Agnipath Protest: ‘నాలుగేళ్ల తర్వాత ఎవ్వరూ ఉద్యోగాలు కోల్పోరు.. అగ్నిపథ్‌ను పూర్తిగా అర్థం చేసుకోండి’
ప్రస్తుతం చెలరేగుతున్న అల్లర్లు అగ్నిపథ్ పథకాన్ని సరిగ్గా అర్థం చేసుకోకపోవడంవల్ల ఏర్పడ్డ అపోహలేనని, తొలుత అగ్నిపథ్‌ను పూర్తిగా అర్థం చేసుకుని, ఆ తర్వాత నిరసనలు తెలపాలని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇంకా..
What India Thinks Today: కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన వివాదాస్పద అగ్నిపథ్ స్కీమ్ దేశ వ్యాప్తంగా అగ్గి రగిల్చింది. దేశ యువత నిరసనల సెగ రాజకీయంగానూ పెద్ద దుమారం లేపింది. ఐతే అగ్నిపథ్ పథకాన్ని సరిగ్గా అర్థం చేసుకోకపోవడంవల్ల ఏర్పడ్డ అపోహలేనని కేంద్ర ప్రభుత్వం కొట్టిపారేస్తుంది. తొలుత అగ్నిపథ్‌ను పూర్తిగా అర్థం చేసుకుని, ఆ తర్వాత నిరసనలు తెలపాలని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ వ్యాఖ్యానించారు. ‘అగ్నిపథ్ పథకాన్ని పూర్తిగా అర్థం చేసుకుంటే ఎటువంటి వ్యాతిరేకత తలెత్తదు. ఈ పథకం ఉపాధి అవకాశాలను పెంపొందిస్తుంది. దేశ యువత ప్రయోజనార్థమే దీనిని ప్రవేశ పెట్టినట్లు’ శుక్రవారం (జూన్ 17) నాటి వాట్ ఇండియా థింక్స్ టుడే గ్లోబల్ సమ్మిట్‌లో గడ్కరీ అన్నారు. ఇంకా ఏమన్నారంటే..
‘అగ్నిపథ్’ను సరిగా అర్థం చేసుకోండి..
‘అగ్నిపథ్ పథకం వల్ల ఉద్యోగాల సంఖ్య పెరుగుతుంది. ఈ పథకం ద్వారా చేపట్టిన నియామకాల్లో నాలుగేళ్ల తర్వాత ఎవ్వరూ ఉద్యోగాలు కోల్పోరు. పథకాన్ని సవివరంగా అర్థం చేసుకోకపోవడం వల్లనే యువత నిరసనలకు పాల్పడుతోంది. ప్రజా సంక్షేమం దృష్టా కేంద్రం ఈ పథకాన్ని ప్రవేశ పెట్టింది. ఈ ఏడాది విడుదలచేసిన రిక్రూట్‌మెంట్‌లో భాగంగా గరిష్ట వయోపరిమితిని 21 ఏళ్ల నుంచి 23 ఏళ్లకు ఇప్పటికే పెంచిందని’ మంత్రి గుర్తుచేశారు.
#TV9GlobalSummit #WhatIndiaThinksToday https://t.co/yUZizeATbA pic.twitter.com/zLpFb1L2VA
— News9 (@News9Tweets) June 17, 2022
ప్రయాణ సమయాన్ని కుదించే రోడ్డు ప్రాజెక్టులు
‘మెరుగైన రవాణా సౌకర్యాలను అందించడానికి కేంద్ర ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుంది. రహదారి ప్రాజెక్టులన్నింటినీ త్వరలో పూర్తి చేస్తాం. ఈ ప్రాజెక్టులు పూర్తయితే ఢిల్లీ నుంచి ముంబై మధ్య ప్రయాణ సమయం 12 గంటలకు తగ్గుతుంది. ప్రజలకు ప్రయాణం మరింత సులభతరం అవుతుంది. రోడ్డు ప్రాజెక్టులు పూర్తయితే ఢిల్లీ నుంచి చండీగఢ్‌కు ప్రయాణించడానికి కేవలం రెండున్నర గంటల సమయం మాత్రమే పడుతుంది. 2 గంటల్లో ఢిల్లీ నుంచి హార్దివార్‌కు వెళ్లవచ్చు. దేశ రాజధాని ఢిల్లీ నుంచి 8 గంటల వ్యవధిలోనే శ్రీనగర్‌కు చేరుకోవచ్చిని గడ్కరీ చెప్పారు. అమరావతి నుంచి అకోలా మధ్య ఎన్‌హెచ్-53 సెక్షన్‌లో సింగిల్ లైన్‌లో దాదాపు 75 కిలోమీటర్ల మేర ఏకధాటిగా కాంక్రీట్ రోడ్డును నిర్మించిన నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) గిన్నీస్ వరల్డ్ రికార్డును సృష్టించిందని మంత్రి పేర్కొన్నారు.
మామూలు వాహన ధరల మాదిరిగానే ఎలక్ట్రిక్ వాహన ధరలు..
వాహన ధరల గురించి మంత్రి మాట్లాడుతూ.. ‘ఫ్లెక్స్ ఇంజన్, ఎలక్ట్రిక్ వాహనాల ధరలు కూడా పెట్రోల్‌తో నడిచే వాహనాల మాదిరిగానే ఉంటాయి. ఎలక్ట్రిక్ వాహనాలను మరింత చౌకగా తయారు చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. ఏడాది వ్యవధిలో పెట్రోల్ వాహనాల ధరల మాదిరిగానే ఫ్లెక్స్ ఇంజన్లు, ఎలక్ట్రిక్ వాహనాల ధరలు కూడా ఉండబోతోందని’ మంత్రి గడ్కరీ తెలిపారు.
#TV9GlobalSummit #WhatIndiaThinksToday https://t.co/k8SE7VQQTW pic.twitter.com/eIiPYwlYGP
— News9 (@News9Tweets) June 17, 2022
త్వరలోనే పెట్రోల్ మాదిరి ఇథనల్ ఫ్యూయల్‌తో నడిచే కార్లు..
ఇథనల్ కార్ల వాడకం గురించి ఈ విధంగా మాట్లాడారు.. ‘వాయు కాలుష్యానికి చెక్ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వ అనేక కార్యక్రమాలను చేపట్టబోతోంది. దీనిలో భాగంగానే పర్యావరణ హిత ఇంధనంగా ఇథనల్ (ethanol)ను ఉపయోగించేందుకు కృషి చేస్తున్నాం. పంటల వ్యర్థాల నుంచి తయారు చేసే పెట్రోల్ వంటి ఫ్యూయల్‌ను ఇథనల్ అంటారు. ఒక లీటర్ ఇథనల్.. లీటర్ పెట్రోల్‌తో సమానం. ఇలా తయారు చేసిన ఇథనల్ ఇంధనంతో నడిచే కార్లను తయారు చేసే కంపెనీలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా ఢిల్లీలోని వాయుకాలుష్యాన్ని ఎదుర్కోవడంలో ఇథనల్ ఎంతో ఉపయోగపడుతుందని’ కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వివరించారు.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.