TS EAPCET 2024 Result Date: తెలంగాణలో ప్రశాంతంగా ముగిసిన ఈఏపీసెట్‌ పరీక్షలు..15 రోజుల్లోనే ఫలితాలు!

తెలంగాణ ఈఏపీసెట్‌ ఇంజినీరింగ్‌, అగ్రికల్చర్‌ స్ట్రీమ్‌ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. ఇంజినీరింగ్‌ స్ట్రీమ్‌ విభాగం పరీక్షలు మొత్తం 2,54,750 మంది అభ్యర్ధులు దరఖాస్తు చేసుకోగా.. వారిలో 2,40,617 మంది అభ్యర్ధులు పరీక్షకు హాజరయ్యారు. అగ్రికల్చర్‌తోపాటు ఇంజినీరింగ్‌ పరీక్షలు శనివారం (మే 11)తో ముగిశాయి. ఈఏపీసెట్‌ ఫలితాలను 15 రోజుల్లోపు విడుదల చేసి, ర్యాంకులు కేటాయించేందుకు..

TS EAPCET 2024 Result Date: తెలంగాణలో ప్రశాంతంగా ముగిసిన ఈఏపీసెట్‌ పరీక్షలు..15 రోజుల్లోనే ఫలితాలు!
TS EAPCET 2024
Follow us
Srilakshmi C

|

Updated on: May 12, 2024 | 11:04 AM

హైదరాబాద్‌, మే 9: తెలంగాణ ఈఏపీసెట్‌ ఇంజినీరింగ్‌, అగ్రికల్చర్‌ స్ట్రీమ్‌ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. ఇంజినీరింగ్‌ స్ట్రీమ్‌ విభాగం పరీక్షలు మొత్తం 2,54,750 మంది అభ్యర్ధులు దరఖాస్తు చేసుకోగా.. వారిలో 2,40,617 మంది అభ్యర్ధులు పరీక్షకు హాజరయ్యారు. అగ్రికల్చర్‌తోపాటు ఇంజినీరింగ్‌ పరీక్షలు శనివారం (మే 11)తో ముగిశాయి. ఈఏపీసెట్‌ ఫలితాలను 15 రోజుల్లోపు విడుదల చేసి, ర్యాంకులు కేటాయించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. కాగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈఏపీసెట్‌ పరీక్షలు మే 7 నుంచి 11వ తేదీ వరకు జరిగిన సంగతి తెలిసిందే. మే 7, 8 తేదీల్లో అగ్రికల్చర్‌ అండ్‌ ఫార్మసీ స్ట్రీమ్‌ పరీక్షలు జరగగా.. మే 10, 11 తేదీల్లో ఇంజినీరింగ్ స్ట్రీమ్‌ పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షలు రోజుకు రెండు షిఫ్టుల్లో జరిగాయి.

ఈ ఏడాది ఈఏపీసెట్‌ పరీక్షలకు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తంగా దాదాపు 3.50 లక్షలకు పైగా విద్యార్థులు రిజిస్ట్రేష‌న్లు చేసుకున్నారు. మొత్తం 21 జోన్లలో ఈ పరీక్షలు జరిగాయి. వీటిల్లో ఏపీలో కూడా 5 జోన్లు ఏర్పాటు చేశారు. తొలుత ఇచ్చిన నోటిఫికేషన్‌ ప్రకారం తెలంగాణ ఈఏపీసెట్‌ ఫలితాలు జూన్ 15న విడుదలయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే అగ్రికల్చర్‌ అండ్‌ ఫార్మసీ స్ట్రీమ్‌ పరీక్షల ప్రైమరీ ఆన్సర్‌ ‘కీ’ విడుదలైంది. రేపు (మే 13) తేదీ ఉదయం 11 గంటల్లోపు ఆన్సర్‌ కీపై అభ్యంతరాలను స్వీకరిస్తారు. ఆన్సర్‌ కీతో పాటు రెస్పాన్స్‌ షీట్‌, మాస్టర్‌ ప్రశ్నపత్రాన్ని కూడా అభ్యర్ధులు డౌన్‌లోడ్‌ చేసుకునే వెసులుబాటు కల్పించారు. అభ్యంతరాలను కేవలం ఆన్‌లైన్‌ విధానంలో మాత్రమే సమర్పించాలి.

నేటితో ముగుస్తున్న ఏపీ ఈఏపీసెట్‌ 2024 దరఖాస్తు గడువు

అటు ఆంధ్రప్రదేశ్‌లో గతేడాది కంటే ఈ ఏడాది ఈఏపీసెట్‌ దరఖాస్తులు భారీగా వచ్చాయి. ఇప్పటి వరకూ దాదాపు 3.60 లక్షలకుపైగా అభ్యర్ధులు దరఖాస్తు చేసుకున్నారు. రూ.10 వేల ఆలస్య రుసుంతో ఈ రోజు (మే 12)తో దరఖాస్తు గడువు ముగుస్తుంది. మే 16, 17 తేదీల్లో అగ్రిక‌ల్చర్‌, ఫార్మసీ స్ట్రీమ్‌ ప్రవేశ పరీక్షలు, మే 18 నుంచి 23వ తేదీ వరకు ఇంజినీరింగ్‌ స్ట్రీమ్‌ ప్రవేశ పరీక్షలు జరుగనున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.

Horoscope Today: వారికి ఉద్యోగంలో పని భారం పెరిగే ఛాన్స్..
Horoscope Today: వారికి ఉద్యోగంలో పని భారం పెరిగే ఛాన్స్..
క్యాచ్ పట్టుకునే ప్రయత్నంలో ఢీకొన్న క్రికెటర్లు.. వీడియోలు వైరల్
క్యాచ్ పట్టుకునే ప్రయత్నంలో ఢీకొన్న క్రికెటర్లు.. వీడియోలు వైరల్
డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ముసాయిదా రిలీజ్
డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ముసాయిదా రిలీజ్
ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అరుంధతి ఛైల్డ్ ఆర్టిస్ట్.. ఫొటోస్ వైరల్
ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అరుంధతి ఛైల్డ్ ఆర్టిస్ట్.. ఫొటోస్ వైరల్
సల్మాన్ ఖాన్ తమ్ముడు విడాకులు..
సల్మాన్ ఖాన్ తమ్ముడు విడాకులు..
12 కిలోల బరువు పెరిగి.. ఆపై చైన్ స్మోకర్‏గా మారిన హీరోయిన్..
12 కిలోల బరువు పెరిగి.. ఆపై చైన్ స్మోకర్‏గా మారిన హీరోయిన్..
రోజుకు ఎన్ని లీటర్ల నీరు తాగాలో తెలుసా.. ఎక్కువైతే ఏమౌతుంది..?
రోజుకు ఎన్ని లీటర్ల నీరు తాగాలో తెలుసా.. ఎక్కువైతే ఏమౌతుంది..?
కొత్త ఏడాది పైనే ఫ్లాప్ హీరోయిన్ల ఆశలు.. ఇప్పుడైన కలిసొచ్చేన
కొత్త ఏడాది పైనే ఫ్లాప్ హీరోయిన్ల ఆశలు.. ఇప్పుడైన కలిసొచ్చేన
నీయవ్వ తగ్గేదేలే.. పుష్పరాజ్‌లా పోజులిచ్చిన స్టార్ హీరోయిన్ డాటర్
నీయవ్వ తగ్గేదేలే.. పుష్పరాజ్‌లా పోజులిచ్చిన స్టార్ హీరోయిన్ డాటర్
వీళ్లు బాదంపప్పును పొరపాటున కూడా తినకూడదు.. దూరంగా ఉంటేనే ఆరోగ్యం
వీళ్లు బాదంపప్పును పొరపాటున కూడా తినకూడదు.. దూరంగా ఉంటేనే ఆరోగ్యం