Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Agnipath: ‘అగ్నిపథ్‌’కు వ్యతిరేకంగా గళం విప్పితే ఎఫ్‌ఐఆర్‌ నమోదు.. శాశ్వతంగా ఆర్మీ కొలువులకు దూరం!

'అగ్నిపథ్‌' (Agnipath)ను వ్యతిరేకిస్తూ దేశ వ్యాప్తంగా పలు చోట్ల నిరసనలు తెల్పిన వేల విద్యార్ధులపై పోలీసులు అనేక కేసులు నమోదు చేశారు. తాజా ప్రకటనతో ఆయా విద్యార్ధులు తమ కలల ఉద్యోగానికి శాశ్వతంగా దూరంకానున్నారు. ఎట్టిపరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదంటున్న కేంద్రం..

Agnipath: 'అగ్నిపథ్‌'కు వ్యతిరేకంగా గళం విప్పితే ఎఫ్‌ఐఆర్‌ నమోదు.. శాశ్వతంగా ఆర్మీ కొలువులకు దూరం!
Tri Service Defence
Follow us
Srilakshmi C

|

Updated on: Jun 20, 2022 | 7:16 AM

Agnipath applicants will have to pledge: ‘అగ్నిపథ్‌’ నియామకాలపై కేంద్రం కఠిన చర్యలకు పూనుకొంటోంది. ‘అగ్నిపథ్‌’కు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు తాజాగా నొలకొన్న నిరసనలు, హింసాత్మక ఘటనల్లో పాల్గొనలేదనే విషయాన్ని అభ్యర్ధులు ధృవీకరించవల్సి ఉంటుందని ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌ (త్రివిద) దళాలకు చెందిన ఉన్నతాధికారులు ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈ మేరకు ప్రకటించారు. ఇందుకు సంబంధించి దరఖాస్తు సమయంలోనే ప్రమాణ పత్రాన్ని సమర్పించాల్సి ఉంటుందన్నారు. ఒకవేళ పోలీస్‌ వెరిఫికేషన్‌లో (police verification) ఎఫ్‌ఐఆర్‌ నమోదైందని తేలితే అటువంటి వారికి అగ్నివీరులుగా ప్రవేశం పొందేందుకు అర్హత ఉండదని తేల్చి చెప్పారు. ఏళ్ల తరబడి (1989) అగ్నిపథ్‌ స్కీం పెండింగ్‌లో ఉందని, దీనిపై ఎట్టిపరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని అధికారులు అన్నారు. ఇప్పటికే ‘అగ్నిపథ్‌’ (Agnipath)ను వ్యతిరేకిస్తూ దేశ వ్యాప్తంగా పలు చోట్ల నిరసనలు తెల్పిన వేల విద్యార్ధులపై పోలీసులు అనేక కేసులు నమోదు చేశారు. తాజా ప్రకటనతో ఆయా విద్యార్ధులు తమ కలల ఉద్యోగానికి శాశ్వతంగా దూరంకానున్నారు.

ఈ సందర్భంగా సైనిక వ్యవహారాల విభాగానికి చెందిన లెఫ్ట్‌నెంట్‌ జనరల్‌ అనిల్‌ పూరీ మాట్లాడుతూ..‘తాజాగా ప్రవేశపెట్టిన పథకాన్ని వ్యతిరేకిస్తూ ఇటీవల జరిగిన హింసాత్మక ఘటనలను మేం ఊహించలేదు. క్రమశిక్షణే భారత సైన్యానికి తొలిమెట్టు. అటువంటి సైన్యంలో దాడులు, దహనాల వంటి క్రమశిక్షణారాహిత్యానికి చోటులేదు. ఆందోళనలు, నిరసనల్లో పాల్గొనలేదని ప్రతి అభ్యర్థి ప్రమాణపత్రం సమర్పించాలి. పోలీస్‌ వెరిఫికేషన్‌లో ఏ అభ్యర్థి మీదైనా ఎఫ్‌ఐఆర్‌ నమోదైనట్లు తేలితే అగ్నివీరులుగా వారికి ప్రవేశం ఉండద’న్నారు.

ఇవి కూడా చదవండి

భావోద్వేగంతో కూడుకున్న ఆర్మీ ఉద్యోగాలను జీతంతో లెక్కకట్టలేము. అయినప్పటికీ రెగ్యులర్‌ సైనికుల మాదిరిగానే అగ్నివీరులకు జీతభత్యాలు ఉంటాయి. ఐతే సర్వీస్‌ నిబంధనల్లో మాత్రం ఎటువంటి వ్యత్యాసం ఉండదు. నేవీలో అగ్నివీరులుగా మహిళలకు కూడా అవకాశం ఉంటుంది. నవంబర్‌ 21 నుంచి నేవీలో ఫస్ట్‌ బ్యాచ్‌కు అగ్నివీరుల శిక్షణ ప్రారంభమవుతుంది. ఎయిర్‌ ఫోర్స్‌లో డిసెంబర్‌ 30 నుంచి శిక్షణ మొదలవుతుందని అధికారులు తెలిపారు.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.