AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇదో అద్భుత ఫలం..! రోజుకు ఒక్కటి తింటే చాలు ఆరోగ్యంగా ఉంటారు..!!

ప్రస్తుతం చాలా రకాల విదేశీ పండ్లు కూడా అందుబాటులోకి వచ్చాయి. ఇవి మన దేశీ పండ్లతో పోలిస్తే కాస్త ధర ఎక్కువగానే ఉంటున్నాయి. కానీ, అన్ని కాలాల్లో, అందరికీ అందుబాటులో ఉండే ఒక అద్భుత ఫలం ఉంది.. దానిని పేదవాడి యాపిల్ గా పరిగణిస్తారు. ఎందుకంటే.. యాపిల్ పండులో ఉండే చాలా పోషకాలు ఈ పండులో కూడా ఉంటాయి. ఇంతకీ ఆ పండు ఏంటి..? దాని ప్రయోజనాలేంటో ఇక్కడ తెలుసుకుందాం..

ఇదో అద్భుత ఫలం..! రోజుకు ఒక్కటి తింటే చాలు ఆరోగ్యంగా ఉంటారు..!!
Healthy Fruits
Jyothi Gadda
|

Updated on: Jun 10, 2025 | 7:09 PM

Share

సంపూర్ణ ఆరోగ్యానికి ఆహారంతో పాటు పండ్లు కూడా ముఖ్యం. అందుకే వైద్యులు సైతం ఎప్పుడూ తాజా పండ్లను తినమని సూచిస్తుంటారు. అన్ని సీజన్‌తో పనిలేకుండా లభించే పండ్లు కొన్నైతే.. సీజనల్‌గా లభించే పండ్లు మరికొన్ని ఉంటాయి. మార్కెట్లో మనకు ఎన్నో రకాల పండ్లు అందుబాటులో ఉన్నాయి. అరటి, యాపిల్‌, ద్రాక్ష, దానిమ్మ, బత్తాయి, నేరేడు, సపోటా, సీతాఫలం, జామ ఇలా చెప్పుకుంటూ పోతే..లెక్కలెనన్నీ పండ్ల రకాలు ఉన్నాయి. ప్రస్తుతం చాలా రకాల విదేశీ పండ్లు కూడా అందుబాటులోకి వచ్చాయి. ఇవి మన దేశీ పండ్లతో పోలిస్తే కాస్త ధర ఎక్కువగానే ఉంటున్నాయి. కానీ, అన్ని కాలాల్లో, అందరికీ అందుబాటులో ఉండే ఒక అద్భుత ఫలం ఉంది.. దానిని పేదవాడి యాపిల్ గా పరిగణిస్తారు. ఎందుకంటే.. యాపిల్ పండులో ఉండే చాలా పోషకాలు ఈ పండులో కూడా ఉంటాయి. ఇంతకీ ఆ పండు ఏంటి..? దాని ప్రయోజనాలేంటో ఇక్కడ తెలుసుకుందాం..

Guava Health Benefits

ఖరీదైన యాపిల్ పండ్లు కొని తినలేని పేదవారికి అంతే పోషకాలు అందించే పండు జామ పండు.. అందుకే దీనికి పేదవాడి యాపిల్ అనే పేరు వచ్చింది. జామ పండులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఈ కారణంగా జామ పండును తింటే ఎక్కువ సేపు ఆకలి వేయకుండా ఉంటుంది. రోజు ఒక జామపండు తింటే బోలెడు ఆరోగ్య సమస్యలు దూరమవుతాయిన ఆయుర్వేద ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. రోగనిరోధక వ్యవస్థకు అవసరమైన విటమిన్ సి సైతం జామకాయలో ఉంటుంది. జామకాయలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది మలబద్ధకాన్ని నివారిస్తుంది.

ఇవి కూడా చదవండి

జామకాయలోని పొటాషియం, కరిగే ఫైబర్ రక్తపోటును నియంత్రించడానికి, చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడానికి సహాయపడతాయి. రక్తంలో చక్కెర స్థాయిలు, ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరచడంలో జామకాయ సహాయపడుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. జామకాయలోని అధిక ఫైబర్ కడుపు నిండిన ఫీలింగ్ ఇస్తుంది. బరువు నియంత్రణకు సహాయపడుతుంది. జామకాయలో విటమిన్ ఎ పుష్కలంగా ఉంటుంది. ఇది కంటి సమస్యలను నివారించడానికి సహాయపడుతుంది.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్