Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TS EAMCET 2025: బీ-కేటగిరి సీట్లపై బీకేర్ ఫుల్ – ఇంజినీరింగ్ ప్రవేశాలపై ఉన్నత విద్యామండలి కీలక సూచనలు

బీ-కేటగిరి సీట్ల భర్తీ ప్రక్రియ కూడా ప్రారంభం కాలేదని.. ఉన్నత విద్యామండలి నోటిఫికేషన్ ఇచ్చే వరకు కూడా బీ-కేటగిరీ సీట్ల తీసుకొవద్దని పేరేంట్స్, స్టూడెంట్స్ కు హైయర్ ఎడ్యూకేషన్ సూచించింది. కానీ కొంతమంది సీట్లు దొరకవని లక్షలు పోసీ ముందే బుక్ చేసుకుంటున్నట్లు తమ దృష్టికి వచ్చినా అథెంటింక్ ఇన్ఫర్మేషన్ కాకపోవడంతో చర్యలు తీసుకోలేని పరిస్థితి ఉందన్నారు.

TS EAMCET 2025: బీ-కేటగిరి సీట్లపై బీకేర్ ఫుల్ - ఇంజినీరింగ్ ప్రవేశాలపై ఉన్నత విద్యామండలి కీలక సూచనలు
Eamcet Counselling
Follow us
Vidyasagar Gunti

| Edited By: Jyothi Gadda

Updated on: Jun 10, 2025 | 10:15 PM

తెలంగాణలో ఇంటర్ పూర్తి చేసి ఇంజినీరింగ్ ప్రవేశాల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులకు ఉన్నత విద్యామండలి గుడ్ న్యూస్ చెప్పింది. జులై మొదటి వారంలో ఎప్ సెట్/ఇంజినీరింగ్ కౌన్సిలింగ్ నిర్వహించనున్నట్లు హైయర్ ఎడ్యూకేషన్ చైర్మన్ బాలకిష్టారెడ్డి తెలిపారు. ఏఐసీటీయూ సూచనల మేరకు ఆగస్టు 14 నుంచి ఇంజినీరింగ్ క్లాసులు ప్రారంభం కావాల్సి ఉన్నందున జులైలో కౌన్సిలింగ్ ప్రక్రియను పూర్తి చేయాలని భావిస్తున్నట్లు ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డి చెప్పారు. జేఈఈ కౌన్సిలింగ్ కాకుండా రాష్ట్రంలో ఎప్ సెట్ కౌన్సిలింగ్ ప్రారంభించలేమని తెలిపారు.

ఇంజినీరింగ్ చదవాలనుకునే విద్యార్థుల కోసం కౌన్సిలింగ్ పై అవగాహన కల్పించేలా చర్యలు తీసుకంటున్నట్లు ఉన్నత విద్య మండలి చెప్పింది. టెలికాల్ సౌకర్యం ఎర్పాటు చేసి విద్యార్థుల అనుమానాలు నివృత్తి చేయనున్నట్లు చైర్మన వెల్లడించారు. అంతేకాకుండా రెండురోజుల పాటు మాక్ కౌన్సిలింగ్ కూడా నిర్వహించి ఎక్కడా విద్యార్థులకు వారి ర్యాంకుల ఆధారంగా సీటు దొరికే అవకాశం ఉందో అవగాహన కల్పిస్తామన్నారు.

ఎప్ సెట్ రిజల్ట్స్ వచ్చినప్పటి నుంచే పలువురు విద్యార్థులు ఇంజినీరింగ్ సీట్ల కోసం ప్రైవేటు కాలేజీలకు క్యూ కట్టారు. బీ-కేటగిరి సీట్ల భర్తీ ప్రక్రియ కూడా ప్రారంభం కాలేదని.. ఉన్నత విద్యామండలి నోటిఫికేషన్ ఇచ్చే వరకు కూడా బీ-కేటగిరీ సీట్ల తీసుకొవద్దని పేరేంట్స్, స్టూడెంట్స్ కు హైయర్ ఎడ్యూకేషన్ సూచించింది. కానీ కొంతమంది సీట్లు దొరకవని లక్షలు పోసీ ముందే బుక్ చేసుకుంటున్నట్లు తమ దృష్టికి వచ్చినా అథెంటింక్ ఇన్ఫర్మేషన్ కాకపోవడంతో చర్యలు తీసుకోలేని పరిస్థితి ఉందన్నారు. బీ-కేటగిరీ సీట్లపై ప్రభుత్వం నుంచి నిర్ణయం వెలువడాల్సి ఉందని చైర్మన్ బాలకిష్టా రెడ్డి చెప్పారు.

ఇవి కూడా చదవండి

నిబంధనలకు విరుద్ధంగా ఉన్న ఇన్ స్టిట్యూషన్స్ కు నోటీసులు; ఎలాంటి అనుమతులు లేకుండా నిబంధనలకు విరుద్ధంగా కొన్ని ఇన్ స్టిట్యూట్ లు అడ్మిషన్లు తీసుకుంటున్నట్లు ఫిర్యాదులు అందాయని ఉన్నత విద్యా మండలి చైర్మన్ బాలకిష్టా రెడ్డి తెలిపారు. ఫిర్యాదులు వచ్చిన నాలుగు విద్యాసంస్థలకు నోటీసులు జారీ చేసి జూన్ 13 నాటికి వివరణ ఇవ్వాలని కోరినట్లు ఆయన చెప్పారు. ఆ 4 ఇన్స్టిట్యూషన్స్ ల అనుమతులు, తరగతుల నిర్వహణ అర్హతపై వివరణ అడిగారు. డీమ్డ్ వర్శిటీలతో టైఅప్ అయ్యి ఇంజనీరింగ్ కోర్స్ లు అందిస్తామని విద్యార్థుల నుంచి ఫీజులు వసూలు చేస్తున్నట్లు ఫిర్యాదు అందాయని.. సరైన వివరణ ఇవ్వకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని చైర్మన్ హెచ్చరించారు.

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.