai.fac@gmail.com
అడ్రస్: The Nodal Officer, AIIMS, Madurai Admn. 4 (Faculty wing) 2nd Floor, Administrative Block JIPMER, Puducherry 605 006
దరఖాస్తు రుసుము:
- జనరల్ అభ్యర్ధులకు: రూ.1500
- ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూడీ అభ్యర్థులకు: రూ.1200
దరఖాస్తులకు చివరి తేదీ: జులై 18, 2022 సాయంత్రం 4 గంటల 30 నిముషాలు.
హార్డ్ కాపీలను సమర్పించడానికి చివరి తేదీ: జులై 25, 2022 సాయంత్రం 4 గంటల 30 నిముషాలు.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.