Breast Cancer: బ్రెస్ట్ క్యాన్సర్ ఎలా గుర్తించాలి..? ఇలాంటి లక్షణాలు కనిపిస్తే అలర్ట్ అవ్వండి..!
ఆరోగ్యంపై అవగాహన పెంచుకొని, ప్రతి చిన్న లక్షణాన్ని కూడా దృష్టిలో ఉంచుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. స్త్రీలలో అత్యంత సాధారణ క్యాన్సర్ బ్రెస్ట్ క్యాన్సర్. అనేక కారణాలు బ్రెస్ట్ క్యాన్సర్‌కు దారితీయవచ్చు. బ్రెస్ట్ క్యాన్సర్ లక్షణాలేంటో మొదట్లోనే తెలుసుకుంటే.. వ్యాధి తీవ్రతను తగ్గించే అవకాశం ఉంటుందని వైద్యులు చెబుతున్నారు.

క్యాన్సర్.. ఇదో భయంకర మహమ్మారిగా మారి ప్రజల్ని వెంటాడుతోంది. ప్రస్తుతం చాలా మంది ఈ క్యాన్సర్ బారిన పడుతున్నారు. ఇది ఎప్పుడు ఏ రూపంలో ఎవరినీ ఎటాక్ చేస్తుందో తెలియకుండా భయపెడుతోంది. కానీ, క్యాన్సర్ అనేది ముందుగానే గుర్తించగలిగితే, సమర్థవంతమైన చికిత్స ద్వారా పూర్తిగా తగ్గించవచ్చు. ఆరోగ్యంపై అవగాహన పెంచుకొని, ప్రతి చిన్న లక్షణాన్ని కూడా దృష్టిలో ఉంచుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. స్త్రీలలో అత్యంత సాధారణ క్యాన్సర్ బ్రెస్ట్ క్యాన్సర్ (స్తన్య గ్రంధి క్యాన్సర్). అనేక కారణాలు బ్రెస్ట్ క్యాన్సర్‌కు దారితీయవచ్చు. బ్రెస్ట్ క్యాన్సర్ లక్షణాలేంటో మొదట్లోనే తెలుసుకుంటే.. వ్యాధి తీవ్రతను తగ్గించే అవకాశం ఉంటుందని వైద్యులు చెబుతున్నారు.
కారణం లేకుండా అకస్మాత్తుగా బరువు తగ్గడం బ్రెస్ట్ క్యాన్సర్ లక్షణం. రోజుల వ్వవధిలో ఐదు లేదా అంతకంటే ఎక్కువ కేజీలు బరువు తగ్గిపోతే.. వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి. స్తనాలు గట్టిపడటం, ఎర్రగా మారడం లేదా అసాధారణ వేడిని అనుభూతి చెందడం బ్రెస్ట్ క్యాన్సర్ లక్షణంగా నిపుణులు చెబుతున్నారు. అలాగే, రొమ్ములలో గడ్డలు, చనుమొనలో మార్పులు, చనుమొన నుండి డిశ్చార్జ్ లేదా చర్మంపై ఎరుపు, దద్దుర్లు వంటివి రొమ్ము క్యాన్సర్ లక్షణాలు కావచ్చు అంటున్నారు. .
రొమ్ములపై నిరంతర దురద లేదా గాయం కనిపించడం బ్రెస్ట్ క్యాన్సర్ మరో లక్షణంగా నిపుణులు చెబుతున్నారు. అలాగే, స్తన పరిమాణంలో మార్పులు రొమ్ము క్యాన్సర్ లక్షణం కావచ్చు. స్పష్టమైన కారణం లేకుండా ఒక రొమ్ము పరిమాణం పెరగడం లేదా ఆకారంలోకి మారడం కూడా బ్రెస్ట్ క్యాన్సర్ లక్షణంగా చెబుతున్నారు. చంకలో లేదా కాలర్‌బోన్ దగ్గర వాపు ఉంటుంది. రొమ్ము క్యాన్సర్ ఆ ప్రాంతంలోని శోషరస గ్రంథులకు వ్యాపిస్తుంది. కాబట్టి రొమ్ము, చుట్టు పక్కల ప్రాంతాల్లో వాపు ఉంటే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించాలని నిపుణులు సూచిస్తున్నారు.
(నోట్: ఈ కథనంలోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే.. ఏదైనా సమస్యలున్నా.. సందేహాలు ఉన్నా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది..)
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..