పాక్ సైన్యం కాల్పుల్లో దెబ్బతిన్న ఇళ్లకు పరిహారం ప్రకటించిన కేంద్ర హోంశాఖ..ఎంతంటే..
సరిహద్దు జిల్లాల నుంచి మొత్తం 3.25 లక్షల మందిని సరక్షిత ప్రాంతాలకు తరలించారు. ఆహారం, నీరు, ఆరోగ్య సంరక్షణ, విద్యుత్ సదుపాయంతో కూడిన దాదాపు 397 రక్షణ, వసతి కేంద్రాలలో 15,000 మందిని ఉంచారు.రోగులను చికిత్స కోసం ఆసుపత్రులకు తీసుకెళ్లేందకు సరిహద్దు జిల్లాలన్నింటిలో కలిపి మొత్తం 394 అంబులెన్స్‌లను ఏర్పాటు చేశారు. వీటిలో 62 అంబులెన్సులు కేవలం పూంచ్ జిల్లాలోనే సేవలందించాయి.

జమ్మూ కాశ్మీర్ సరిహద్దు గ్రామాల్లో పాక్ సైన్యం ప్రజల నివాసాలపై జరిపిన దాడుల నుంచి కోలుకునేందుకు బాధితులకు ఆర్థికసాయం ప్రకటించింది కేంద్ర హోంశాఖ.. సరిహద్దు ప్రాంతాల్లో దెబ్బతిన్న ఇళ్లకు అదనపు పరిహారం చెల్లిస్తామన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటనను వెంటనే అమలు పరుస్తూ 2060 ఇళ్లకు సంబంధించి రూ. 25 కోట్లను ప్రకటించారు కేంద్ర హోం మంత్రి అమిత్ షా..పూర్తిగా దెబ్బతిన్న ఇంటికి రూ. 2 లక్షలు, పాక్షికంగా దెబ్బతిన్న ఇంటికి రూ. 1 లక్ష చొప్పున అదనపు పరిహారం ఇస్తామన్న ప్రధానమంత్రి మోదీ ప్రత్యేక ప్రకటనను వెంటనే అమలు చేసింది హోం మంత్రిత్వ శాఖ..
పంజాబ్‌లోని సరిహద్దు ప్రాంతాల్లో కూడా ఇదే విధంగా పరిహారం అందించనుంది కేంద్ర ప్రభుత్వం..2025 మే 29, 30లలో కేంద్ర హోం, సహకార మంత్రి శ్రీ అమిత్ షా పూంచ్‌ను సందర్శించారు. సరిహద్దు కాల్పుల కారణంగా ప్రాణాలు కోల్పోయిన 14 మంది కుటుంబ సభ్యులకు ఆయన కారుణ్య ప్రాతిపదికన చేపట్టిన నియామక పత్రాలను అందజేశారు…నివాస ప్రాంతాలు, పాఠశాలలు, గురుద్వారాలు, దేవాలయాలు, మసీదులు, వాణిజ్య సముదాయాలతో సహా మతపరమైన కట్టడాలపై జరిగిన కాల్పుల కారణంగా వందలాది కుటుంబాలు నష్టపోయాయి. పాక్ సైన్యం కాల్పుల సమయంలో జరగబోయే సంఘటనలను ఎప్పటికప్పుడూ అంచనా వేస్తూ సమర్థవంతంగా అధికార యంత్రాంగం ముందస్తు చర్యలు తీసుకుంది.
సరిహద్దు జిల్లాల నుంచి మొత్తం 3.25 లక్షల మందిని సరక్షిత ప్రాంతాలకు తరలించారు. ఆహారం, నీరు, ఆరోగ్య సంరక్షణ, విద్యుత్ సదుపాయంతో కూడిన దాదాపు 397 రక్షణ, వసతి కేంద్రాలలో 15,000 మందిని ఉంచారు.రోగులను చికిత్స కోసం ఆసుపత్రులకు తీసుకెళ్లేందకు సరిహద్దు జిల్లాలన్నింటిలో కలిపి మొత్తం 394 అంబులెన్స్‌లను ఏర్పాటు చేశారు. వీటిలో 62 అంబులెన్సులు కేవలం పూంచ్ జిల్లాలోనే సేవలందించాయి. ఆరోగ్యం, అగ్నిమాపక, అత్యవసర సేవలు, పశువులు, అవసరమైన సామాగ్రి తదితర విషయాల్లో సేవలందించేందుకు మొత్తం 2818 మంది పౌర రక్షణ స్వచ్ఛంద సేవకులను కూడా నియమించారు… ప్రస్తుతం పరిస్థితులు సద్దుమనగడం తో ప్రజలు తిరిగి స్వస్థలాలకు చేరుకుని యధావిధిగా వారి జీవనాన్ని కొనసాగిస్తున్నారు..
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి…