Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: గూగుల్ మ్యాప్స్ ఎఫెక్ట్.. నిర్మాణంలో ఫ్లైఓవర్‌ పై నుంచి దూసుకెళ్లిన కారు.. కట్‌ చేస్తే..

ఇంట్లో తయారు చేసే వంట మొదలు.. ఆఫీస్‌ వర్క్‌, చదువు, ఇతరాత్ర సందేహాలన్నీంటికి గూగుల్‌ సమాధానం చెబుతుంది. అంతేకాదు.. గూగుల్ మ్యాప్‌తో ఎంతదూరమైన, ఎలాంటి తెలియని అడ్రస్ అయినా కూడా గుగుల్ మ్యాప్‌ను అడిగితే దారిని చూపిస్తుంది. అయితే కొన్నిసార్లు ఈ గూగుల్ మ్యాప్స్‌ను నమ్ముకున్న వాళ్లు ఊహించని చిక్కుల్లో పడిన సందర్భాలు కూడా తరచూ వార్తల్లో చూస్తుంటాం.

Viral Video: గూగుల్ మ్యాప్స్ ఎఫెక్ట్.. నిర్మాణంలో ఫ్లైఓవర్‌ పై నుంచి దూసుకెళ్లిన కారు.. కట్‌ చేస్తే..
Car Falls Into Pit
Follow us
Jyothi Gadda

|

Updated on: Jun 10, 2025 | 6:39 PM

ప్రస్తుత ప్రపంచమంతా గూగుల్‌ మీదే ఆధారపడి పనిచేస్తుందని చెప్పాలి.. ఎందుకంటే.. చాలా మంది ఉదయం నిద్రలేచింది మొదలు.. రాత్రి పడుకునే వరకు ఏదో ఒక సందర్భంలో గూగుల్‌ని ఆశ్రయిస్తుంటారు. గూగుల్‌ని నమ్ముకుని చాలా మంది చాలా రకాల పనులు చేస్తుంటారు. ఇంట్లో తయారు చేసే వంట మొదలు.. ఆఫీస్‌ వర్క్‌, చదువు, ఇతరాత్ర సందేహాలన్నీంటికి గూగుల్‌ సమాధానం చెబుతుంది. అంతేకాదు.. గూగుల్ మ్యాప్‌తో ఎంతదూరమైన, ఎలాంటి తెలియని అడ్రస్ అయినా కూడా గుగుల్ మ్యాప్‌ను అడిగితే దారిని చూపిస్తుంది. అయితే కొన్నిసార్లు ఈ గూగుల్ మ్యాప్స్‌ను నమ్ముకున్న వాళ్లు ఊహించని చిక్కుల్లో పడిన సందర్భాలు కూడా తరచూ వార్తల్లో చూస్తుంటాం. అలాగే, తాజాగా గూగుల్ మ్యాప్‌ను నమ్ముకున్న ఓ డ్రైవర్‌కు చుక్కలు చూపించింది.

సాధారణంగా ఏదైనా తెలియ‌ని ఊళ్ల‌కు వెళ్లేట‌ప్పుడు గూగుల్ మ్యాప్స్ స‌హాయం తీసుకుంటుంటారు చాలా మంది అది రైటంటే రైటు.. లెఫ్టంటే లెఫ్టు స్టీరింగ్ తిప్పుతూ వెళ్తుంటారు. సరిగ్గా అలాంటి పనినే చేశాడు యూపీకి చెందిన ఒక డ్రైవర్‌. యూపీలోని మహారాజ్‌గుంజ్‌లో గమ్యస్థానానికి వెళ్లడానికి.. గూగుల్ మ్యాప్స్‌లో లొకేషన్ పెట్టుకున్న ఓ డ్రైవర్‌కు ఊహించని సీన్‌ ఎదురైంది. గూగుల్‌ మ్యాప్స్‌ ఆధారంగా అతడు అది చూపించే డైరెక్షన్స్ చూస్తూ.. నిర్మాణంలో ఉన్న ఫ్లైఓవర్‌పైకి వెళ్ళాడు. ముందుకు వెళ్లేందుకు రహదారి లేదని గుర్తించేలోపే ఒక్కసారి కారు ప్రమాదవశాత్తు కిందపడిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఇవి కూడా చదవండి

వీడియో ఇక్కడ చూడండి…

వైరల్‌ అవుతున్న ఈ వీడియోలోని సంఘటన జూన్ 8 ఆదివారం జరిగింది. లక్నో నంబర్ ప్లేట్ ఉన్న కారు గోరఖ్‌పూర్ నుండి సోనౌలి సరిహద్దుకు ప్రయాణిస్తోందని తెలుస్తోంది. ప్రయాణికులు నావిగేషన్ కోసం గూగుల్ మ్యాప్స్‌పై ఆధారపడ్డారని తెలిసింది. యాప్ సూచించిన మార్గాన్ని అనుసరిస్తుండగా, వారు ఫరెండా పోలీస్ స్టేషన్ ప్రాంతానికి సమీపంలో గోరఖ్‌పూర్-సోనౌలి హైవేపై నిర్మాణంలో ఉన్న ఫ్లైఓవర్‌ ఎక్కారు. అసంపూర్తిగా ఉన్న ఆ ఫ్లైఓవర్‌ పైనుంచి కారు అమాంతంగా కిందకు గొయ్యిలోకి పడిపోయింది. అదృష్టవశాత్తూ కారులో ఉన్న వారంతా సురక్షితంగా బయటపడటంతో ప్రమాదం తప్పింది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..